iDreamPost

MS Dhoni: లాంగ్ హెయిర్ తో గ్రౌండ్ లో ధోని! ఎన్నాళ్ళకి ఈ దర్శనం!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత క్రేజ్ ఉందో.. ధోనికి అంతటి ఫాలోయింగ్ ఉంది. ఈ సీజన్ లో ధోని పొడుగు జుట్టు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్ లోనే అద్భుతం జరిగింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత క్రేజ్ ఉందో.. ధోనికి అంతటి ఫాలోయింగ్ ఉంది. ఈ సీజన్ లో ధోని పొడుగు జుట్టు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్ లోనే అద్భుతం జరిగింది.

MS Dhoni: లాంగ్ హెయిర్ తో గ్రౌండ్ లో ధోని! ఎన్నాళ్ళకి ఈ దర్శనం!

ఇండియన్ ప్రీమియర్ లీగ్, ధనా ధన్ క్రికెట్, మస్తు మజా.. ఇవన్నీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆనందాలు. అయితే.. వీటి వల్లే ఐపీఎల్ కి ఇంతటి క్రేజ్ వచ్చిందా అంటే కచ్చితంగా కాదు. సచిన్, గంగూలీ, ద్రవిడ్ వంటి స్టార్స్.. తమలో తాము విడిపోయి మ్యాచ్ లు ఆడటం అనే కాన్సెప్ట్ మొదట్లో ఈ లీగ్ కి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. అయితే.., తరువాత కాలంలో ఈ క్రేజ్ ని మరో మెట్టు పైకి ఎక్కించిన వారు మాత్రం ధోని, కోహ్లీ, రోహిత్ అని గట్టిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐపీఎల్ లో ధోనికి ఉండే క్రేజ్ గురించి, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చెన్నై జట్టు కెప్టెన్ గా 5 సార్లు ట్రోఫీని ముద్దాడిన ఘనత ఈ లెజండ్రీ ప్లేయర్ సొంతం. ఇక ఈ సీజన్ లో ధోని చెన్నై జట్టుకి కెప్టెన్ కూడా కాదు. అయినా.. తలైవా క్రేజ్ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఐపీఎల్ -2024 ఆరంభానికి ముందు టెలికాస్ట్ అయిన కొన్ని విజువల్స్ ఇప్పుడు ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయి.

ఈ ఐపీఎల్ తొలి మ్యాచ్ లో చెన్నై- ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. అయితే.. ఈ మ్యాచ్ టాస్ ఓ పది నిముషాలు ఆలస్యం కావడంతో కెమెరా మేన్ ఆటగాళ్ల ప్రాక్టీస్ పై కాస్త ఫోకస్ పెట్టాడు. అయితే.. ఇక్కడే అద్భుతం జరిగింది. గ్రౌండ్ లో ధోని కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఫిట్ బాడీ, అదే అందం, అన్నిటికీ మించి ఆ పొడుగు జట్టుతో ధోని కనిపించడంతో గ్రౌండ్ అంతా పూనకాలతో ఊగిపోయింది. మహీ.., మహీ అంటూ చెపాక్ స్టేడియంలో ఫ్యాన్స్ ఒకటే విజిల్స్. ఇలా పులకించిపోయిన వారిలో బెంగుళూరు జట్టు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో ధోని ఇలా పొడుగు జుట్టుతో కనిపించాడు. తరువాత కాలంలో కెప్టెన్ అయ్యాక.. హెయిర్ స్టయిల్ మార్చేశాడు. ఇన్నాళ్ళకి మళ్ళీ మహీ భాయ్ లాంగ్ హెయిర్ తో కనిపించడంతో అంతా పాత రోజులను నెమరువేసుకున్నారు.

Dhoni

ధోని లాంగ్ హెయిర్ ఎందుకు ప్రత్యేకం?:

2004లో ధోని టీమిండియాలోకి అడుగు పెట్టే సమయానికి.. కీపింగ్ లో ఇండియా పరిస్థితి అంత గొప్పగా లేదు. అప్పటి జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ సమస్యతోనే ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండేవాడు. దేశంలో ఉన్న కీపర్స్ అందరిని ట్రై చేసినా.. వారెవ్వరు బ్యాటింగ్ లో హిట్ అయ్యింది లేదు. పిల్లాడైన పార్దీప్ పటేల్ ని కూడా కొన్ని మ్యాచ్ లు ఆడించాడు దాదా. ఇక చివరికి ద్రవిడ్ కి కీపింగ్ బాధ్యతలు అప్పగించి.. గంగూలీ సరైన కీపర్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అప్పుడు బంగ్లా సిరిస్ కి సెలక్ట్ అయ్యాడు ధోని. పెద్దగా మెరుపులు లేవు. కానీ.., తర్వాత పాకిస్థాన్ సిరీస్ లో మెరుపులు మెరిపించాడు. రెండో వన్డే లో పాక్ బౌలింగ్ ని చిత్తు చేస్తూ మన విశాఖలో 148 పరుగులు సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు ధోని.

15 ఫోర్లు, నాలుగు సిక్స్ లు కొట్టి ఇండియన్ క్రికెట్ కి క్రీడా లోకాన్ని తనవైపుకి తిప్పుకున్నాడు. ఇక అక్కడ నుండి జరిగింది అంతా ఒక చరిత్ర. ఏకంగా అప్పటి పాక్ ప్రధాని ముషారఫ్ కూడా ధోని హెయిర్ స్టయిల్ పై కామెంట్స్ చేయాల్సి వచ్చింది. ఎక్కడో జార్ఖండ్ నుండి వచ్చిన ఓ పొడుగు జుట్టు చిచ్చరపిడుగు అలా సిక్స్ లు కొట్టడంతో.. ధోని, అతని హెయిర్ స్టయిల్ ప్రేక్షకుల మదిలో అలా ముద్రించుకుపోయాయి. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత మహీ.. ఇలా పొగుడు జుట్టుతో కనిపించడంతో ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. మరి.. లాంగ్ హెయిర్ తో బరిలోకి దిగుతున్న ధోని ఈసారి.. అలనాటి మెరుపులు మెరిపిస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి