Nidhan
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యాడు. అయితే ఈసారి అతడి స్వార్థమే విమర్శలకు కారణంగా మారింది.
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యాడు. అయితే ఈసారి అతడి స్వార్థమే విమర్శలకు కారణంగా మారింది.
Nidhan
హార్దిక్ పాండ్యా.. మినీ ఆక్షన్ టైమ్ నుంచి వార్తల్లో నిలుస్తున్న ప్లేయర్. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా అతడ్ని నియమించడంతో అప్పట్లో హాట్ టాపిక్‌గా మారాడు. ఐపీఎల్-2024 మొదలైనప్పటి నుంచి వస్తున్న వార్లల్లో ఎక్కువగా పాండ్యా పేరే వినిపిస్తోంది. అందులోనూ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉందంటే అన్ని విషయాలు అతడి చుట్టూనే తిరుగుతున్నాయి. టాస్ దగ్గర నుంచి మ్యాచ్ ముగిసే వరకు ఫ్యాన్స్ మూకుమ్మడిగా టార్గెట్ చేసుకొని మరీ హార్దిక్‌ను అవమానించడం, ఎగతాళి చేయడం చూస్తూనే ఉన్నాం. కెప్టెన్సీ మార్పు అంశం ద్వారా అందరి లక్ష్యంగా మారిన పాండ్యాను ఫ్యాన్స్ వదిలేలా కనిపించడం లేదు. ఈ తరుణంలో వాళ్ల మనసులు గెలుచుకునేందుకు ప్రయత్నించాల్సిన ముంబై సారథి.. ఓ సెల్ఫిష్ పనితో మళ్లీ టార్గెట్ అయ్యాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో వాంఖడే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. హ్యాట్రిక్ ఓటముల్ని మూటగట్టుకొని లీగ్ పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ టైమ్‌లో పాండ్యా వ్యవహరించిన తీరు మీద విమర్శలు వస్తున్నాయి. అప్పుడప్పడే బ్యాటింగ్ మొదలుపెట్టింది ఎంఐ. స్టేడియానికి వచ్చిన ఆడియెన్స్ సీట్లలో కూర్చునే లోపే 3 వికెట్లు పడ్డాయి. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన నమన్ ధీర్‌తో పాటు సెకండ్ డౌన్లో వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్ కూడా ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ అయ్యారు. వీళ్లిద్దర్నీ ట్రెంట్ బౌల్ట్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో క్రీజులోకి అడుగుపెట్టాడు హార్దిక్.
ముంబై ఇన్నింగ్స్‌లో అది మూడో ఓవర్. హార్దిక్ నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో, స్ట్రయికింగ్ ఎండ్‌లో తిలక్ వర్మ ఉన్నారు. మూడు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు తీసి ఫుల్ జోష్‌లో ఉన్నాడు పేసర్ బౌల్ట్. ఆ ఓవర్లో మరో 2 బంతులు మిగిలి ఉన్నాయి. ఆ టైమ్‌లో 5వ బంతికి సింగిల్ తీసే ఛాన్స్ ఉన్నా పాండ్యా కావాలని వెళ్లలేదు. ఒకవేళ రన్ తీస్తే తాను స్ట్రయికింగ్ ఎండ్‌కు వెళ్లాలి. బౌల్ట్ సూపర్బ్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో తాను ఔట్ అవుతానని భయపడ్డ పాండ్యా.. తిలక్ రమ్మన్నా సింగిల్‌కు వెళ్లలేదు. నెక్స్ట్ బాల్ తిలక్ క్యాచ్ ఇవ్వగా.. దాన్ని చాహల్ డ్రాప్ చేయడంతో బతికిపోయాడు.
ఆ క్యాచ్ పట్టి ఉంటే హార్దిక్ వల్ల తిలక్ ఔట్ అయ్యేవాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు. ఇంత స్వార్థం అవసరమా? కెప్టెనే భయపడితే మిగతా ప్లేయర్లు ఎలా ఆడాలి అంటూ విమర్శిస్తున్నారు. తాను రన్స్ చేయాలి, తన వికెట్ కాపాడుకోవాలి, మిగిలిన వాళ్లు ఏమైనా ఫర్వాలేదనే మెంటాలిటీ కరెక్ట్ కాదని సీరియస్ అవుతున్నారు. ఛాలెంజ్ వచ్చినప్పుడు పాండ్యా కెప్టెన్ కాబట్టి దాన్ని స్వీకరించి.. ఒకవేళ ఔట్ అయినా ప్రశంసలు దక్కుతాయని, ఇలా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే విమర్శలు తప్పవని కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ సెల్ఫిష్నెస్ వల్ల తిలక్ ఔట్ అయ్యేవాడని.. ఇంక మారవా సామి అంటూ సీరియస్ అవుతున్నారు. మరి.. తిలక్ విషయంలో పాండ్యా వ్యవహరించిన తీరు మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. IPL హిస్టరీలోనే తొలి జట్టుగా..!