iDreamPost

MI vs DC: ముంబై vs ఢిల్లీ.. గెలిచేదెవరంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

  • Published Apr 06, 2024 | 5:23 PMUpdated Apr 06, 2024 | 5:23 PM

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్​లో దిగువన ఉన్న రెండు టీమ్స్​ మధ్య సండే ఫైట్​కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్​తోనైనా బోణీ కొట్టాలని ముంబై.. రెండో గెలుపుతో సక్సెస్ ట్రాక్ మీదకు రావాలని ఢిల్లీ పట్టుదలతో ఉన్నాయి.

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్​లో దిగువన ఉన్న రెండు టీమ్స్​ మధ్య సండే ఫైట్​కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్​తోనైనా బోణీ కొట్టాలని ముంబై.. రెండో గెలుపుతో సక్సెస్ ట్రాక్ మీదకు రావాలని ఢిల్లీ పట్టుదలతో ఉన్నాయి.

  • Published Apr 06, 2024 | 5:23 PMUpdated Apr 06, 2024 | 5:23 PM
MI vs DC: ముంబై vs ఢిల్లీ.. గెలిచేదెవరంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

ఐపీఎల్ పాయింట్స్ టేబుల్​లో దిగువన ఉన్న రెండు టీమ్స్​ మధ్య సండే ఫైట్​కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్​తోనైనా బోణీ కొట్టాలని ముంబై.. రెండో గెలుపుతో సక్సెస్ ట్రాక్ పట్టాలని ఢిల్లీ పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్​ ఉత్కంఠగా సాగడం ఖాయం. రెండు టీమ్స్ గెలిచి తీరాలని అనుకుంటున్నాయి కాబట్టి మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్లడం పక్కా. హ్యాట్రిక్ ఓటముల వల్ల ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆ టీమ్​ కచ్చితంగా గెలవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​లో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలా ఉండనుంది? విజయావకాశాలు ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం..

ముంబై ఇండియన్స్

ముంబైలో ప్లస్​ల కంటే మైనస్​లే ఎక్కువగా ఉన్నాయి. ఆ టీమ్ ఓపెనింగ్ సరిగ్గా లేదు. మొదట్లో అదరగొట్టిన రోహిత్ శర్మ రాజస్థాన్ రాయల్స్​పై గోల్డెన్​గా డక్​గా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ కూడా పెద్ద ఫామ్​లో ఏమీ లేడు. ఓపెనర్ల ఫెయిల్యూర్​ టీమ్​ బలహీనతగా మారింది. నమన్ ధీర్, డెవాల్డ్ బ్రేవిస్ నిలకడలేమి కూడా జట్టును వేధిస్తోంది. తిలక్ వర్మ మంచి టచ్​లో ఉండటం కలిసొచ్చే అంశం. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన పొటెన్షియల్​కు తగ్గట్లు ఆడటం లేదు. మ్యాచ్​లు ఫినిష్ చేయడంతో పాటు బౌలింగ్​లోనూ అతడు తేలిపోతుండటం ఎంఐకి మరో మైనస్. బౌలింగ్​లో ఆకాశ్ మధ్వాల్ వికెట్లు తీస్తుండటం బిగ్ ప్లస్. జస్​ప్రీత్ బుమ్రా పరుగులు కట్టడి చేస్తున్నాడు. అయితే మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం మైనస్.

ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ జట్టు ఆడిన 4 మ్యాచుల్లో మూడింట ఓడి నిరాశలో ఉంది. గత మ్యాచ్​లో కోల్​కతా నైట్ రైడర్స్ చేతిలో 106 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఆ ఒక్క మ్యాచ్​ను తీసేస్తే అంతకుముందు అన్ని మ్యాచుల్లోనూ ఢిల్లీ ఆటతీరు బాగుంది. కేకేఆర్ మీద డీసీ బౌలర్లు అట్టర్​ఫ్లాప్ అయ్యారు. నోకియా, ఇషాంత్ సహా బౌలర్లు అంతా ఫెయిలయ్యారు. వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. బ్యాటింగ్​లో కెప్టెన్ రిషబ్ పంత్ రెడ్ హాట్ ఫామ్​లో ఉండటం డీసీకి బిగ్ ప్లస్. ట్రిస్టన్ స్టబ్స్ కూడా మంచి టచ్​లో ఉండటం కలిసొచ్చే అంశం. డేవిడ్ వార్నర్​కు తోడు మరో ఓపెనర్ పృథ్వీ షా రిథమ్​లోకి వస్తే ఆ టీమ్​కు తిరుగుండదు. అయితే మిచెల్ మార్ష్​ ఫెయిల్యూర్ పంత్ సేనకు పెద్ద వర్రీగా మారింది. అదే టైమ్​లో గాయంతో ఇబ్బంది పడుతున్న కుల్దీప్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఆ జట్టు సమస్యలు మరింత పెరిగాయి.

ప్రిడిక్షన్

రెండు టీమ్స్ బలాబలాలను బట్టి ఈ మ్యాచ్​లో ముంబై ఇండియన్స్ గెలవడం ఖాయం. వరుస ఓటములతో కసిగా ఉన్న హార్దిక్ సేన ఈ మ్యాచ్​తో బోణీ కొట్టడం పక్కా. ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్​లు జరిగాయి. ఇందులో ఢిల్లీ 15 సార్లు నెగ్గగా.. ముంబై 18 సార్లు గెలిచింది. డీసీ కూడా బలంగా ఉన్నా.. ప్రెజర్​లో ఉన్న ముంబై జూలు విదిల్చి ఆడటం పక్కాగా కనిపిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్​లో ఫస్ట్ నుంచే డామినేట్ చేయాలని ఫిక్స్ అయింది ఎంఐ.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

ముంబై: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కొయెట్జీ, పీయుష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జస్​ప్రీత్ బుమ్రా, క్వెనా మఫాకా.

ఢిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, రసిఖ్ దార్ సలామ్, అన్రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.

ఇదీ చదవండి: T20 వరల్డ్ కప్ కాదు.. నా టార్గెట్ అక్కడ ఆడటమే: మయాంక్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి