iDreamPost
android-app
ios-app

LSG vs DC: కృనాల్ పాండ్యా పిచ్చి పని! నిన్న మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని ఘటన!

  • Published Apr 13, 2024 | 4:00 PM Updated Updated Apr 13, 2024 | 4:00 PM

లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో కృనాల్ పాండ్యా చేసిన పిచ్చి పనికి విమర్శల పాలవుతున్నాడు. దీంతో నువ్వు కూడా మీ సోదరుడు హార్దిక్ పాండ్యా లాగే చేస్తున్నావ్ అంటూ విమర్శిస్తున్నారు. అసలేం జరిగిందంటే?

లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో కృనాల్ పాండ్యా చేసిన పిచ్చి పనికి విమర్శల పాలవుతున్నాడు. దీంతో నువ్వు కూడా మీ సోదరుడు హార్దిక్ పాండ్యా లాగే చేస్తున్నావ్ అంటూ విమర్శిస్తున్నారు. అసలేం జరిగిందంటే?

LSG vs DC: కృనాల్ పాండ్యా పిచ్చి పని! నిన్న మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని ఘటన!

ఐపీఎల్ 2024 సీజన్ లో లక్నో రెండో పరాజయాన్ని చవిచూస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. తాజాగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ టీమ్ 6 వికెట్ల తేడాతో రాహుల్ టీమ్ ను చిత్తుచేసింది. ఈ సీజన్ లో వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న లక్నోకు వరుసగా రెండో షాక్ తగిలింది. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్ అదరగొట్టాడు. డెబ్యూ మ్యాచ్ లోనే సిక్సర్ల వర్షం కురిపించి.. ఫిఫ్టీ కొట్టి టీమ్ కు విజయాన్ని అందించాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో ఎవ్వరూ గమనించని ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృనాల్ పాండ్యా ఓ పిచ్చి పని చేశాడు. అదేంటంటే?

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కొంత మంది ప్లేయర్లు సహనం కోల్పోతూ ఉంటారు. ఫీల్డర్లు క్యాచ్ లు మిస్ చేసినప్పుడు కెప్టెన్స్ తమ నోటికి పనిచెప్పడం మనం ఎన్నోసార్లు చూశాం. ఇక బ్యాటర్లు కవ్విస్తే.. వారిని ఔట్ చేసి పెవిలియన్ కు పంపడం కూడా చూసే ఉన్నాం. తాజాగా లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్నో బౌలర్ కృనాల్ పాండ్యా పిచ్చిపని చేశాడు. దీంతో సీనియర్ బౌలర్ అయి ఉండి కూడా డెబ్యూ ఆటగాడిపై ఇలా ప్రవర్తించడం ఏంటి? అంటూ నెటిజన్లు కృనాల్ ను విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?

కృనాల్ పాండ్యా ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేయడానికి వచ్చాడు. అప్పుడు క్రీజ్ లో ఆస్ట్రేలియా నయా సంచలనం జేక్ ఫ్రేజర్ 23 బంతుల్లో 25 పరుగులతో, ఢిల్లీ కెప్టెన్ పంత్ 18 బంతుల్లో 29 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న కృనాల్ డెబ్యూ ప్లేయర్ ఫ్రేజర్ కు బౌలింగ్ చేయడం చాలా సులువు అనుకున్నాడు. కానీ తొలి బాల్ కే పాండ్యాకు షాకిస్తూ.. ఓవర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు. ఇక రెండో బంతిని సైతం స్టాండ్స్ కు పంపాడు ఫ్రేజర్. డీప్ ఎక్స్ ట్రా కవర్ మీదుగా వెళ్లి బంతి ప్రేక్షకుల్లో పడింది. దీంతో పాండ్యాకు చిర్రెత్తుకొచ్చింది. నెక్ట్స్ బాల్ అతడిని ఔట్ చేయాలని కసితో ఉన్నాడు.

కానీ అరంగేట్ర ప్లేయరే అయినప్పటికీ.. ఫ్రేజర్ ఎంతో కూల్ గా మూడో బంతిని కూడా సిక్సర్ గా మలిచాడు. దీంతో కంగుతిన్నాడు కృనాల్. వరుసగా 3 బంతులను సిక్సర్లుగా బాదడంతో.. పాండ్యాకు సహనం నశించింది. ఆ తర్వాత బంతిని బౌన్సర్ గా వేశాడు. అది కాస్తా వైడ్ గా మారింది. కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఒడిసిపట్టడంతో సరిపోయింది లేదంటే అది కాస్త బౌండరీ వెళ్లేదే. సహనం కోల్పోయి ఓ స్పిన్ బౌలర్ బౌన్సర్ వేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పిచ్చిపని ఏంటి? అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. మీ సోదరుడు హార్దిక్ పాండ్యా కూడా ఇలాగే చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని ప్రవర్తిస్తుంటాడు. అలాగే తొలి ఓవర్ తానే వేయాలనుకుంటాడని దుమ్మెత్తి పోస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరు ఇద్దరే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. బౌన్సర్ తో బ్యాటర్ ను గాయపర్చాలి అనుకోవడం కరెక్ట్ కాదు అంటూ ఇంకొందరు కృనాల్ ను తిడుతున్నారు. ఫ్రేజర్ దెబ్బకి భయపడ్డ పాండ్యా ఈ ఓవర్ లో ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. పాండ్యా బ్రదర్స్ కు కాస్త కోపం ఎక్కువే అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రాసుకొస్తున్నారు. ఇక ఫ్రేజర్ ధాటికి లక్నో నిర్దేశించిన 168 పరుగుల టార్గెట్ ను 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

 

View this post on Instagram

 

A post shared by CricTracker (@crictracker)