Nidhan
బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మెరుపు బౌలర్ మళ్లీ వస్తున్నాడు. అతడ్ని ఆపడం ఇక ఎవరి తరం కాదు. ఆ బౌలర్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మెరుపు బౌలర్ మళ్లీ వస్తున్నాడు. అతడ్ని ఆపడం ఇక ఎవరి తరం కాదు. ఆ బౌలర్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఈ ఐపీఎల్ సీజన్ ఎన్నో రికార్డులకు వేదికగా నిలిచింది. సగం మ్యాచులు పూర్తయ్యే సరికి హయ్యెస్ట్ స్కోరు రికార్డు రెండు సార్లు బ్రేక్ అయింది. ఈ రెండు సార్లూ సన్‌రైజర్స్ హైదరాబాదే చరిత్రను తిరగరాసింది. రికార్డులను అటుంచితే.. ఈసారి లీగ్‌లో ఎందరో యంగ్ క్రికెటర్స్ ఫస్టాఫ్‌లో తమ సత్తా చూపించారు. రియాన్ పరాగ్ దగ్గర నుంచి అభిషేక్ శర్మ వరకు చాలా మంది యువ బ్యాటర్లు అదరగొట్టారు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో చూస్తుండగానే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. బ్యాటర్లే కాదు.. నిఖార్సయిన పేస్ బౌలింగ్‌తో ఓ యంగ్‌స్టర్ ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచుల్లోనే 7 వికెట్లతో ప్రత్యర్థి జట్టను బెంబేలెత్తించాడు. అయితే గాయం కారణంగా తర్వాతి మ్యాచులకు దూరమైన ఆ ప్లేయర్ మళ్లీ వచ్చేస్తున్నాడు.
ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. బుల్లెట్ బంతులతో బ్యాటర్లను భయపెట్టే మయాంక్ యాదవ్ వచ్చేస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో గాయడిన ఈ లక్నో ఎక్స్‌ప్రెస్ అర్ధాంతరంగా స్టేడియాన్ని వీడాడు. ఆ తర్వాత పలు మ్యాచులకు దూరమైన మయాంక్ కమ్‌బ్యాక్‌పై ఆసక్తి నెలకొంది. అతడు లేకపోవడంతో ఎల్ఎస్జీ బౌలింగ్ యూనిట్ బలహీనంగా మారింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఆ టీమ్ ఓటమిపాలైంది. మయాంక్ లేకపోవడం రాహుల్ సేన విజయావకాశాల మీద తీవ్రంగా ప్రభావం చూపించింది. దీంతో ఈ ఏస్ పేసర్ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడా అని లక్నో అభిమానులు ఎదురు చూడసాగారు. అయితే వాళ్ల వెయిటింగ్‌కు ఫుల్స్టాప్ పడింది. మయాంక్ కమ్‌బ్యాక్‌కు రెడీ అవుతున్నాడు. ఇంజ్యురీ నుంచి కోలుకున్న నయా పేసుగుర్రం తిరిగి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మళ్లీ ఎగరడం మొదలెట్టాడు అంటూ మయాంక్ బౌలింగ్ వీడియోకు క్యాప్షన్ జత చేసి పోస్ట్ చేసింది ఎల్ఎస్జీ. దీంతో లక్నో ఫ్యాన్స్‌తో పాటు ఐపీఎల్ అభిమానులు ఖుష్ అవుతున్నారు. మయాంక్ బౌలింగ్‌ను చూసేందుకు వెయిట్ చేస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్పీడ్‌స్టర్ రీఎంట్రీపై కేఎల్ రాహుల్ రియాక్ట్ అయ్యాడు. మయాంక్ ఇప్పుడు బాగున్నాడని, కానీ అతడ్ని తొందరపెట్టడం తమకు ఇష్టం లేదన్నాడు. అతడి శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నాడు. 100 పర్సెంట్ ఫిట్‌గా ఉంటేనే అతడ్ని బరిలోకి దించుతామని రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. ఫ్యాన్స్ కూడా తొందరలేదని, కొన్ని మ్యాచులు మిస్సయినా ఫర్లేదు.. మయాంక్‌ను ఫిట్‌గా ఉన్నప్పుడే ఆడించాలని చెబుతున్నారు. మరి.. మయాంక్ కమ్‌బ్యాక్ కోసం మీరెంత ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.
Phir se udd chala 🔥🧿 pic.twitter.com/q8CP55Bkgk
— Lucknow Super Giants (@LucknowIPL) April 17, 2024