iDreamPost

వీడియో: టాస్ టైమ్​లో అయ్యర్ చేసిన పని వైరల్.. ఆలస్యంగా వెలుగులోకి!

  • Published Apr 17, 2024 | 9:49 PMUpdated Apr 18, 2024 | 7:55 AM

కోల్​కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన ఓ పని వైరల్ అవుతోంది. రాజస్థాన్ రాయల్స్​తో మ్యాచ్​లో అతడు చేసిన పనిని ఎవరూ గమనించలేదు.

కోల్​కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన ఓ పని వైరల్ అవుతోంది. రాజస్థాన్ రాయల్స్​తో మ్యాచ్​లో అతడు చేసిన పనిని ఎవరూ గమనించలేదు.

  • Published Apr 17, 2024 | 9:49 PMUpdated Apr 18, 2024 | 7:55 AM
వీడియో: టాస్ టైమ్​లో అయ్యర్ చేసిన పని వైరల్.. ఆలస్యంగా వెలుగులోకి!

రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో విక్టరీ కొట్టింది. ఉత్కంఠభరింతగా సాగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్ రైడర్స్​ను 2 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన కేకేఆర్ ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ మొదలుపెట్టిన రాజస్థాన్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. 121 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిందా జట్టు. ఆఖరి 6 ఓవర్లలో 90కి పైగా పరుగులు బాదాలి. కానీ ఓటమిని ఒప్పుకోని సీనియర్ బ్యాటర్ జాస్ బట్లర్ (60 బంతుల్లో 107 నాటౌట్) ఆఖరి వరకు క్రీజులో నిలిచి రాజస్థాన్​ను గెలిపించాడు. కోల్​కతా కూడా అద్భుతంగా పోరాడినా ఆర్ఆర్ పట్టుదల ముందు నిలవలేకపోయింది. అయితే ఈ మ్యాచ్​లో ఓ సీన్​ను ఎవరూ గమనించలేదు.

నిన్నటి మ్యాచ్​లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన ఓ పని ఇప్పుడు వైరల్ అవుతోంది. టాస్​ టైమ్​లో అతడు చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మ్యాచ్ ఆరంభానికి ముందు కేకేఆర్ తరఫున అయ్యర్, రాజస్థాన్​ కెప్టెన్ సంజూ శాంసన్ గ్రౌండ్​లోకి వచ్చారు. టాస్ వేయాల్సిందిగా కాయిన్​ను అయ్యర్​కు ఇచ్చారు నిర్వాహకులు. అయితే కాయిన్​ను చేతిలోకి తీసుకున్న కేకేఆర్ సారథి ఎడమ వైపునకు తిరిగి దాన్ని కిస్ చేశాడు. తానే టాస్ నెగ్గాలని కోరుకొని వేశాడు. కానీ అతడు అనుకున్నది జరగలేదు. సంజూ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయ్యర్ టాస్ కాయిన్​ను కిస్ చేసిన విషయం గురించి కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా ప్రస్తావించాడు.

కిస్ పెట్టినా టాస్ నెగ్గని అయ్యర్ నిరాశతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. టాస్ ఓడిన అతడు బ్యాటింగ్​లోనూ 11 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్​లో కేకేఆర్ ఓడిపోయింది. ఇలా అతడికి టాస్ దగ్గర నుంచి మ్యాచ్ పూర్తయ్యే వరకు చాలా విషయాలు కలసిరాలేదు. శ్రేయస్ టాస్ కాయిన్​​ను ముద్దాడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ అతడి టైమ్ బాగోలేదని అంటున్నారు. టాస్ కలసి వస్తే మ్యాచ్​లో కూడా కేకేఆర్ నెగ్గేదేమోనని.. కానీ కిస్ చేసినా బ్యాడ్ లక్ అయ్యర్​ను పలకరించిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో ఓడిన కేకేఆర్ పాయింట్స్ టేబుల్​లో రెండో స్థానంగా ఉండగా.. నెగ్గిన రాజస్థాన్ టాప్​కు చేరుకుంది. మరి.. అయ్యర్ టాస్​ కాయిన్​ను కిస్ చేయడంపై మీ రియాక్షన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి