Nidhan
కోల్‌కతా నైట్ రైడర్స్ క్రేజీ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానిది చేసి చూపించింది అయ్యర్ సేన.
కోల్‌కతా నైట్ రైడర్స్ క్రేజీ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానిది చేసి చూపించింది అయ్యర్ సేన.
Nidhan
ఐపీఎల్-2024 సీజన్ ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా ఈసారి ప్లేఆఫ్స్ రేసు చాలా ఆశ్చర్యకరంగా సాగింది. ప్లేఆఫ్స్ బెర్త్ పక్కా అనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ గ్రూప్ దశ నుంచే వైదొలిగింది. నెల కింద వరకు రేసులో లేని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు దర్జాగా ప్లేఆఫ్స్ గడప తొక్కింది. వరుస ఓటములతో అడ్రెస్ లేకుండా పోయిన ఆ జట్టు.. ఆ తర్వాత ఆడిన 6 మ్యాచుల్లోనూ విజయాలతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. ఎలాంటి అంచనాలు లేని సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా అద్భుతంగా ఆడుతూ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. వీటి కంటే ముందు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ప్లేఆఫ్స్‌లోకి అందరి కంటే ముందు అడుగు పెట్టిన కోల్‌కతా చరిత్ర సృష్టించింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ముగిసేసరికి ఆ టీమ్ నెట్ రన్ రేట్ +1.428గా ఉంది. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఇంత బాగా నెట్ రన్ రేట్ ఏ టీమ్‌కూ లేదు. ఒక సీజన్లో బెస్ట్ రన్ రేట్ కలిగిన జట్టుగా కేకేఆర్ అరుదైన ఘనతను అందుకుంది. 5 సార్లు కప్పులు గెలిచిన చెన్నై, ముంబై వంటి టాప్ టీమ్స్ కూడా ఇంత మంచి నెట్ రన్ రేట్ ఎప్పుడూ సాధించలేదు. కానీ అయ్యర్ సేన ఈ సీజన్లో అటాకింగ్ గేమ్‌తో అద్భుత విజయాలు సాధిస్తూ గ్రూప్ దశ ముగిసేసరికి ఈ ఫీట్‌ను నమోదు చేసింది. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో కేకేఆర్ ఆడాల్సిన మ్యాచ్ రద్దయిది.
వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే కేకేఆర్-ఆర్ఆర్ మ్యాచ్ రద్దయింది. వాన ఎంతకీ ఆగకపోవడంతో గేమ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అంపైర్లు. ఒకవేళ మ్యాచ్ జరిగి ఉంటే అందులో గెలుపోటములను బట్టి కోల్‌కతా నెట్ రన్ రేట్ మెరుగయ్యేది లేదా తగ్గేదేమో. కానీ మ్యాచ్ రద్దవడంతో 1 పాయింట్ ఖాతాలో చేరడంతో అరుదైన ఘనతను అందుకుంది. ఈ మ్యాచ్ రద్దయినా కానీ మిగిలిన మ్యాచుల్లో టీమ్ ప్లేయర్లు ఆడిన తీరు వల్లే ఇన్ని విజయాలు, రికార్డులు నమోదు చేసింది కోల్‌కతా. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి సూపర్ పెర్ఫార్మెన్స్కు అయ్యర్ కెప్టెన్సీ, గంభీర్ మెంటార్షిప్ తోడవడంతో ఆ టీమ్ సక్సెస్ బాటలో నడుస్తోంది. మరి.. కేకేఆర్ రేర్ ఫీట్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
HISTORY CREATED BY KKR…!!!
– Kolkata has the best NRR by a team in an IPL season: +1.428. 🤯 pic.twitter.com/Keq3GWimUJ
— Johns. (@CricCrazyJohns) May 19, 2024