iDreamPost

ఒక్క ట్రిక్​తో మ్యాచ్​ను మార్చేసిన అయ్యర్.. ఇది ముందే గ్రహిస్తే RCB నెగ్గేది!

  • Published Apr 22, 2024 | 2:03 PMUpdated Apr 22, 2024 | 2:03 PM

హైస్కోరింగ్ ఫైట్​లో ఆర్సీబీని ఓడించింది కేకేఆర్. ఈ గెలుపులో​ శ్రేయస్ అయ్యర్​ కీలకపాత్ర పోషించాడు. బ్యాట్​తో రాణించిన అతడు.. బౌలింగ్ టైమ్​లోనూ ఓ ట్రిక్​ను వాడాడు. అది భలేగా వర్కౌట్ అయింది.

హైస్కోరింగ్ ఫైట్​లో ఆర్సీబీని ఓడించింది కేకేఆర్. ఈ గెలుపులో​ శ్రేయస్ అయ్యర్​ కీలకపాత్ర పోషించాడు. బ్యాట్​తో రాణించిన అతడు.. బౌలింగ్ టైమ్​లోనూ ఓ ట్రిక్​ను వాడాడు. అది భలేగా వర్కౌట్ అయింది.

  • Published Apr 22, 2024 | 2:03 PMUpdated Apr 22, 2024 | 2:03 PM
ఒక్క ట్రిక్​తో మ్యాచ్​ను మార్చేసిన అయ్యర్.. ఇది ముందే గ్రహిస్తే RCB నెగ్గేది!

ప్లేఆఫ్స్​ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్​కతా నైట్ రైడర్స్​తో జరిగిన సండే ఫైట్​లో ఆ టీమ్ 1 పరుగు తేడాతో ఓడిపోయింది. హైస్కోరింగ్ మ్యాచ్​లో విజయం కోసం ఆఖరి వరకు పోరాడినా లాభం లేకపోయింది. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన కేకేఆర్ 20 ఓవర్లకు 222 పరుగులు చేసింది. ఛేజింగ్​లో డుప్లెసిస్ సేన అన్ని ఓవర్లు ఆడి 221 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్​లో బెంగళూరు ఓటమికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అంపైర్ల తప్పులు ఆ జట్టు పాలిట శాపంగా మారాయి. అదే సమయంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వేసిన ఓ ట్రిక్ కూడా ఆర్సీబీని గెలవకుండా ఆపింది.

బెంగళూరు విజయానికి చివరి ఓవర్​లో 21 పరుగులు అవసరమయ్యాయి. అయితే క్రీజులో ఉన్న కర్ణ్ శర్మపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవ్. భీకర వేగంతో బంతులు వేసే ఎక్స్​పీరియెన్స్ బౌలర్ మిచెల్ స్టార్క్​ను తట్టుకొని అతడు పరుగులు చేస్తాడని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఫస్ట్ బాల్​నే అతడు సిక్సర్ కొట్టాడు. మూడు, నాలుగు బంతుల్ని కూడా స్టాండ్స్​లోకి పంపాడతను. అయితే ఐదో బంతికి కర్ణ్ శర్మ ఔట్ అయ్యాడు. స్టార్క్ సూపర్బ్ రిటర్న్ క్యాచ్​తో కేకేఆర్​కు బ్రేక్ త్రూ అందించాడు. ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సిన దశలో శ్రేయస్ అయ్యర్ ఒక్క ట్రిక్​తో మ్యాచ్​ను మార్చేశాడు. లాస్ట్ బాల్​కు బ్యాట్ తగిలినా, తగలకపోయినా రెండు పరుగులు తీసేందుకు ఆర్సీబీ బ్యాటర్లు ప్రయత్నిస్తారని గ్రహించిన అయ్యర్.. ఆ బాల్​కు ముందు ఫీల్డర్లు అందరికీ కీలక సూచన చేశాడు.

ఫైనల్ బాల్​కు ముందు ఫీల్డర్లు అందరికీ ఓ మెసేజ్ పంపాడు అయ్యర్. బాల్ ఎవరి దగ్గరికి వచ్చినా సరే దాన్ని కీపింగ్ ఎండ్​కే త్రో చేయాలని చెప్పాడు. ఏదేమైనా బంతిని కీపర్​కు మాత్రమే విసరాలని ఆదేశించాడు. స్టార్క్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసిన బాల్​ను డీప్ కవర్స్​లోకి తరలించాడు బ్యాటర్ లాకీ ఫెర్గూసన్. ఆ ఏరియాకు దగ్గర్లో ఉన్న ఫీల్డర్ రమణ్​దీప్ సింగ్ పరిగెత్తుకుంటూ వచ్చి బాల్​ను పిక్ చేసి కీపర్ ఫిల్​ సాల్ట్​ వైపు త్రో చేశాడు. బాల్​ను అందుకున్న సాల్ట్ గాల్లో డైవ్ చేసి మరీ వికెట్లను గిరాటేశాడు. దీంతో అయ్యర్ ఊహించిన మాదిరిగానే కీపర్ ఎండ్ వైపు రనౌట్ అయి మ్యాచ్ కేకేఆర్​ వశమైంది.

సాధారణంగా ఫీల్డర్లు ఏ ఎండ్​లోనైనా త్రో వేయొచ్చు. కానీ బౌలింగ్ వేశాక బౌలర్ వచ్చి వికెట్ల దగ్గర నిలబడేసరికి లేట్ అవుతుంది. అదే కీపర్ అయితే స్టంప్స్ దగ్గర కాచుకొని ఉండొచ్చు. రనౌట్​లు చేయడంలో వారికి ఎక్కువ ఎక్స్​పీరియెన్స్ ఉంటుంది. అదే టైమ్​లో షాట్ కొట్టాక రెండో రన్ తీయడం బ్యాటర్​కు కష్టం. అందుకే కీపింగ్ ఎండ్​ వైపు త్రో విసరాలని అందర్నీ అలర్ట్ చేశాడు అయ్యర్. ఈ ట్రిక్ వర్కౌట్ అయింది. ఒకవేళ దీన్ని గనుక ఆర్సీబీ ఆటగాళ్లు ముందే గ్రహించి ప్లాన్ చేసుకొని ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది. ఆ తర్వాత సూపర్ ఓవర్​కు దారితీసేది. కానీ అది జరగకుండా అయ్యర్ ఆపాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే మ్యాచ్ తర్వాత రివీల్ చేశాడు. మరి.. అయ్యర్ ట్రిక్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి