iDreamPost
android-app
ios-app

Jos Buttler: బట్లర్ సరికొత్త చరిత్ర.. ఒక్క సెంచరీతో రికార్డులే రికార్డులు!

  • Published Apr 07, 2024 | 11:22 AM Updated Updated Apr 07, 2024 | 11:22 AM

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు జోస్ బట్లర్. ఇక ఈ ఒక్క శతకంతో పలు రికార్డులు బ్రేక్ చేశాడు ఈ స్టార్ ప్లేయర్. ఆ వివరాల్లోకి వెళితే..

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు జోస్ బట్లర్. ఇక ఈ ఒక్క శతకంతో పలు రికార్డులు బ్రేక్ చేశాడు ఈ స్టార్ ప్లేయర్. ఆ వివరాల్లోకి వెళితే..

Jos Buttler: బట్లర్ సరికొత్త చరిత్ర.. ఒక్క సెంచరీతో రికార్డులే రికార్డులు!

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ మధ్య తాజాగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ప్రేక్షకులకు మస్త్ మజాను ఇచ్చింది. రెండు సెంచరీలు నమోదైన ఈ పోరులో చివరికి రాజస్తాన్ విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 183 పరుగుల టార్గెట్ ను మరో 5 బంతులు ఉండగానే ఛేదించింది రాజస్తాన్ టీమ్. జోస్ బట్లర్ అద్బుత శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా.. ఒక్క సెంచరీతో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టాడు బట్లర్. మరి అవేంటో చూద్దాం పదండి.

జోస్ బట్లర్ సాధించిన సెంచరీ ముందు విరాట్ కోహ్లీ శతకం చిన్నబోయింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 58 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు చేశాడు జోస్ బట్లర్. మరో 5 బంతులు ఉండగానే సిక్సర్ తో టీమ్ గెలిపించాడు రాజస్తాన్ ప్లేయర్. ఇక ఈ ఒక్క సెంచరీతో బట్లర్ రికార్డుల మీద రికార్డులు సాధించాడు. అవేంటంటే? 100వ ఐపీఎల్ మ్యాచ్ లో సెంచరీ చేసిన తొలి విదేశీ బ్యాటర్ గా నిలిచాడు. ఇక ఈ ఘనత సాధించిన రెండవ బ్యాట్స్ మెన్ గా కూడా కేఎల్ రాహుల్ తర్వాత ప్లేస్ లో ఉన్నాడు.

Josh Butler

దీంతో పాటుగా రాజస్తాన్ రాయల్స్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న తొలి ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. రాజస్తాన్ తరఫున గతంలో అజింక్య రహానే 10 సార్లు ఈ ఘనత సాధించగా.. బట్లర్ తాజా అవార్డుతో 11 సార్లు ఈ అవార్డులు అందుకున్నాడు. ఈ క్రమంలోనే రాజస్తాన్ తరఫున అత్యధిక పరుగులు (2831) చేసిన రెండో బ్యాటర్ గా నిలిచాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. బట్లర్ ఇప్పటి వరకు 6 సెంచరీలు చేయగా.. విరాట్ కోహ్లీ 8 శతకాలతో అగ్రస్థానంలో ఉన్నాడు. మరి ఒక్క సెంచరీతో రికార్డుల మీద రికార్డులు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Virat Kohli: స్లో బ్యాటింగ్ పై ఎట్టకేలకు స్పందించిన కోహ్లీ! ఏమన్నాడంటే?