iDreamPost

Virat Kohli: స్లో బ్యాటింగ్ పై ఎట్టకేలకు స్పందించిన కోహ్లీ! ఏమన్నాడంటే?

రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో బ్యాటింగ్ తో తీవ్ర విమర్శలప పాలవుతున్నాడు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. సెల్ఫిష్ అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా తన స్లో బ్యాటింగ్ పై స్పందించాడు విరాట్. ఏమన్నాడంటే?

రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో బ్యాటింగ్ తో తీవ్ర విమర్శలప పాలవుతున్నాడు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. సెల్ఫిష్ అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా తన స్లో బ్యాటింగ్ పై స్పందించాడు విరాట్. ఏమన్నాడంటే?

Virat Kohli: స్లో బ్యాటింగ్ పై ఎట్టకేలకు స్పందించిన కోహ్లీ! ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఈ సీజన్ లో తొలి సెంచరీ నమోదు చేసిన ఫస్ట్ ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే కోహ్లీ శతకం జట్టును మాత్రం గెలిపించలేకపోయింది. ప్రత్యర్థి జట్టులో జోస్ బట్లర్ అద్బుతమైన సెంచరీతో చివరి వరకు క్రీజ్ లో ఉండి టీమ్ ను గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్ లో స్లో బ్యాటింగ్ తో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీపై సెల్ఫిష్ అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ విమర్శలపై, స్లో బ్యాటింగ్ పై మ్యాచ్ అనంతరం స్పందించాడు కింగ్ కోహ్లీ.

రాజస్తాన్ రాయల్స్ తో తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిన విషయం అందిరికీ తెలిసిందే. అయితే కోహ్లీ శతకం కొట్టినప్పటికీ.. అతడిని స్వార్థపరుడు అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ.. విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై మ్యాచ్ అనంతరం మాట్లాడాడు కోహ్లీ. “మ్యాచ్ ప్రారంభంలో పిచ్ కాస్త ఫ్లాట్ గా అనిపించింది. అయితే ఓవర్లు గడుస్తున్న కొద్ది పిచ్ మారిపోయింది. ఇది గమనించిన డుప్లెసిస్, నేను ఇద్దరిలో ఒక్కరిమైనా చివరి వరకు క్రీజ్ లో ఉండాలని భావించాము. ఈ మ్యాచ్ లో నేను ఫాస్ట్ గా ఆడలేకపోయానని నాకు తెలుసు. ఇలాంటి పిచ్ లపై ఈజీగా రన్స్ చేయడం అంత తేలికైన విషయం కాదు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాను” అని తన స్లో బ్యాటింగ్ పై స్పందించాడు.

Kohli slow batting

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 113 రన్స్ తో అ జేయంగా నిలిచాడు. అనంతరం 184 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ టీమ్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్ బ్యాటర్ జోస్ బట్లర్ శతకం సాధించి.. చివరి వరకు క్రీజ్ లో నిలిచి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. మరి విరాట్ కోహ్లీ స్లో బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి