iDreamPost

CSK రికార్డును బద్దలు కొట్టి.. నంబర్‌ వన్‌ ప్లేస్‌లోకి దూసుకొచ్చిన SRH

  • Published May 09, 2024 | 10:32 AMUpdated May 09, 2024 | 10:32 AM

SRH, CSK, IPL 2024: ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కేవలం రికార్డులు బద్దలు కొట్టేందుకు మాత్రమే ఆడేలా కనిపిస్తోంది. తాజాగా సీఎస్‌కే రికార్డును బ్రేక్‌ చేసి కొత్త చరిత్ర లిఖించింది. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

SRH, CSK, IPL 2024: ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కేవలం రికార్డులు బద్దలు కొట్టేందుకు మాత్రమే ఆడేలా కనిపిస్తోంది. తాజాగా సీఎస్‌కే రికార్డును బ్రేక్‌ చేసి కొత్త చరిత్ర లిఖించింది. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published May 09, 2024 | 10:32 AMUpdated May 09, 2024 | 10:32 AM
CSK రికార్డును బద్దలు కొట్టి.. నంబర్‌ వన్‌ ప్లేస్‌లోకి దూసుకొచ్చిన SRH

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి తమ సత్తా ఏంటో చూపించింది. ఈ మధ్య కాస్త డల్‌ అవుతున్న ఐపీఎల్‌కు తమ పవర్‌ హిట్టింగ్‌తో ఒక్కసారిగా ఊపుతీసుకొచ్చింది. బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్డేడియంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్లు ఎలాంటి విధ్వంసం సృష్టించారో అంతా చూశారు. లక్నో నిర్దేశించిన 166 పరుగుల టార్గెట్‌ను కేవలం 9.4 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా.. ఊదిపారేసింది. పటిష్టమైన లక్నోపై హోం గ్రౌండ్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకొచ్చింది ఎస్‌ఆర్‌హెచ్‌. అయితే.. మ్యాచ్‌లో విజయంతో పాటు ఓ అరుదైన రికార్డును కూడా సన్‌రైజర్స్‌ తన ఖాతాలో వేసుకుంది.

గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేరిట ఉన్న భారీ రికార్డును బద్దలుకొట్టి.. సరికొత్త చరిత్ర సృష్టించింది. 6 ఏళ్లుగా చెక్కుచెదరని సీఎస్‌కే రికార్డును బ్రేక్‌ చేయడమే కాకుండా.. మరో పెద్ద రికార్డును నమోదు చేసేందుకు కూడా సన్‌రైజర్స్‌ సిద్ధంగా ఉంది. ఇంతకీ ఆ రికార్డ్‌ ఏంటంటే.. ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన టీమ్‌గా సన్‌రైజర్స్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. 2018 ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 145 సిక్సులు కొట్టి ఈ జాబితాలో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. ఈ సీజన్‌లో కేవలం 12 మ్యాచ్‌ల్లోనే 146 సిక్సులతో సీఎస్‌కే రికార్డును బ్రేక​ చేస్తూ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నంబర్‌ వన్‌ టీమ్‌గా అవతరించింది. పైగా సన్‌రైజర్స్‌ ఇంకా లీగ్‌ దశలోనే రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

ఆ రెండు మ్యాచ్‌లతో పాటు.. ప్లే ఆఫ్స్‌కు వెళ్తే మరికొన్ని మ్యాచ్‌లు ఆడుతుంది. ఇలా సన్‌రైజర్స్‌కు ఆ సిక్సుల సంఖ్యను మరింత పెంచే ఛాన్స్‌ ఉంది. ప్రస్తుతం 146 సిక్సులతో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌.. మిగిలిన మ్యాచ్‌ల్లో మరో 20, 30 సిక్సులు ఈజీగా కొడుతుందని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. అయితే.. సన్‌రైజర్స్‌ తర్వాత.. 145 సిక్సులతో సీఎస్‌కే రెండో స్థానంలో ఉంది. అలాగే కేకేఆర్‌ 143 సిక్సులతో మూడో స్థానంలో ఉంది. 2019లో కేకేఆర్‌ 143 సిక్సులు బాదింది. 142 సిక్సులతో ఆర్సీబీ నాలుగో ప్లేస్‌లో ఉంది. 2016లో ఆర్సీబీ 142 సిక్సులు కొట్టింది. ఇక ఐదో స్థానంలో ముంబై ఇండియన్స్‌ ఉంది. 2023 సీజన్‌లో ఆ జట్టు 140 సిక్సులు కొట్టింది. మరి సన్‌రైజర్స్‌ సాధించిన ఈ అరుదైన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి