iDreamPost

SRH దెబ్బకు ఇంటిబాట పట్టిన ముంబై! ఇక అసలు పోటీ ఆ 3 టీమ్స్‌ మధ్యే!

  • Published May 09, 2024 | 11:59 AMUpdated May 09, 2024 | 11:59 AM

SRH, MI, IPL 2024: లక్నోపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సృష్టించిన విధ్వంసంతో ముంబై ఇండియన్స్‌ టోర్నీ నుంచి అధికారికంగా వైదొలిగింది. అయితే.. ఇప్పుడు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే నాలుగు టీమ్స్‌ ఏవో కాస్త క్లారిటీ వచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

SRH, MI, IPL 2024: లక్నోపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సృష్టించిన విధ్వంసంతో ముంబై ఇండియన్స్‌ టోర్నీ నుంచి అధికారికంగా వైదొలిగింది. అయితే.. ఇప్పుడు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే నాలుగు టీమ్స్‌ ఏవో కాస్త క్లారిటీ వచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published May 09, 2024 | 11:59 AMUpdated May 09, 2024 | 11:59 AM
SRH దెబ్బకు ఇంటిబాట పట్టిన ముంబై! ఇక అసలు పోటీ ఆ 3 టీమ్స్‌  మధ్యే!

ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. ఇప్పటికే ఎన్నో పెద్ద పెద్ద రికార్డులు బద్దులు కొట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌. తాజాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతి తక్కువ ఓవర్లలో 160 ప్లస్‌ టార్గెట్‌ను ఛేజ్‌ చేసిన టీమ్‌ చరిత్ర సృష్టించింది. బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు చేరువలో ఉంది. అయితే.. లక్నోపై ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ విజయంతో.. ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌ నుంచి ఔట్‌ అయింది.

ఈ సీజన్‌లో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు దూరమైన తొలి టీమ్‌గా ముంబై ఇండియన్స్‌ నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ 16 పాయింట్లతో నంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉంది. తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా 16 పాయింట్లతో రెండో ప్లేస్‌లో ఉంది. మూడో స్థానంలో సన్‌రైజర్స్‌, నాలుగో స్థానంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 12 పాయింట్లతో ఉంది. సీఎస్‌కే తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ వరుస స్థానాల్లో 12 పాయింట్లతో ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ఆయా జట్లు ఉన్న స్థానాలు బట్టి చూస్తే.. కేకేఆర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌.. ప్లే ఆఫ్స్‌కు చేరడం ఖాయంగా మారింది. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి.

చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు.. ప్లే ఆఫ్స్‌లోని నాలుగు బెర్తుల్లో ఒక బెర్త్‌ కోసం పోటీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మూడు టీమ్స్‌లో ఢిల్లీ, లక్నోకి ఇంకా రెండేసి మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ, సీఎస్‌కేకు మూడు మ్యాచ్‌లు ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలిచినా.. మంచి రన్‌రేట్‌తో ఉన్న సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు వెళ్లడం పక్కా.. అలా కాకుండా సీఎస్‌కే రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. ఢిల్లీ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ మంచి రన్‌రేట్‌తో గెలిస్తే.. ఆ టీమ్‌ ఫ్లే ఆఫ్స్‌కు వెళ్తుంది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌..
సీఎస్‌కే ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 ఓటములతో 12 పాయింట్లు సాధించి.. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఈ టీమ్‌కు ఇంకా 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. 10న గుజరాత్‌ టైటాన్స్‌తో అహ్మాదాబాద్‌లో, 12న రాజస్థాన్‌ రాయల్స్‌తో చెన్నైలో, 18న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. ప్లే ఆఫ్స్‌కు తొలి రెండు స్థానాల్లో చేరాలంటే.. సీఎస్‌కే ఈ మూడు మ్యాచ్‌లను కూడా కచ్చితంగా గెలిచి తీరాలి. రెండు మ్యాచ్‌లు గెలిచినా.. ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది. అయితే.. రాజస్థాన్‌, ఆర్సీబీతో మ్యాచ్‌లు టఫ్‌గా ఉండొచ్చు. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడితే మాత్రం సీఎస్‌కే ప్లే ఆఫ్‌కు వెళ్లడం కష్టమే.

ఢిల్లీ క్యాపిటల్స్‌..
డీస ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్లు సాధించి.. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఈ టీమ్‌కు ఇంకా 2 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. కచ్చితంగా మిగిలిన మ్యాచ్‌లు గెలిచి తీరాలి. ఒక్క మ్యాచ్‌ ఓడినా.. ఇతర టీమ్స్‌ ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో.. 12న బెంగళూరులో ఆర్సీబీతో, 14న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో హోం గ్రౌండ్‌లో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలవాలంటే డీసీ చెమటలు చిందించాల్సిందే. ఎందుకంటే.. ఆర్సీబీ, లక్నో రెండు మంచి ఫామ్‌లో ఉన్నాయి. లక్నో అయితే ప్లే ఆఫ్స్‌ రేసులో కూడా ఉంది.

లక్నో సూపర్‌ జెయింట్స్‌..
ఎల్‌ఎస్‌జీ 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములతో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఈ టీమ్‌కు ఇంకా 2 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో మే 14న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఢిల్లీలో ఆడునుంది. చివరి మ్యాచ్‌ను మే 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే లక్నోకు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. రెండు మ్యాచ్‌లు కూడా లక్నోకు చాలా టఫ్‌గా ఉంటాయి. ఎందుకంటే.. ఢిల్లీ, ముంబై మంచి ఫామ్‌లో ఉన్నాయి. పైగా ముంబై ప్లే ఆఫ్స్‌కు అధికారికంగా దూరం కావడంతో.. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఆడే ప్రమాదం ఉంది. మరి అన్ని టీమ్స్‌ పాయింట్లు మిగిలి ఉన్న మ్యాచ్‌లు పరిశీలిస్తే.. కేకేఆర్‌, రాజస్థాన్‌, ఎస్‌ఆర్‌హెచ్‌, సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఏ నాలుగు టీమ్స్‌ ప్లే ఆఫ్స్‌కు వెళ్తాయని మీరు భావిస్తున్నారు. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి