Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో హైస్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చతికిలపడింది. భారీ టార్గెట్‌ను ఛేజ్ చేయలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో స్పీచ్ ఇచ్చాడు ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో హైస్కోరింగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చతికిలపడింది. భారీ టార్గెట్‌ను ఛేజ్ చేయలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో స్పీచ్ ఇచ్చాడు ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.
Nidhan
ఐపీఎల్లో ఎప్పుడూ చూడని మ్యాచ్‌కు ఉప్పల్ వేదికగా నిలిచింది. పరుగుల సునామీలో స్టేడియంలోని ఆడియెన్స్ తడిసి ముద్దయ్యారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ముంబై ఇండియన్స్ ముందు ఏకంగా 277 పరుగుల బిగ్ టార్గెట్ సెట్ చేశారు. ఐపీఎల్ హిస్టరీలో భారీ స్కోరు చేసిన టీమ్‌గా ఎస్ఆర్హెచ్ రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఎంఐ.. ఆఖరి వరకు పోరాడుతూ 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విజయం కమిన్స్ సేనను వరించినా ముంబై పోరాటాన్ని తక్కువ చేయడానికి లేదు. ఆ టీమ్ బ్యాటర్లు గెలుస్తామనే కాన్ఫిడెన్స్‌తో ఆఖరి వరకు ప్రయత్నించడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తర్వాత ఎంఐ డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పీచ్ ఇచ్చాడు. అది వింటే ఆశ్చర్యపోతారు.
రికార్డ్ రన్ ఛేజ్‌లో ఓడిపోవడంతో ముంబై క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా నిరాశలో కూరుకుపోయారు. చివరి వరకు పోరాడినా లక్ష్యాన్ని అందుకోకపోవడం, వరుసగా రెండో ఓటమి, మెగా లీగ్‌లో ఇంకా బోణీ కొట్టకపోవడం వారిని మరింత బాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ తర్వాత ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో కొత్త సారథి హార్దిక్ స్పీచ్ ఇచ్చాడు. టీమ్మేట్స్, కోచింగ్ స్టాఫ్‌ను ఎంకరేజ్ చేస్తూ అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సిసలైన యోధులకు మాత్రమే కఠిన పరీక్షలు ఎదురవుతాయని చెప్పాడు పాండ్యా. లీగ్‌లో మనది టఫెస్ట్ టీమ్ అని అన్నాడు. బ్యాటింగ్ యూనిట్‌గా, ఒక జట్టుగా ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఆడుతున్న తీరు అద్భుతమని మెచ్చుకున్నాడు. ఇదే ఆటను కంటిన్యూ చేయాలని కోరాడు.
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ముంబై బౌలర్లు పోరాడిన తీరు సూపర్బ్ అని హార్దిక్ ప్రశంసించాడు. వాళ్ల విషయంలో తనకు ఎంతో గర్వంగా ఉందన్నాడు. పరిస్థితులు చాలా టఫ్‌గా ఉన్న టైమ్‌లో వాళ్లు బాధ్యతల నుంచి పారిపోకుండా నిలబడ్డారని.. ఇది మామూలు విషయం కాదన్నాడు పాండ్యా. తమకు బౌలింగ్ ఇవ్వాలని ప్రతి బౌలర్ అడిగాడని, ఇది గొప్ప విషయమని పేర్కొన్నాడు. టీమ్‌లోని ఆటగాళ్లు అందరూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ కలసికట్టుగా ముందుకు వెళ్దామని.. మంచి, చెడు ఏది జరిగినా దాన్ని ఫేస్ చేద్దామని పాండ్యా స్పష్టం చేశాడు. హార్దిక్‌తో పాటు ఎంఐ మెంటార్ సచిన్ టెండూల్కర్ కూడా స్పీచ్ ఇచ్చాడు. 277 పరుగులను ఛేజ్ చేస్తూ కూడా ఎలాంటి తడబాటు లేకుండా ముంబై బ్యాటర్లు బ్యాటింగ్ చేశారని మెచ్చుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో తొలి 10 ఓవర్లు ముగిశాక క్లియర్ విన్నర్ ఎవరో చెప్పడం కష్టంగా మారిందన్నాడు. ఇక మీదట కూడా ఇలాగే కలసికట్టుగా ఆడాలని సూచించాడు మాస్టర్ బ్లాస్టర్. మరి.. పాండ్యా, సచిన్ స్పీచ్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
🗣️ “Toughest soldiers get the toughest test” 💪
Sachin & Hardik with some inspiring words after #SRHvMI 💙#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/yTkPCcuXQB
— Mumbai Indians (@mipaltan) March 28, 2024