iDreamPost

వీడియో: రోహిత్​ను దారుణంగా అవమానించిన హార్దిక్.. మాజీ కెప్టెన్ అని కూడా చూడకుండా..!

  • Published Mar 25, 2024 | 9:28 AMUpdated Mar 25, 2024 | 1:01 PM

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను ఆ జట్టు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవమానించాడు. మాజీ సారథి అని కూడా చూడకుండా హిట్​మ్యాన్​ను అగౌరవపరిచాడు.

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మను ఆ జట్టు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవమానించాడు. మాజీ సారథి అని కూడా చూడకుండా హిట్​మ్యాన్​ను అగౌరవపరిచాడు.

  • Published Mar 25, 2024 | 9:28 AMUpdated Mar 25, 2024 | 1:01 PM
వీడియో: రోహిత్​ను దారుణంగా అవమానించిన హార్దిక్.. మాజీ కెప్టెన్ అని కూడా చూడకుండా..!

ఐపీఎల్-2024ను ఓటమితో మొదలుపెట్టింది ముంబై ఇండియన్స్. గుజరాత్ టైటాన్స్​తో జరిగిన మ్యాచ్​లో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్ని రకాలుగా ఫెయిలవడం, కీలక సమయాల్లో జట్టు బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఎంఐకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 168 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఎంఐ ఓవర్లన్నీ ఆడి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్​లో గెలుపోటముల కంటే కూడా ఓ విషయం వైరల్ అవుతోంది. రోహిత్ శర్మతో హార్దిక్ పాండ్యా గ్రౌండ్​లో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. మాజీ కెప్టెన్ అని కూడా చూడకుండా హిట్​మ్యాన్​ను పాండ్యా దారుణంగా అవమానించడం చర్చనీయాంశంగా మారింది.

అనామకుడిగా ఉన్నోడ్ని స్టార్ ప్లేయర్​ను చేశాడు. వరుసగా ఫెయిలవుతున్నా అవకాశాలు ఇస్తూ పోయాడు. టీమ్​లో నుంచి తీసేస్తామని ఫ్రాంచైజీ యాజమాన్యం చెబితే.. వాళ్లను ఒప్పించి మరీ జట్టులో కంటిన్యూ చేశాడు. ముంబై ఇండియన్స్​తో పాటు టీమిండియాలో కూడా రెగ్యులర్ ప్లేయర్​గా మారడంలో అతడికి హెల్ప్ చేశాడు. ఇలా అన్ని విషయాల్లోనూ హార్దిక్ పాండ్యాను ఆదుకున్నాడు రోహిత్. అతడికి అన్నీ తానై నిలిచాడు. కానీ పాండ్యా మాత్రం హిట్​మ్యాన్​ను దారుణంగా అవమానించాడు. ముంబై కెప్టెన్సీ మార్పు విషయంలో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024లో తొలి మ్యాచ్​లోనే రోహిత్​ను టార్గెట్ చేసుకున్నాడు హార్దిక్. ముంబైకి మాజీ కెప్టెన్, టీమిండియాకు తాజా సారథి అయిన రోహిత్​ను బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేయించాడు పాండ్యా.

Rohith vs Hardik

కెరీర్ స్టార్టింగ్​లో తప్పితే ఎప్పుడూ బౌండరీ లైన్ దగ్గర రోహిత్ ఫీల్డింగ్ చేయలేదు. ముంబై ఇండియన్స్​తో పాటు భారత జట్టుకు ఆడే మ్యాచుల్లో 30 యార్డ్ సర్కిల్​ లోపలే ఉంటాడు హిట్​మ్యాన్. బౌలర్లకు దగ్గరగా ఉంటూ అవసరమైన టైమ్​లో సూచనలు ఇస్తుంటాడు. అలాగే ఫీల్డింగ్ పొజిషన్స్​ను సెట్ చేస్తుంటాడు. ప్రత్యర్థి బ్యాటర్ల ఆటతీరును గమనిస్తూ వారికి తగ్గట్లు స్ట్రాటజీలు వేస్తుంటాడు. అలాంటోడ్ని హార్దిక్ అవమానించాడు. మాజీ కెప్టెన్​ సలహాలు, సూచనల్ని వాడుకొని జట్టుకు విజయాన్ని అందించాల్సింది పోయి తన కంటే టీమ్​లో తోపు ఎవరూ లేరనే రీతిలో ప్రవర్తించాడు. 30 యార్డ్ సర్కిల్​లో ఉన్న హిట్​మ్యాన్​ను ఫోర్ లైన్ దగ్గరకు పంపాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇంత కంటే ఘోరం చూడలేమని.. రోహిత్ భయ్యా ఆ టీమ్​లో నుంచి బయటకు వచ్చేయ్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ ఓవరాక్షన్ చేస్తున్నాడని.. టీమిండియాకు ఆడేటప్పుడు రోహిత్ చేతుల్లో అతడికి ఒక రేంజ్​లో పనిష్మెంట్ ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఏదేమైనా రోహిత్ ఫీల్డింగ్ ఫ్లేస్​మెంట్ మాత్రం అతడి ఫ్యాన్స్​ను తీవ్రంగా బాధించింది. మరి.. రోహిత్ విషయంలో హార్దిక్ ప్రవర్తించిన తీరు మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి