iDreamPost

గుజరాత్ ని వణికించిన పంత్.. వరల్డ్ కప్ కి ముందు వాటే కంబ్యాక్!

DC vs GT- Rishabh Pant: ఐపీఎల్ 2024 సీజన్లో అన్ని మ్యాచులు ఉత్కంఠగా సాగుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్ తో మ్యాచ్ ని పంత్ అద్భుతంగా మార్చేశాడు. వికెట్ల వెనకాల పంత్ ఆట చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

DC vs GT- Rishabh Pant: ఐపీఎల్ 2024 సీజన్లో అన్ని మ్యాచులు ఉత్కంఠగా సాగుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్ తో మ్యాచ్ ని పంత్ అద్భుతంగా మార్చేశాడు. వికెట్ల వెనకాల పంత్ ఆట చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

గుజరాత్ ని వణికించిన పంత్.. వరల్డ్ కప్ కి ముందు వాటే కంబ్యాక్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో అసలైన పొట్టి క్రికెట్ మజాని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో వరుగుల వరదలు పారాయి. కానీ, గుజరాత్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో మాత్రం బౌలర్స్ మ్యాజిక్ చేశారు. ఒక్కో ఓవర్ ఎంతో ఉత్కంఠగా సాగింది. స్కోర్ బోర్డులో పరుగుల కంటే వికెట్లు ఎక్కువగా మారుతూ వచ్చాయి. టాపార్డర్ నుంచి టెయిలెండర్స్ వరకు ప్రతి ఒక్కరిని ముప్ప తిప్పలు పెట్టింది. ప్యాడ్లు కట్టుకున్నంత సమయం కూడా బ్యాటర్లు క్రీజులో లేకుండా పెవిలియన్ చేరుతూ వచ్చారు. ఈ మ్యాచ్ లో రియల్ పంత్ ని చూసి ఆడియన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు.

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు తొలి ఓవర్ నుంచి గుజరాత్ పై ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. ఎక్కడా కూడా గుజరాత్ బ్యాటర్లు ఆస్కారం లేకుండా వికెట్ల మీద వికెట్లు తీస్తూనే ఉంది. పంత్ సేన విజృంభణతో గుజరాత్ జట్టు కేవలం 17.3 ఓవర్లలోనే 89 పరుగులకే ఆలౌట్ అయ్యింది. గుజరాత్ జట్టు ఈ మూడేళ్లలో ఇలా వంద పరుగులలోపే ఆలౌట్ అవ్వడం ఇదే తొలిసారి. ఈ చెత్త రికార్డును గిల్ సేన తమ ఖాతాలో వేసుకుంది.

ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు చెలరేగారు. ముకేశ్ కుమార్ కు 3 వికెట్లు దక్కాయి. ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్ కు ఒక వికెట్ దక్కింది. అయితే ఈ మ్యాచ్ లో బౌలర్లు విజృంభిస్తున్నా కూడా ప్రేక్షకులు, ఫ్యాన్స్ దృష్టి మాత్రం రిషబ్ పంత్ మీదే ఉంది. వికెట్స్ వెనుక పంత్ అలా తిరుగుతూ బౌలర్లను ఉత్సాహ పరచడమే కాకుండా.. మెరుపు స్పప్పింగ్, స్టన్నింగ్ క్యాచుతో అందరినీ అలరించాడు. టీ20 వరల్డ్ కప్ ముంగిట ఇన్ని రోజులు పంత్ ఇంకా ఫామ్ లోకి రాలేదంటూ అంతా నిరాశలో ఉన్నారు. కానీ, ఒక్క మ్యాచ్ లో తనలో రియల్ పంత్ ఇంకా అలాగే ఉన్నాడని నిరూపించాడు.

ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ కీలక వికెట్లను తీశాడు. డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ అలవోకగా అందుకున్నాడు. స్టబ్స్ బౌలింగ్ లో అభినవ్ మనోహర్ ని కళ్లు చెదిరే స్టంపింగ్ చేశాడు. మళ్లీ అదే ఓవర్లో షారుక్ ఖాన్ వికెట్ ని కూడా రెప్పపాటులో స్టంప్పింగ్ చేశాడు. ఫామ్ లోకి వస్తున్న రషీద్ ఖాన్ క్యాచ్ అందుకుని గుజరాత్ నడ్డి విరిచాడు. వరల్డ్ కప్ వస్తున్న నేపథ్యంలో పంత్ ఇలా ఫామ్ లోకి రావడం చూసి టీమిండియా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కెప్టెన్ గా కూడా పంత్ అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. బౌలర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి నుంచి బెస్ట్ రాబట్టుకున్నాడు. మరి.. పంత్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి