iDreamPost

IPL 2024: మళ్లీ ముంబై కెప్టెన్ గా రోహిత్.. డేట్ తో సహా చెప్పిన మాజీ క్రికెటర్!

హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించి.. మళ్లీ రోహిత్ శర్మకే కెప్టెన్సీ పగ్గాలు ఇస్తారని డేట్ తో సహా చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించి.. మళ్లీ రోహిత్ శర్మకే కెప్టెన్సీ పగ్గాలు ఇస్తారని డేట్ తో సహా చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

IPL 2024: మళ్లీ ముంబై కెప్టెన్ గా రోహిత్.. డేట్ తో సహా చెప్పిన మాజీ క్రికెటర్!

‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా తయ్యారు అయ్యింది ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ పరిస్థితి. జట్టులో స్టార్ ప్లేయర్లకు కొదవలేదు. కానీ విజయాల కోసం వేయి కళ్లతో ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఈ సీజన్ లో తొలి విజయం కోసం ఎంఐ ఎంతగానో ఎదురుచూస్తోంది. ఆడిన మూడు మ్యాచ్ ల్లో మూడు ఓడి, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థాయిలో ఉంది. లేటెస్ట్ గా రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించి.. మళ్లీ రోహిత్ శర్మకే కెప్టెన్సీ పగ్గాలు ఇస్తారని డేట్ తో సహా చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్. పక్కనే ఉండి ఇది విన్న వీరేంద్ర సెహ్వాగ్ అవాక్కైయ్యాడు.

ఐపీఎల్ 2024 సీజన్ లో ఇంకా బోణీ కొట్టలేదు ముంబై ఇండియన్స్. కొత్తగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యాకు ఆది నుంచే కష్టాలు ఎదురౌతున్నాయి. ఓ వైపు రోహిత్ ను మోసం చేసి సారథ్యం గుంజుకున్నాడని విమర్శలు ఎదుర్కొంటుండగా.. మరోవైపు వరుస పరాజయాలు అతడిని తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. ముంబైని పరాజయాలు కలవరపెడుతుండటంతో.. పాండ్యాను కెప్టెన్సీ నుంచి పీకేసి.. మళ్లీ రోహిత్ కే ఆ బాధ్యతలు ఇవ్వాలని చాలా మంది మాజీ క్రికెటర్లు, క్రీడా పండితులు, క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు. రాజస్తాన్ పై ఓటమితో తాజాగా మరోసారి ఈ విషయం చర్చకు వచ్చింది. టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ క్రిక్ బజ్ తో మాట్లాడుతూ..

Rohit became the captain of Mumbai from that match!

“హార్దిక్ పాండ్యా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఆ విషయం రాజస్తాన్ మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది. అంతకు ముందు మ్యాచ్ ల్లో ముందు బౌలింగ్ చేసిన పాండ్యా.. ఈ మ్యాచ్ లో అసలు బౌలింగే చేయలేదు. కాగా.. నెక్ట్స్ ఆదివారం(ఏప్రిల్ 7) వరకు ముంబై ఇండియన్స్ కు మరో మ్యాచ్ లేదు. ఈ గ్యాప్ లో ముంబై ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుని రోహిత్ ను మళ్లీ కెప్టెన్ చేయగలదని నా అభిప్రాయం. ఫ్రాంచైజీ క్రికెట్ ను ఓనర్లను అర్ధం చేసుకున్నంత వరకు వారు ఈ నిర్ణయానికి వెనకాడరని నేను భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి. పక్కనే ఉండి ఈ వ్యాఖ్యలను విన్న టీమిండియా డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ షాక్ కు గురైయ్యాడు. మరి ఈ మాజీ ప్లేయర్ అన్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: DC vs KKR: ఢిల్లీ vs కోల్​కతా.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి