iDreamPost

DC vs SRH: వీడియో: షాబాజ్ కోసం కమిన్స్ త్యాగం.. నిజమైన కెప్టెన్సీ అంటే ఇది!

  • Published Apr 21, 2024 | 11:54 AMUpdated Apr 21, 2024 | 11:54 AM

నిజమైన కెప్టెన్సీ అంటే ఏంటో సన్​రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ప్రూవ్ చేశాడు. యంగ్ బ్యాటర్ షాబాజ్ అహ్మద్ కోసం కమిన్స్ చేసిన పని ఏంటో తెలిస్తే ఎవ్వరైనా అతడ్ని మెచ్చుకోకుండా ఉండలేరు.

నిజమైన కెప్టెన్సీ అంటే ఏంటో సన్​రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ ప్రూవ్ చేశాడు. యంగ్ బ్యాటర్ షాబాజ్ అహ్మద్ కోసం కమిన్స్ చేసిన పని ఏంటో తెలిస్తే ఎవ్వరైనా అతడ్ని మెచ్చుకోకుండా ఉండలేరు.

  • Published Apr 21, 2024 | 11:54 AMUpdated Apr 21, 2024 | 11:54 AM
DC vs SRH: వీడియో: షాబాజ్ కోసం కమిన్స్ త్యాగం.. నిజమైన కెప్టెన్సీ అంటే ఇది!

ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు వరకు సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ ఎస్​ఆర్​హెచ్ కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవడంతో టీమ్ గురించి అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. వన్డే వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ జట్టులోకి రావడంతో ఈసారి ఆరెంజ్ ఆర్మీ కొత్తగా కనిపిస్తోందని, ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలని అనుకున్నారు. కానీ సన్​రైజర్స్ టాప్ రేంజ్​లో ఆడుతుందని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు. ఎవరి ఎక్స్​పెక్టేషన్స్​కు కూడా అందని రీతిలో విధ్వంసక ఆటతీరుతో అన్ని జట్లను వణికిస్తోంది కమిన్స్ సేన. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్​ను చిత్తు చేసింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్​లో రెండో స్థానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్​లో కమిన్స్ తన ఒక పనితో అందరి మనసులు మరోమారు దోచుకున్నాడు.

కెప్టెన్ అనేవాడు ఎంత నిస్వార్థంగా ఉండాలో డీసీతో మ్యాచ్​లో కమిన్స్ ప్రూవ్ చేశాడు. యంగ్ బ్యాటర్ షాబాజ్ అహ్మద్ కోసం అతడు త్యాగం చేశాడు. సన్​రైజర్స్ ఇన్నింగ్స్​లో అది ఆఖరి ఓవర్. షాబాజ్ 26 బంతుల్లో 48 పరుగులతో మంచి దూకుడు మీద ఉన్నాడు. ఆ ఓవర్​లోనే బ్యాటింగ్​కు వచ్చిన కమిన్స్ ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు చేశాడు. ఇంకా 3 బంతులు ఉన్నాయి. 2 ఫోర్లు, 5 సిక్సులతో చివరి ఓవర్లలో రెచ్చిపోయిన షాబాజ్ హాఫ్ సెంచరీకి చేరువలో ఉండటంతో కమిన్స్ త్యాగం చేశాడు. అర్ధ సెంచరీ మార్క్​ను చేరుకుంటే యంగ్ బ్యాటర్​లో మరింత కాన్ఫిడెన్స్ వస్తుందనే ఉద్దేశంతో తన వికెట్​ను శాక్రిఫైజ్ చేశాడు ఎస్​ఆర్​హెచ్ కెప్టెన్. ముఖేష్ కుమార్ వేసిన లాస్ట్ ఓవర్ నాలుగో బంతికి షాబాజ్ స్ట్రయిట్ షాట్ కొట్టాడు. బాల్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. దీంతో డబుల్ కోసం ప్రయత్నించాడు.

ఇంకో 3 బంతుల్లో ఇన్నింగ్స్ అయిపోతుంది. దీంతో హాఫ్ సెంచరీ మార్క్​ను అందుకోవాలనే తొందర్లో షాబాజ్ నాలుగో బంతికి డబుల్ తీసేందుకు ట్రై చేశాడు. అక్కడ రెండో రన్ కష్టమని తెలిసినా నాన్​స్ట్రయికింగ్​ ఎండ్​లో ఉన్న కమిన్స్ అతడికి సహకరించాడు. మొదటి రన్ తీశాక కిందపడ్డాక కూడా లేచి మరీ రెండో రన్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే బాల్​ను అందుకున్న బౌలర్ వికెట్లను గిరాటేశాడు. షాబాజ్ అర్ధ సెంచరీ పూర్తవ్వాలని కమిన్స్ తన వికెట్​ను త్యాగం చేశాడు. ఆ తర్వాతి బాల్​కు షాబాజ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కమిన్స్ కింద పడినా షాబాజ్ కోసం పరిగెత్తడం, తన వికెట్​ను శాక్రిఫైజ్ చేయడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. నిజమైన కెప్టెన్ అంటే ఇలా ఉండాలని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న పనులే టీమ్​లో ఎంతో మార్పు తీసుకొస్తాయని.. ఎస్​ఆర్​హెచ్ ఆటగాళ్లు కలసికట్టుగా ఆడటం వెనుక కమిన్స్ ఎఫర్ట్ కారణమని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. షాబాజ్ కోసం కమిన్స్ చేసిన త్యాగం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి