iDreamPost

కెప్టెన్ గా మరోసారి పంత్ ఫెయిల్! ఒక్క తప్పుతో ఘోర పరాజయం!

SRH vs DC- Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరు వింటే అందరూ వణికిపోయే పరిస్థితి ఉంది. ప్రత్యర్థి ఎవరైనా గడగడ లాడించేస్తున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కూడా అదే రిపీట్ అయ్యింది.

SRH vs DC- Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరు వింటే అందరూ వణికిపోయే పరిస్థితి ఉంది. ప్రత్యర్థి ఎవరైనా గడగడ లాడించేస్తున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కూడా అదే రిపీట్ అయ్యింది.

కెప్టెన్ గా మరోసారి పంత్ ఫెయిల్! ఒక్క తప్పుతో ఘోర పరాజయం!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతోంది అంటే క్రికెట్ ఫ్యాన్స్ అంతా టీవీలకు అతుక్కుపోతున్నారు. ఒక్క మ్యాచ్ లోనే లెక్క లేనన్ని రికార్డులను బద్దలు కొడుతున్నారు. ప్రత్యర్థులు మారినా కూడా ఫలితం మాత్రం మారడం లేదు. హైదరాబాద్ జట్టును ఢీ కొట్టడం దాదాపుగా అసాధ్యం అనే పరిస్థితికి వచ్చేశారు. టేబుల్ లో 4వ స్థానం నుంచి దెబ్బకు రెండో స్థానానికి ఎగబాకింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అంటే అంతంత మాత్రం అనుకునే స్థాయి నుంచి హైదరాబాద్ అంటే వణికిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కూడా అదే జరిగింది. అయితే ఇక్కడ ఈ విజయంలో హైదరాబాద్ సత్తా మాత్రమే కాకుండా.. కెప్టెన్ గా పంత్ విఫలం అవ్వడం కూడా హైదరాబాద్ కు కలిసొచ్చింది.

ఢిల్లీ వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ఒక్కో ఓవర్ ప్రేక్షకులకు అసలు సిసలైన టీ20 మ్యాచ్ థ్రిల్ ని పంచింది. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ లో సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఒక్క మ్యాచ్ లో 4 వరల్డ్ రికార్డులను నెలకొల్పింది. పవర్ ప్లేలో అత్యధిక బౌండరీలు నమోదు చేసింది. పవర్ ​ప్లేలో అత్యధిక సిక్సులు కొట్టి రికార్డు సృష్టించారు. పవర్ ప్లేలో అత్యధిక స్కోరు నమోదు చేశారు. టీమ్ టోటల్ ని అత్యంత వేగంగా అంటే కేవలం 11.4 ఓవర్లలోనే 150 పరుగులు చేశారు. ఇలా అనేక రికార్డు బద్దలు కొట్టారు. టీమ్ టోటల్ 100 పరుగులు చేసేందుకు కేవలం 5 ఓవర్లు మాత్రమే తీసుకోవడం మరో విశేషం.

Pant failed as captain once again

ఈ మ్యాచ్ లో అందరూ హైదరాబాద్ విధ్వంసాన్ని ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, షబాజ్ అహ్మద్, నితీశ్ రెడ్డి ప్రదర్శనను మెచ్చుకుంటున్నారు. కానీ, అసలు తప్పు చేసింది.. ఢిల్లీ ఓటమికి కారణం అయ్యింది కెప్టెన్ రిషబ్ పంత్ అనే విషయాన్ని చాలామంది గమనించడం లేదు. హైదరాబాద్ జట్టు ఉన్న భీకర ఫామ్ కి ఏ జట్టు అయినా ఓటమి పాలవ్వాల్సిందే అనుకుంటున్నారు. కానీ, అసలు తప్పు చేసింది మాత్రం కెప్టెన్ పంత్. ఈ మ్యాచ్ లో కూడా రిషబ్ పంత్ కెప్టెన్ గా మరోసారి విఫలం అయ్యాడు అంటూ స్వయంగా ఢిల్లీ జట్టు అభిమానులే కామెంట్స్ చేస్తున్నారు. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకోవడంలోనే ఈ తప్పు మొత్తం జరిగింది.

మ్యాచ్ తర్వాత పంత్ మాట్లాడుతూ డ్యూ ఉంటుంది అనుకున్నాను. అందుకే బౌలింగ్ తీసుకున్నాను కానీ మా అంచనాలు తారు మారు అయ్యాయి అన్నాడు. హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో చేసిన అత్యధిక స్కోర్లు అన్నీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేసినవే. ఈ మ్యాచ్ లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో హెడ్, అభిషేక్ విధ్వంసం సృష్టించారు. కానీ, పంత్ ఆ చిన్న లాజిక్ ని కాలుక్యూలేట్ చేయడంలో విఫలం అయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో హైదరాబాద్ జట్టు ఎంత డేంజర్ అనే విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకున్నాడో లేదో? హైదరాబాద్ కు ఛేజింగ్ ఇచ్చి ఉంటే మ్యాచ్ ఫలితం ఇంకోలా ఉండేదేమో? ఈ చిన్న తప్పు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది అంటున్నారు. మరి.. కెప్టెన్ పంత్ విఫలమయ్యాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి