iDreamPost

Mohit Sharma: SRH బౌలర్ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వరస్ట్ రికార్డు!

ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వరస్ట్ రికార్డు నమోదు అయ్యింది. ఈ రికార్డ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వరస్ట్ రికార్డు నమోదు అయ్యింది. ఈ రికార్డ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Mohit Sharma: SRH బౌలర్ రికార్డ్ బ్రేక్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వరస్ట్ రికార్డు!

ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. ఇక ఈ మ్యాచ్ లో 4 పరుగుల స్వల్ప తేడాతో ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ. ఈ క్రమంలో 2018 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ పేరిట ఉన్న వరస్ట్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఈ చెత్త రికార్డు వివరాల్లోకి వెళితే..

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యంత వరస్ట్ రికార్డ్ ను తన పేరిట నమోదు చేసుకున్నాడు గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మోహిత్ శర్మ. ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్ లో తన కోటా 4 ఓవర్లలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా చెత్త రికార్డును నెలకొల్పాడు. మోహిత్ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ.. ఢిల్లీ బ్యాటర్లు అతడి 4 ఓవర్లలో 73 రన్స్ పిండుకున్నారు. దీంతో ఈ వరస్డ్ రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్నాడు మోహిత్. ఇంతకు ముందు ఈ రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ బసిల్ థంపి పేరిట ఉండేది. అతడు 2018 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో తన 4 ఓవర్ల కోటాలో 70 పరుగులు ఇచ్చుకున్నాడు. తాజాగా ఈ వరస్ట్ రికార్డ్ బ్రేక్ అయ్యింది.

Worst record in IPL history!

కాగా.. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన మోహిత్ కు చుక్కలు చూపించాడు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. ఈ ఓవర్లో తన విశ్వరూపం చూపాడు. 4 సిక్సులు, ఓ ఫోర్ తో 31 పరుగులు పిండుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. జట్టులో పంత్(88*), అక్షర్ పటేల్(66) రన్స్ తో రాణించారు. అనతరం 225 పరుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగుల వద్ద నిలిచి.. 4 పరుగులతో ఓడిపోయింది. మరి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి