iDreamPost

MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోని.. IPL చరిత్రలోనే తొలి ప్లేయర్ గా! ఇది చాలా స్పెషల్..

SRHతో జరిగిన మ్యాచ్ లో మిస్టర్ కూల్, చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చరిత్ర సృష్టించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా తన పేరును రికార్డుల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

SRHతో జరిగిన మ్యాచ్ లో మిస్టర్ కూల్, చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని చరిత్ర సృష్టించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా తన పేరును రికార్డుల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోని.. IPL చరిత్రలోనే తొలి ప్లేయర్ గా! ఇది చాలా స్పెషల్..

మహేంద్రసింగ్ ధోని.. ఈ ఐపీఎల్ లో భారీ ఇన్నింగ్స్ లు ఆడకపోయినప్పటికీ, రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేస్తూ.. చెన్నైకి విజయాలతో పాటుగా భారీ స్కోర్లు అందిస్తున్నాడు. ఇక కెప్టెన్ గా తన అనుభవాన్ని సలహాలు, సూచనల రూపంలో రుతురాజ్ కు చెప్తూ.. టీమ్ ను వెనక నుంచి నడిపిస్తున్నాడు. ఇక తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో సమష్టిగా రాణించిన చెన్నై జట్టు 78 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా ధోని ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు.

భారీ స్కోర్లు సాధిస్తూ ఈ ఐపీఎల్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. ఆదివారం చెన్నైతో చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 78 పరుగుల తేడాతో హైదరాబాద్ టీమ్ పరాజయం పాలైంది.  తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ 98 రన్స్ చేసి కొద్దిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అతడికి తోడు డార్లి మిచెల్(52) పరుగులతో రాణించాడు. అయితే భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఫోర్, సిక్స్ తో ధాటిగా బ్యాటింగ్ ఆరంభించిన ట్రావిస్ హెడ్ 13 రన్స్ కే రెండో ఓవర్లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బాల్ కే కొత్త కుర్రాడు అన్ మోల్ ప్రీత్ సింగ్(0) డకౌట్ గా వెనుదిరిగాడు.

Dhoni who created history!

ఇక అక్కడి నుంచి సన్ రైజర్స్ వికెట్ల పతనం కొనసాగింది. 32 రన్స్ మార్క్రమ్ టాప్ స్కోరర్ గా నిలిచాడంటేనే అర్ధం చేసుకోవచ్చు SRH ప్లేయర్లు ఎలా ఆడారో. ఇక చెన్నై బౌలర్ తుషార్ దేశ్ పాండే 4 వికెట్లతో సన్ రైజర్స్ పతనాన్ని శాసించాడు. దీంతో 18.5 ఓవర్లలో 134 రన్స్ కే సన్ రైజర్స్ ప్యాకప్ అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ విజయంతో మిస్టర్ కూల్, చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సరికొత్త రికార్డు ను క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ధోనికి ఇది 150వ విజయం. ఇన్ని గెలుపులు సాధించిన తొలి ప్లేయర్ గా ధోని క్రేజీ రికార్డ్ ను సాధించాడు. మరే క్రికెటర్ కూడా ఐపీఎల్ లో ఇన్ని విజయాలు సాధించలేదు. ఇక ఈ జాబితాలో రోహిత్ శర్మ (133), రవీంద్ర జడేజా(133) ఉన్నారు. మరి ఈ ఐపీఎల్ సీజన్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. దూసుకెళ్తున్న మహేంద్రసింగ్ ధోనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి