iDreamPost

IPL 2024: వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన CSK! ప్రపంచంలోనే తొలి జట్టుగా..

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి టీమ్ గా చరిత్రకెక్కింది. ఆ వివరాల్లోకి వెళితే..

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి టీమ్ గా చరిత్రకెక్కింది. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2024: వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన CSK! ప్రపంచంలోనే తొలి జట్టుగా..

‘రికార్డులకు ఆయుష్షు తక్కువ’ అన్న సామెతను అక్షరాలా నిజం చేస్తూ దూసుకెళ్తోంది ఐపీఎల్ 2024 సీజన్. ఈ టోర్నీలో లెక్కలేనన్ని రికార్డులు బద్దలు కావడమే కాకుండా.. సరికొత్త ఘనతలు సృష్టించబడుతున్నాయి. తాజాగా ఆదివారం చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో వరల్డ్ రికార్డ్ ను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి టీమ్ గా సీఎస్కే నిలిచింది. మరి ఆ రికార్డ్ ఏంటి? తెలుసుకుందాం పదండి.

ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ను 78 పరుగుల భారీ తేడాతో ఓడించింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 98 పరుగులు చేసి నటరాజ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అతడికి తోడు డార్లీ మిచెల్(52), శివమ్ దుబే(39*) రాణించారు. అనంతరం 213 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ దారుణ ప్రదర్శనను చూపించింది. చెన్నై బౌలర్ల ధాటికి 18.5 ఓవర్లలో కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టులో ఐడెన్ మార్ర్కమ్ ఒక్కడే 32 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 4 వికెట్లు పడగొట్టాడు.

CSK created a world record!

కాగా ఈ మ్యాచ్ తో చెన్నై వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. టీ20ల్లో అత్యధిక సార్లు 200కు పైగా పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. టీ20 క్రికెట్ లో చెన్నై ఇప్పటి వరకు 35 సార్లు 200కు పైగా స్కోర్ సాధించింది. దీంతో ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా సీఎస్కే నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు సోమర్ సెట్ టీమ్ పేరిట ఉండేది. ఆ జట్టు 34 సార్లు 200కు పైగా స్కోర్ సాధించింది. ఇక ఈ లిస్ట్ లో ఇండియా(32), ఆర్సీబీ(31), యార్క్ షైర్(29)సార్లు ఈ ఘనతను నమోదు చేశాయి. మరి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన చెన్నై టీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి