iDreamPost

మండే ఎండల్లో భారీ వర్షాలు.. రాష్ట్రంలో నాలుగు రోజులు వానలు

ఎండలకు తాళలేకపోతున్న ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి.

ఎండలకు తాళలేకపోతున్న ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి.

మండే ఎండల్లో భారీ వర్షాలు.. రాష్ట్రంలో నాలుగు రోజులు వానలు

ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకు తోడు వడగాలులు కూడా వీస్తుండడంతో జనం అల్లాడిపోతున్నారు. అధిక వేడి ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటేనే జంకుతున్నారు. ఏసీలు, కూలర్ల కింద సేదతీరుతున్నారు. ఇలాంటి సయంలో ఓ వర్షం పడితే బాగుండు కదా అని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మండుటెండల్లో భారీ వర్షాలు కురువనుండడంతో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది.

తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వానలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌ సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది.

శుక్రవారం రోజున ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. 19, 20న తేదీల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి