iDreamPost
android-app
ios-app

వేల మంది CSK అభిమానుల మధ్య.. ఈ ఇద్దరూ మెరిశారు! వైరల్ వీడియో!

  • Published Apr 24, 2024 | 4:12 PM Updated Updated Apr 24, 2024 | 4:12 PM

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్నో సూపర్ జియాంట్స్ చేతిలో 6 వికెట్లే తేడాతో ఓటమిపాలైంది రుతురాజ్ సేన.

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్నో సూపర్ జియాంట్స్ చేతిలో 6 వికెట్లే తేడాతో ఓటమిపాలైంది రుతురాజ్ సేన.

  • Published Apr 24, 2024 | 4:12 PMUpdated Apr 24, 2024 | 4:12 PM
వేల మంది CSK అభిమానుల మధ్య.. ఈ ఇద్దరూ మెరిశారు! వైరల్ వీడియో!

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్నో సూపర్ జియాంట్స్ చేతిలో 6 వికెట్లే తేడాతో ఓటమిపాలైంది రుతురాజ్ సేన. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిస సీఎస్​కే ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్నో ఛేజ్ చేయడం కష్టమేనని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఆ టీమ్​కు మంచి స్టార్ట్ దొరకలేదు. స్కోరు బోర్డు మీదకు ఒక్క పరుగు కూడా చేరకుండానే ఓపెనర్ క్వింటన్ డికాక్ ఔట్ అయ్యాడు. 88 పరుగులకు 3 వికెట్లతో కష్టాల్లో పడింది లక్నో. కానీ మార్కస్ స్టొయినిస్ (63 బంతుల్లో 124) ఒంటిచేత్తో ఎల్​ఎస్​జీని ఒడ్డున పడేశాడు. అయితే ఈ మ్యాచ్​లో ఇద్దరు లక్నో ఫ్యాన్స్ వేలాది మంది చెన్నై అభిమానుల్ని సైలెంట్ అయ్యేలా చేశారు.

లక్నోతో సీఎస్​కే మ్యాచ్. ఎల్లో జెర్సీలతో చెపాక్ స్టేడియం మొత్తం పసుపుమయం అయింది. ఎక్కడ చూసినా చెన్నై అభిమానుల ఈలలు, గోలలు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రుతురాజ్ సేన భారీ స్కోరు బాదడంతో సీఎస్​కే ఫ్యాన్స్ తెగ సందడి చేశారు. వాళ్ల విజిల్స్, చప్పళ్లతో స్టేడియం దద్దరిల్లింది. అయితే ఛేజింగ్​లో సీన్ పూర్తిగా మారిపోయింది. 12 ఓవర్ వరకు మ్యాచ్ మొత్తం చెన్నై చేతుల్లోనే ఉంది. కానీ అక్కడి నుంచి చెలరేగి ఆడిన స్టొయినిస్ బౌండరీలు, భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. చూస్తుండగానే మ్యాచ్​ను లక్నో వైపు తిప్పేశాడు. ఆఖర్లో నికోలస్ పూరన్ (15 బంతుల్లో 34), దీపక్ హుడా (6 బంతుల్లో 17) కూడా రెచ్చిపోయి ఆడటంతో ఎల్​ఎస్​జీ విజయతీరాలకు చేరుకుంది. ఈ తరుణంలో ఇద్దరు లక్నో ఫ్యాన్స్ చెన్నై అభిమానులకు చుక్కలు చూపించారు.

స్టొయినిస్ భారీ షాట్లతో విరుచుకుపడుతున్న టైమ్​లో సీఎస్​కే ఫ్యాన్స్ మధ్య ఓ లక్నో ఫ్యాన్ హల్​చల్​ చేశాడు. ఎల్​ఎస్​జీ జెర్సీలో ఉన్న ఆ యువకుడు డ్యాన్సులు చేస్తూ, అరుస్తూ తెగ సందడి చేశాడు. తన ఫేవరెట్ టీమ్ విజయానికి చేరువగా రావడంతో అతడు విజిల్స్ వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ టైమ్​లో సీఎస్​కే అభిమానులు మాత్రం తలపై చేతులు వేసుకొని నిశ్శబ్దంగా అతడ్ని చూస్తూ ఉండిపోయారు. ఇంకో స్టాండ్​లో ఓ పిల్లాడు లక్నో గెలుపును సెలబ్రేట్ చేసుకున్నాడు. పక్కనే ఉన్న సీఎస్​కే అభిమానులను రెచ్చగొడుతూ డ్యాన్స్ చేశాడు. ఇలా ఈ ఇద్దరూ కలసి వేలాది మంది చెన్నై అభిమానుల నోళ్లు మూయించారు. సోషల్ మీడియాలో ఆ కుర్రాడు, ఈ పిల్లాడు ఇద్దరూ వైరల్ అయిపోయారు. అంత మంది ముందు కూడా తమ టీమ్​ మీద ఉన్న ఇష్టాన్ని భయం లేకుండా చూపించిన వీళ్లను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. గ్రౌండ్​లో స్టొయినిస్ హీరో అయితే, స్టాండ్స్​లో వీళ్లిద్దరూ హీరోలని ప్రశంసిస్తున్నారు.