iDreamPost

కప్పులు కొడుతున్నాడు.. ధోనీకేం తక్కువ అంటున్నారు! అతడి బాధ తెలిస్తే అలా అనగలరా?

  • Published Mar 20, 2024 | 1:25 PMUpdated Mar 20, 2024 | 1:25 PM

సీఎస్​కే సారథి ఎంఎస్ ధోని ఐపీఎల్ నయా సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈసారి కూడా మాహీ టీమ్ మీద భారీ ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ధోని కప్పుల మీద కప్పులు కొడుతున్నాడని చాలా మంది అంటున్నారు. కానీ అతడి బాధ తెలిస్తే అలా అనేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోక తప్పదు.

సీఎస్​కే సారథి ఎంఎస్ ధోని ఐపీఎల్ నయా సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈసారి కూడా మాహీ టీమ్ మీద భారీ ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ధోని కప్పుల మీద కప్పులు కొడుతున్నాడని చాలా మంది అంటున్నారు. కానీ అతడి బాధ తెలిస్తే అలా అనేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోక తప్పదు.

  • Published Mar 20, 2024 | 1:25 PMUpdated Mar 20, 2024 | 1:25 PM
కప్పులు కొడుతున్నాడు.. ధోనీకేం తక్కువ అంటున్నారు! అతడి బాధ తెలిస్తే అలా అనగలరా?

ఐపీఎల్​లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్​గా బరిలోకి దిగుతోంది. గాయాల వల్ల ఒకరిద్దరు ప్లేయర్లు దూరమవడం మినహా ఆ టీమ్ అన్నింటా మంచి బ్యాలెన్స్​తో స్ట్రాంగ్​గా కనిపిస్తోంది. గెలుపు ఆనుపాను తెలిసిన కెప్టెన్ ధోని ఉన్నాడు కాబట్టి ఆ టీమ్ ఫ్యాన్స్ పెద్దగా టెన్షన్ పడట్లేదు. ఈసారి కూడా తమదే కప్పు అని ధీమాగా ఉన్నారు. అటు ఫ్రాంచైజీ కూడా మాహీ మరో టైటిల్ అందిస్తాడని భావిస్తోంది. టీమ్ ఆటగాళ్లు కూడా ధోనీతో కలసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం, గ్రౌండ్​లో అతడి దగ్గర నుంచి విలువైన పాఠాలు నేర్చుకుంటామని ఎగ్జైటింగ్​గా ఉన్నారు. ఇలా అందరూ హ్యాపీగానే ఉన్నారు.. ఒక్క ధోని తప్ప. సీఎస్​కే సారథి ఎందుకు సంతోషంగా లేడు? అతడికి వచ్చిన బాధ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మాహీకి వచ్చిన కష్టం ఏంటనేగా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. కప్పుల మీద కప్పులు కొడుతున్నాడు, 45 రోజులు ఆడినందుకే కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు, క్రేజ్​ అలాగే కాపాడుకొని యాడ్స్​తోనూ ఇంకో నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు అని అనుకోవచ్చు. కానీ సరిగ్గా గమనిస్తే.. ధోని అంత హ్యాపీగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. అతడి ముఖం, చిరునవ్వు స్వచ్ఛంగానే ఉన్నా ఆ స్మైల్ వెనుక ఏదో తెలియని బాధ కనిపిస్తోంది. ఇప్పుడు మాహీ వయసు 42. గతేడాది ఐపీఎల్ సమయంలో మోకాలికి దెబ్బ తగలడంతో సర్జరీ చేయించుకున్నాడు. దాని వల్ల చాన్నాళ్లు ఆస్పత్రి మంచానికే పరిమితం అయ్యాడు. శరీరం సహకరించడం లేదు, పైగా గాయాలు వెంటాడుతున్నాయి, మరోవైపు తన తర్వాత కెప్టెన్సీ ఎవరికైనా ఇద్దామంటే వారసుడు దొరకట్లేదు. కొత్త సారథి దొరకేవరకు ఫ్రాంచైజీ తనను వదిలేలా లేదు.

Fans not happy for MS dhoni last season

ఇదే తనకు చివరి ఐపీఎల్ అంటూ ధోని హింట్ ఇస్తే ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతూ.. ఇంకో సీజన్ ఆడమని బతిమిలాడుతున్నారు. దీంతో అయిష్టంగానే సీజన్ మీద సీజన్ ఆడుతూ కొనసాగుతున్నాడు మాహీ. ఒకవేళ ఈ సీజన్​లో కూడా గాయమైతే అతడి పరిస్థితి ఏంటి? ఎక్స్​పెక్టేషన్స్​ను అందుకోవడంలో ఫెయిలైతే.. కొత్త కెప్టెన్ దొరక్కపోతే ఇంకో సీజన్ కూడా ఆడిస్తారా? ఇలా ఇంకెన్నాళ్లు? అని మాహీని అభిమానించే వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అందరినీ సంతోషంగా ఉంచే క్రమంలో తాను మాత్రం బాధను అనుభవిస్తున్నాడని చెబుతున్నారు.

దేనికైనా ఓ లిమిట్ ఉంటుందని.. ఎంతో ఒత్తిడితో కూడిన జాబ్​లో ధోని ఎక్కువ కాలం ఉండటం అతడ్ని మానసికంగా, శారీరకంగా దెబ్బతీస్తుందని వాపోతున్నారు. చెన్నై అభిమానులు, ఫ్రాంచైజీ దీన్ని అర్థం చేసుకొని మాహీకి తగిన ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాలని కోరుతున్నారు. అతడు కోరుకున్న విధంగా వీడ్కోలు చెబితే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి.. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక మీకు ఏం అనిపించింది అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బంధం తెగిపోయింది.. అతనితో ఇక శత్రుత్వమే: రోహిత్‌ శర్మ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి