iDreamPost
android-app
ios-app

ఐపీఎల్-2024​కు ముందు ధోని ఇంట్రెస్టింగ్ పోస్ట్.. కెప్టెన్సీకి గుడ్​బై?

  • Published Mar 05, 2024 | 8:03 AM Updated Updated Mar 05, 2024 | 8:03 AM

ఐపీఎల్-2024కు టైమ్ దగ్గర పడుతోంది. దీంతో ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ఒక్క చోట చేర్చి ప్రాక్టీస్ చేయించే పనిలో ఉన్నాయి. ఈ తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్​ ఎంఎస్ ధోని సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.

ఐపీఎల్-2024కు టైమ్ దగ్గర పడుతోంది. దీంతో ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ఒక్క చోట చేర్చి ప్రాక్టీస్ చేయించే పనిలో ఉన్నాయి. ఈ తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్​ ఎంఎస్ ధోని సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు.

  • Published Mar 05, 2024 | 8:03 AMUpdated Mar 05, 2024 | 8:03 AM
ఐపీఎల్-2024​కు ముందు ధోని ఇంట్రెస్టింగ్ పోస్ట్.. కెప్టెన్సీకి గుడ్​బై?

ఐపీఎల్-2024 మొదలవడానికి ఇంకొన్ని వారాల సమయమే మిగిలి ఉంది. ఈ నెల 22వ తేదీన క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ స్టార్ట్ కానుంది. దీంతో నేషనల్ డ్యూటీకి దూరంగా ఉన్న చాలా మంది క్రికెటర్లు ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించారు. వచ్చే వారం లీగ్​లోని జట్లు తమ ప్లేయర్లను ఒక దగ్గరకు చేర్చి ప్రాక్టీస్ సెషన్స్ మొదలుపెడతాయి. టీమ్ కాంబినేషన్, గేమ్ ప్లానింగ్​ మీద ఫోకస్ పెడతాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఇప్పటికే సన్నాహకాలు షురూ చేశాడు. నెక్స్ట్ వీక్ అతడు చెన్నైకి వచ్చి టీమ్​తో కలుస్తాడని తెలుస్తోంది. ఈ తరుణంలో మాహీ నెట్టింట పెట్టిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ధోని పోస్టుతో ఇంటర్నెట్ ఒక్కసారిగా షేక్ అయింది. కెప్టెన్సీకి అతడు గుడ్​బై చెబుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు మాహీ ఏమని పోస్ట్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్ కొత్త సీజన్ స్టార్ట్ అవడానికి ముందు ధోని సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. నయా సీజన్​లో సరికొత్త రోల్​లో తాను దర్శనమివ్వనున్నానని తెలిపాడు. కొత్త సీజన్, నయా రోల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. అటు చెన్నై ఫ్రాంచైజీ కూడా తమ అధికారిక ట్విట్టర్​ అకౌంట్​లో మాహీకి కొత్త రోల్ ఫిక్స్ అయిందని తెలిపింది. అయితే ఆ రోల్ ఏంటనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ కెప్టెన్సీకి అతడు గుడ్​బై చెబుతున్నాడని జోరుగా వినిపిస్తోంది. కీపింగ్​కు, సారథ్యానికి బైబై చెప్పేసి.. కేవలం బ్యాటర్​గానే కొనసాగనున్నాడని అంటున్నారు. మరికొందరు మాత్రం కోచ్​గా కొత్త అవతారం ఎత్తనున్నాడని చెబుతున్నారు. ఒకవేళ అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే ఆ పగ్గాలను ఎవరికి అప్పగిస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది.

ఇప్పటికే రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ ఇచ్చి ప్రయోగం చేసింది సీఎస్​కే. కానీ అది పూర్తిగా బెడిసికొట్టింది. కెప్టెన్​గా జడ్డూ ఫెయిలయ్యాడు. దీంతో మళ్లీ ధోనీకే ఆ బాధ్యతలను అప్పజెప్పింది టీమ్ మేనేజ్​మెంట్. మాహీ రిటైర్ అవనున్నాడనే వార్తలు గత మూడు సీజన్లుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడు కొత్త రోల్​ గురించి ప్రకటన చేయడంతో కోచ్​ పదవిలోకి మారుతున్నాడా? అనే అనుమానాలు వస్తున్నాయి. కానీ కోచ్​గా టీమ్​ను సక్సెస్​ఫుల్​గా గైడ్ చేస్తున్న స్టీఫెన్ ఫ్లెమింగ్​ను తీసేసి ఇంత హఠాత్తుగా ధోనీకి ఆ బాధ్యతలు అప్పగించడం కష్టమే. అటు కెప్టెన్సీ, ఇటు కోచ్ కాకపోతే మరి.. ఇంకే పాత్రలోకి ధోని మారబోతున్నాడనేది అర్థం కాకుండా ఉంది. బహుశా టీమ్ మేనేజ్​మెంట్​కు సంబంధించిన పోస్టుల్లో ఇంకేదైనా అతడు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్​గా కొనసాగుతూనే కీపింగ్ బాధ్యతల్ని ఇతరులకు అప్పగించి.. మేనేజ్​మెంట్​లో ఇంకేదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ధోని, సీఎస్​కేల్లో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే గానీ ఏదీ చెప్పలేం. మరి.. ధోని నయా రోల్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: బెట్టింగ్‌ రాకెట్‌.. టీమిండియా మాజీ కోచ్‌ ఇంట్లో సోదాలు! భారీగా పట్టుబడ్డ నగదు..