iDreamPost

బెట్టింగ్‌ రాకెట్‌.. టీమిండియా మాజీ కోచ్‌ ఇంట్లో సోదాలు! భారీగా పట్టుబడ్డ నగదు..

  • Published Mar 04, 2024 | 4:59 PMUpdated Mar 04, 2024 | 4:59 PM

Tushar Arothe, Cricket Betting: క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో టీమిండియా మాజీ కోచ్‌ అరెస్ట్‌ అయ్యాడు. టీమిండియా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు తీసుకెళ్లిన కోచ్‌.. ఇప్పుడు బెట్టింగ్‌ కేసులో అరెస్ట్‌ అవ్వడం సంచలనంగా మారింది. ఆ కేసు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Tushar Arothe, Cricket Betting: క్రికెట్‌ బెట్టింగ్‌ కేసులో టీమిండియా మాజీ కోచ్‌ అరెస్ట్‌ అయ్యాడు. టీమిండియా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు తీసుకెళ్లిన కోచ్‌.. ఇప్పుడు బెట్టింగ్‌ కేసులో అరెస్ట్‌ అవ్వడం సంచలనంగా మారింది. ఆ కేసు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 04, 2024 | 4:59 PMUpdated Mar 04, 2024 | 4:59 PM
బెట్టింగ్‌ రాకెట్‌.. టీమిండియా మాజీ కోచ్‌ ఇంట్లో సోదాలు! భారీగా పట్టుబడ్డ నగదు..

ఇండియన్‌ క్రికెట్‌లో మరోసారి బెట్టింగ్‌ మాఫియా కోరలు చాస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ బెట్టింగ్‌ వ్యవహారంలో భారత మహిళల క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా పనిచేసిన తుషార్‌ ఆరోథే తలదూర్చినట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌ కార్యక్రమాలతో పాటు చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు వడోదర స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు ప్రతాప్‌గంజ్‌లోని తుషార్ ఇంటిపై సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు కోటి రూపాయాల వరకు నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. పట్టుబడిన నగదుకు తుషార్‌ వద్ద ఎలాంటి ఆధారాలు, సరైన పాత్రలు లేకపోవడంతో నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని, ఆయనను అరెస్ట్‌ చేశారు. అలాగే తుషార్‌ సన్నిహితుల వద్ద మరో రూ.38 లక్షలు సీజ్ చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా భారత క్రికెట్‌లో మరోసారి బెట్టింగ్‌ కలకలం చెలరేగింది.

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కు కోచ్‌గా అత్యున్నత బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి ఇలా బెట్టింగ్‌ వ్యవహారాల్లో తలదూర్చడంపై క్రికెట్‌ అభిమానులు షాక్‌ అవుతున్నారు. అసలు ఈ బెట్టింగ్‌ రాకెట్‌లో ఆయన హస్తం ఉందా? అదా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. టీమిండియా మాజీ కోచ్‌ అరోథే కుమారుడు రిషి.. క్రికెట్ బెట్టింగ్, చీటింగ్ వంటి నేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సోదాలతో అరోథే కుటుంబం మొత్తం ఈ బెట్టింగ్ రాకెట్‌లో భాగమైనట్లు తెలుస్తోంది. అయితే.. తుషార్‌పై బెట్టింగ్‌ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు.. 2019లోనే తుషార్‌ ఐపీఎల్‌ బెట్టింగ్‌ రాకెట్‌లో తొలిసారి అరెస్ట్‌ అయ్యారు. ఆయనతో పాటు 18 మంది ఆ బెట్టింగ్ కేసులో అరెస్ట్‌ అయ్యారు.

ఆ కేసులో బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత.. తుషార్‌ కోచింగ్‌ కెరీర్‌ ముగిసింది. అంతకంటే ముందు 2017లో భారత మహిళల క్రికెట్‌ జట్టు వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ చేరింది. ఆ టీమ్‌కు తుషార్‌ అరోథేనే కోచ్‌గా ఉన్నారు. ఆ సయమంలో టీమిండియా ప్రదర్శనతో పాటు, తుషార్‌ కోచింగ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. 2018లో టీమిండియా కోచింగ్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న తుషార్‌.. తర్వాత పలు కేసుల్లో ఇరుకున్నారు. ముఖ్యంగా క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహరాల్లో ఆయన భాగస్వామి కావడంతో ఆయనను జైలు పాలు చేసింది. అయినా కూడా ఆయనలో మార్పు రాలేదని, ఇంకా అలానే బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసుల సోదాల్లో ఆయన ఇంట్లో నగదు పట్టుబడింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి