iDreamPost

IPL 2024.. తొలిమ్యాచ్ కు ముందు CSKకి ఊహించని షాక్!

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. ఆ టీమ్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ గాయం కారణంగా ఆరంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడని సమాచారం. మరి ఆ బౌలర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. ఆ టీమ్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ గాయం కారణంగా ఆరంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడని సమాచారం. మరి ఆ బౌలర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024.. తొలిమ్యాచ్ కు ముందు CSKకి ఊహించని షాక్!

ఐపీఎల్ 2024 సీజన్ కు ఏదో దరిద్రం పట్టుకున్నట్లు ఉంది. అందుకే ఈ సీజన్ ప్రారంభం కాకముందే.. స్టార్ ప్లేయర్లు టోర్నీకి దూరమవుతున్నారు. కొందరు గాయాలతో, మరికొందరు వ్యక్తిగత రీజన్స్ తో ఈ మెగాటోర్నీకి ఇప్పటికే దూరమైయ్యారు. తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. ఆ టీమ్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ గాయం కారణంగా ఆరంభ మ్యాచ్ లకు దూరం కానున్నాడని సమాచారం. మరి ఆ స్టార్ బౌలర్ ఎవరు? ఎన్ని మ్యాచ్ లకు దూరమవుతాడు? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

ఐపీఎల్ 2024 సీజన్ ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలకు చెందిన హ్యారీ బ్రూక్, లుంగి ఎంగిడి, మహ్మద్ షమీలతో పాటుగా మరికొంతమంది ఆటగాళ్లు ఈ టోర్నీకి పూర్తిగా దూరమైయ్యారు. ఇక ఇంకొంత మంది ప్లేయర్లు గాయాల కారణంగా ఆరంభ మ్యాచ్ లకు దూరం కానున్నారు. ఆ లిస్ట్ లో సూర్యకుమార్ తో పాటుగా తాజాగా మరో ఆటగాడు చేరాడు. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్, శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ గాయపడినట్లు తెలుస్తోంది.

shock for csk

గత వారం శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గాయపడిన అతడు తొడకండరాల నొప్పితో టీమ్ ను వీడాడు పతిరణ. అయితే అతడిని పరిశీలించిన డాక్టర్లు 4-5 వారాల పాటు విశ్రాంతి అవసరమని చెప్పినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇదే విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ అధికారి కూడా వెల్లడించాడు. “ప్లేయర్లు అన్నాక గాయాలు సహజం. పతిరణ గురించి శ్రీలంక క్రికెట్ బోర్డ్ తో చర్చించాల్సి ఉంది. మా కీలక బౌలర్లలో అతడూ ఒక్కడు” అని సదరు అధికారి చెప్పుకొచ్చాడు. దీంతో ఆరంభ మ్యాచ్ లకు అతడు దూరం కానున్నాడని అర్దమైంది.

అయితే పతిరణ ఎన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు అన్నది కచ్చితంగా చెప్పలేదు. మరోవైపు అతడు గాయం నుంచి కోలుకుంటున్నాడని కొన్ని వార్త సంస్థలు పేర్కొంటున్నాయి.  ఇదిలా ఉండగా.. 21 ఏళ్ల పతిరణ గత సీజన్ లో గొప్ప ప్రదర్శన చేశాడు. ఆ సీజన్ లో మెుత్తంగా 12 మ్యాచ్ లు ఆడి 19 వికెట్లు పడగొట్టి ధోని ప్రశంసలు కొట్టేశాడు. చెన్నై కప్ కొట్టడంలో ఇతడి కీలకపాత్ర. దీంతో ఐపీఎల్ 2024 సీజన్ కు సైతం సీఎస్కే అతడిని రీటైన్ చేసుకుంది. కాగా.. పతిరణ తొలి మ్యాచ్ లకు దూరమైతే.. అతడి ప్లేస్ లో బంగ్లాదేశ్ సీనియర్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మార్చి 22న చెన్నై-బెంగళూరు మ్యాచ్ తో ఈ సీజన్ ఆరంభం కానుంది.

ఇదికూడా చదవండి: క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ సృష్టించిన ఆ చెరగని చరిత్రకు నేటితో 12 ఏళ్లు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి