Nidhan
ఐపీఎల్-2024లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. 200 ప్లస్ స్కోరు ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇన్నేళ్లలో లేనిది మెగా లీగ్‌లో ఎందుకీ మార్పు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్-2024లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. 200 ప్లస్ స్కోరు ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇన్నేళ్లలో లేనిది మెగా లీగ్‌లో ఎందుకీ మార్పు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఐపీఎల్లో ఒకప్పుడు 200 అంటే బిగ్ స్కోర్‌గా చూసేవారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ రెండొందల మార్క్‌ను చేరుకుందంటే గెలుపు ఖాయమనే ధీమాతో ఉండేవి. 180 ప్లస్ స్కోరు చేసినా విక్టరీ పక్కా అని అనుకునేవి. కానీ కాలం మారింది. ఒక్క ఏడాది గ్యాప్‌లో క్యాష్ రిచ్ లీగ్‌లో స్కోర్ల విషయంలో ఊహించని రేంజ్లో తేడా వచ్చేసింది. ఇప్పుడు నీళ్లు తాగినంత ఈజీగా 200 ప్లస్ స్కోర్లు కొట్టేస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్లో దాదాపుగా ప్రతి మ్యాచ్‌లోనూ రెండొందల స్కోరు బాదడం చూస్తున్నాం. గత 14 మ్యాచుల్లో 15 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదవడం గమనార్హం. దీంతో ఇంత ఈజీగా హైస్కోర్లు ఎలా కొడుతున్నారు? ఇన్నేళ్లలో లేనిది ఈ ఐపీఎల్ సీజన్లో ఎందుకింత మార్పు అనే డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి.
200 ప్లస్ కాదు.. ఇప్పుడు 250 ప్లస్ స్కోర్లు బాదడం ఐపీఎల్లో సాధారణంగా మారింది. ఈ సీజన్లో గత కొన్ని మ్యాచుల్లో చూసుకుంటే టీమ్ స్కోర్లు ఇలా ఉన్నాయి.. 261, 262, 262, 266, 272, 277, 287. భారీ స్కోర్లు కొట్టడమే పనిగా పెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ అయితే మూడుసార్లు 250కు పైగా స్కోర్లు బాదింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా దీన్ని అలవాటు చేసుకుంటోంది. నిన్న పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు ఏకంగా 261 పరుగులు చేసింది. పంజాబ్ కూడా ఏం తక్కువ తినలేదు. కొండంత స్కోరును ఛేజ్ చేసి టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ భారీ స్కోర్ల వెనుక ఉన్న రహస్యం ఏంటా అని అందరూ ఆలోచనల్లో పడ్డారు. ఈ సీజన్లో భారీ స్కోర్లు అలవోకగా బాదేయడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఈసారి ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్‌లు ఎక్కువయ్యాయి. దీంతో బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారు. బాల్ ఈజీగా బ్యాట్ మీదకు వస్తుండటంతో బాదుడే బాదుడు అన్నట్లు ఆడుతున్నారు. అలాగే గతంలో కంటే ఇప్పుడు బ్యాటర్ల హిట్టింగ్ ఎబిలిటీస్ పెరిగాయి. టీ20లకు తగ్గట్లు షాట్ మేకింగ్‌ను మరింత మెరుగుపర్చుకున్నారు. గెలుపు, ఓటమికి మధ్య మార్జిన్ తక్కువగా ఉండటంతో సాధ్యమైనంత భారీ స్కోరు కొట్టాలనే స్ట్రాటజీని అన్ని టీమ్స్ ఫాలో అవుతున్నాయి. అదే సమయంలో బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేసే జస్ప్రీత్ బుమ్రా లాంటి తోపు బౌలర్లు చాలా అరుదుగా ఉండటం కూడా హైస్కోర్స్ నమోదవడానికి ఓ కారణంగా చెప్పొచ్చు.
ఇలాంటి ఫ్లాట్ ట్రాక్సే గతంలోనూ ఉన్నా ఈసారి ఆడే దృక్పథం మారింది. టీ20ల్లో గెలవాలంటే అపోజిషన్ టీమ్స్‌ను భయపెట్టాలి. బౌలింగ్‌తో అది అంతగా వీలుపడదు. అందుకే బ్యాటింగ్‌ను ప్రధాన అస్త్రంగా మార్చుకుంటున్నాయి టీమ్స్. మరో విషయం ఏంటంటే.. ఈసారి ఐపీఎల్లో బౌండరీ లైన్స్ దగ్గరగా ఉన్నాయి. బౌండరీలు, సిక్సులు ఈజీగా కొట్టడానికి ఇది కూడా హెల్ప్ అవుతోంది. అలాగే ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్ కూడా భారీ స్కోర్లు చేసేందుకు ఉయోగపడుతోంది. మరి.. 200 ప్లస్ స్కోర్లు ఇంత ఈజీగా బాదడం వెనుక ఇంకేమైనా కారణం ఉందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.