iDreamPost

జియో ఎయిర్ ఫైబర్ సంచలనం.. సింగిల్ కనెక్షన్ తో 120 డివైజ్ లకు ఇంటర్నెట్

సంచలనాలకు మారుపేరైన రిలయన్స్ జియో మరో అద్భుతం చేయనుంది. జియో ఎయిర్ ఫైబర్ ద్వారా సింగిల్ కనెక్షన్ తో 120 డివైజ్ లకు ఇంటర్నెట్ పొందే సౌకర్యాన్ని కల్పిస్తున్నది.

సంచలనాలకు మారుపేరైన రిలయన్స్ జియో మరో అద్భుతం చేయనుంది. జియో ఎయిర్ ఫైబర్ ద్వారా సింగిల్ కనెక్షన్ తో 120 డివైజ్ లకు ఇంటర్నెట్ పొందే సౌకర్యాన్ని కల్పిస్తున్నది.

జియో ఎయిర్ ఫైబర్ సంచలనం.. సింగిల్ కనెక్షన్ తో 120 డివైజ్ లకు ఇంటర్నెట్

టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రపంచం అంతా అరచేతిలో వాలిపోయింది. నేడు ఏ పని కావాలన్నా స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ వినియోగంతో ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. టెలికాం కంపెనీలు యూజర్లకు రకరకాల ప్లాన్ లతో ఇంటర్నెట్ ను ప్రొవైడ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుత రోజుల్లో ఇళ్లల్లో స్మార్ట్ పరికరాల వాడకం ఎక్కువైపోయింది. స్మార్ట్ గాడ్జెట్ లను వాడాలంటే ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఇలాంటి సమయాల్లో ఉపయోగకరంగా ఉండేలా టెలికాం దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో జియో ఎయిర్ ఫైబర్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా 120 డివైజ్ లకు ఇంటర్నెట్ అనుసంధానం చేసుకోవచ్చు.

రిలయన్స్ జియో టెలికాం రంగంలో పెను సంచలనం. నూతన ఆవిష్కరణలతో మిగతా టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. జియో వచ్చాకే ఇంటర్నెట్ వినియోగం పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు యూజర్లకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఫిక్స్ డ్ వైర్ లెస్ యాక్సెస్ సర్వీస్,జియో ఎయిర్ ఫైబర్ ను దేశవ్యాప్తంగా 7వేల పట్టణాలు, నగరాల్లో విస్తరిస్తోంది. 5జీ టెక్నాలజీతో హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందిస్తున్నది. 5జీ నెట్ వర్క్ అందుబాటులో ఉన్న ఏరియాల్లో జియో ఎయిర్ ఫైబర్ ను విస్తరించనున్నది.

JIo Air Fiber

జియో ఎయిర్ ఫైబర్ ద్వారా వినియోగదారులకు అందించే వైఫై కనెక్షన్‌తో గరిష్టంగా 120 పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చని ధృవీకరించింది. కనెక్ట్ చేయబడిన డివైజ్ లకు ఈక్వల్ గా ఇంటర్నెట్ వేగం పంపిణీ అవుతుందని తెలిపింది. దీనికోసం బేసిక్ ప్లాన్ గా 30ఎంబీపీఎస్ సరిపోతుందని తెలిపింది. 500 ఎంబీపీఎస్ లేదా 1జీబీపీఎస్ జియో ప్రత్యేక ప్లాన్ల ద్వారా మరింత వేగంగా ఇంటర్నెట్ అందుకోవచ్చని సూచించింది. వైర్ లెస్ ఎయిర్ ఫైబర్ కావడంతో ఫైబర్ కనెక్షన్లు లేని ప్రాంతాల్లో అద్భుతమైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. జియో ఎయిర్ ఫైబర్ ఒక జియో సెటప్ బాక్స్ తో వస్తుంది. డిజిటల్ టీవీ ఛానల్స్, ఓటీటీ యాప్స్, వైఫై సర్వీస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి