iDreamPost

విధిరాతను ఎదరించి విజేతగా నిలబడ్డ మహిళ!

విధిరాతను ఎదరించి విజేతగా నిలబడ్డ మహిళ!

మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేది సర్వసాధారణం. అయితే  కొందరు మాత్రం ఏ కష్టం తెలియకుండా పెరుగుతారు. అలానే ఓ మహిళ కూడా చిన్నతనం నుంచి ఏ కష్టం లేకుండా పెరిగింది. అలానే అత్తింట్లోను అడుగు పెట్టి..పిల్లలు,ఇళ్లే ఆమె ప్రపంచం. భర్త, పిల్లలే సర్వస్వం అనుకుని జీవిస్తున్న ఆమెకు మూడు పదుల వయస్సులోనే పసుపు కుంకుమ దూరమైంది. అయినా విధి ఆడిన వింతనాటకానికి తాను బలి కాదల్చుకోలేదు. విధిరాతను ఎదిరించి.. ఆత్మసైర్థ్యంతో  జీవన పోరాటం సాగించింది. భర్త మరణాన్ని దిగమింగుకుంటూ.. కష్టతరమైన పని చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తుంది. మగవారికి పరిమితమైన పవర్ టూల్స్ మోకానిక్ వృతిని చేపట్టి తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. మరి.. ఆమె ఎవరు? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన వీరనాగమల్లేశ్వరికి  ఇంటర్ వరకు చదువుకుంది. ఉమామహేశ్వరపురానికి చెందిన చొప్పా రాముతో మల్లేశ్వరి వివాహం జరిగింది. రాము ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఆడ, మగ కమలు జన్మించారు. పిల్లల, భర్తతో కలిసి నాగమల్లేశ్వరి సంతోషంగా ఉంటుంది. అలా పదేళ్ల పాటు అన్యోన్యంగా వీరి వైవాహిక జీవితం సాగింది. అయితే ఈ దంపతులను చూసి విధికి కన్నుకుట్టినట్లు ఉంది. కరోనా టైమ్ లో రాముకు కడుపులో  ఇన్ ఫెక్షన్ సోకింది.

ఆ ఇన్ ఫెక్షన్ కారణంగా క్రమంగా వ్యాధి తీవ్రమై శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఇంటిని తాకట్టు పెట్టి రూ.8లక్షలు అప్పు తీసుకుని ఆపరేషన్ చేయించారు. అయినా రాము వారికి దక్కలేదు. అప్పటి వరకు ఇళ్లు దాటి బయటకు వెళ్లని నాగమల్లేశ్వరికి.. భర్త మరణంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. పిల్లలు ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇక వారి చదువులు, కుటుంబ పోషణ ఎలా సాగించాలో అర్ధం కాలేదు. చివరకు గుండెను రాయి చేసుకుని పిల్లల కోసమైన తాను ఆత్మస్థైర్యంతో ఉండాలని భావించింది. తన భర్త నిర్వహిస్తున్న పవర్ టూల్స్ షాపును తిరిగి ప్రారంభించింది. రాము బతికున్నప్పుడు.. మల్లేశ్వరి షాపుకు వెళ్లి.. ఆ టూల్స్ ను గమనిస్తుండేది.

అదే ఇప్పుడు  ఆమెకు ఉపయోగ పడింది. ఏడాది నుంచి వివిధ రకాల పవర్ టూల్స్ ను అద్దెకిస్తూ.. వాటికి రిపేర్లు చేస్తూ.. సంపాదిస్తున్నారు. ఆ షాపు మీద వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని, పిల్లలను చదివిస్తుంది. ఒకప్పుడు బయటకు వచ్చి.. సమాధానం చెప్పలేని నాగమల్లేశ్వరి.. ఇప్పుడు నిత్యం పదుల సంఖ్యలో కస్టమర్లకు  సమాధానం చెప్పే ధైర్యాన్ని సంపాదించింది. తన భర్త నింపిన స్ఫూర్తే.. తాను ఈ స్థాయికి వచ్చేలా, ధైర్యంగా ఉండేందుకు తోడ్పడిందని నాగమల్లేశ్వరి తెలిపారు. కష్టలతో బాధ పడుతున్న ఎందరో మహిళలకు నాగమల్లేశ్వరి ఆదర్శం. మరి..నాగమల్లేశ్వరి సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వింత ఆచారం..రాయిపై చేసిన పాయసాన్ని అలాగే తాగుతూ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి