iDreamPost

ఉలిక్కిపడ్డ విజయవాడ! స్పా సెంటర్ల మాటున వ్యభిచారం!

  • Published Mar 13, 2024 | 4:25 PMUpdated Mar 13, 2024 | 4:25 PM

స్పా సెంటరుల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా నటిపిస్తున్న 6 వ్యభిచార కూపాలు అనేవి తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇంతకి ఎక్కడంటే..

స్పా సెంటరుల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా నటిపిస్తున్న 6 వ్యభిచార కూపాలు అనేవి తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇంతకి ఎక్కడంటే..

  • Published Mar 13, 2024 | 4:25 PMUpdated Mar 13, 2024 | 4:25 PM
ఉలిక్కిపడ్డ విజయవాడ! స్పా సెంటర్ల మాటున వ్యభిచారం!

ఈ మధ్యకాలంలో స్పా సెంటరుల పేరుతో వ్యభిచార కూపాలను నిర్వహిస్తున్న సంగతి విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహా నగరంలో ఈ స్పా సెంటర్ ల ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా అనైతిక కార్యకలాపాలాలు జరిపిస్తున్నారు. ఈ క్రమంలోనే లగ్జరీ లైఫ్ కు అలవాటు పడాలకున్న  చాలామంది యువతకు ఉద్యోగం పేరిట ఆశ చూపించి, హైదరాబాద్ కు రప్పించి.. ఈ వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నారు. పైగా ఈ స్పా సెంటర్ల పేరిట మోసాలకు కూడా పాల్పడుతూ.. దందాలను కొనసాగిస్తున్న కొంతమందిని ఇటీవలే పోలీసులు గుర్తించారు. అలాగే,  నగరంలోని పలు ప్రాంతాల్లో గతకొన్ని రోజుల క్రితం ఇలాంటి స్పా సెంటర్ల పై పోలీసులు దాడులకు దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటన మరువక ముందే తాజాగా మరోమారు ఈ స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార కూపాం తీవ్ర కలకరం రేపింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా విజయవాడలోని మసాజ్‌ సెంటర్ల ముసుగులో వ్యభిచారం సాగుతోందన్న సమాచారంతో.. పోలీసులు స్పా సెంటర్లపై మెరుపు దాడులు చేశారు. అయితే, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాల మేరకే ఈ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగింది. ఇక ఈ అపరేషన్ లో ఇసుక, మట్టి, మద్యం అక్రమ తరలింపును అరికట్టేందుకు ఏర్పడిన సెబ్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులతో సహా.. 62 మంది, 10 బృందాలుగా ఏకకాలంలో విజయవాడ పరిధిలోకి వచ్చే.. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని గల 6 స్పా సెంటర్ల పై ఏక కాలంలో మెరుపు దాడులు చేశారు. అయితే.. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొంతకాలంగా స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడంతో పాటు క్రాస్ మసాజ్ ముసుగులో వ్యభిచార కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టుగా అందిన సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే పటమట, మాచవరం, పెనమలూరు, ఎస్.ఆర్.పేట పరిధిలోని స్పా సెంటర్లపై మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు.

ఇక ఈ దాడులలో స్థానిక మహిళలతో పాటు విదేశీ మహిళలతో సైతం వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 10 బృందాలతో ఆరు స్పా సెంటర్లపైన జరిపిన దాడులలో థాయిలాండ్‌కు చెందిన ముగ్గురు విదేశీ మహిళలతో పాటు 24 మంది మహిళలకు విముక్తి కల్పించడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేందుకు వచ్చిన 25 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, స్పా సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఐదుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే ఈ అక్రమ స్పా సెంటర్ల నిర్వహణను నివారించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన పోలీసులు అధికారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు.కాగా, ఈ దాడులనేవి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఐజి రవి ప్రకాష్ పర్యవేక్షణలో జరిగాయి. మరి, విజయవాడలో స్పా సెంటర్ల ముసుగులో వెలుగులోకి వచ్చిన వ్యభిచార కూపాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి