iDreamPost

AP: అదృష్టం అంటే ఇది.. 2 చేపలకు రూ.4 లక్షలు.. ఎందుకంత ప్రత్యేకం

  • Published Apr 14, 2024 | 1:28 PMUpdated Apr 14, 2024 | 1:28 PM

లాటరీ టికెట్లు మాత్రమే కాదు.. అప్పుడప్పుడు చేపలు కూడా మన తలరాతని మారుస్తుంటాయి. తాజాగా ఇదే ఘటన చోటు చేసుకుంది. రెండు చేపలు ఏకంగా 4 లక్షల రూపాయలు పలికాయి. ఆ వివరాలు..

లాటరీ టికెట్లు మాత్రమే కాదు.. అప్పుడప్పుడు చేపలు కూడా మన తలరాతని మారుస్తుంటాయి. తాజాగా ఇదే ఘటన చోటు చేసుకుంది. రెండు చేపలు ఏకంగా 4 లక్షల రూపాయలు పలికాయి. ఆ వివరాలు..

  • Published Apr 14, 2024 | 1:28 PMUpdated Apr 14, 2024 | 1:28 PM
AP: అదృష్టం అంటే ఇది.. 2 చేపలకు రూ.4 లక్షలు.. ఎందుకంత ప్రత్యేకం

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. కొన్ని గంటల్లో జీవితాలు రోడ్డున పడతాయి అనుకున్న తరుణంలో లాటరీ రూపంలో అదృష్టం వరించి.. లక్షాధికారులు అయిన వారు ఎందరో ఉన్నారు. ఇక ఈ మధ్య కాలంలో సామాన్యులు, పేదలకు లక్షలు, కోట్ల రూపాయల లాటరీలు తగులుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ మత్స్యకారున్ని కూడా ఇలాంటి అదృష్టమే వరించింది. అతడి వలకు చిక్కిన రెండు చేపలు.. ఆ జాలరిని లక్షాధికారిని చేశాయి. కేవలం రెండు చేపలు 4 లక్షల రూపాయల ఖరీదు పలికాయి. ఎందుకు.. ఆ చేపల ప్రత్యేకత ఏంటంటే..

మత్యకారుల వలలో అప్పడప్పుడు అరుదైన చేపలు పడుతూ ఉంటాయి. చూడ్డానికి ఎంతో చిన్నగా ఉండే వీటి ఖరీదు.. లక్షల్లో ఉంటుంది. అలాంటి అరుదైన జాతులకు చెందిన చేపలు వలకు చిక్కితే మత్స్యకారుల పంట పడినట్లే. రాత్రికే రాత్రే లక్షాధికారులు అవుతారు. తాజాగా.. కృష్ణా జిల్లా అంతర్వేదిలో ఓ మత్స్యకారుడు కూడా రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. అతడి వలకు చిక్కిన 2 చేపలు ఏకంగా 4 లక్షల రూపాయలు పలికాయి. మరి ఆ చేపల ప్రత్యేకత ఏంటంటే..

సదరు మత్స్యకారుడి వలకు అరుదైన కచ్చిడి చేపలు చిక్కాయి. వీటిని కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లిపాలెం ఫిషింగ్ హర్బర్‌లో వేలం వేశారు. వీటిని కొనేందుకు వ్యాపారలు ఎగబడగా.. వారిలో ఓ వ్యక్తి అత్యధికంగా ఒక్కో చేపకు రూ. 2 లక్షల చొప్పున మెుత్తం రూ. 4 లక్షలు చెల్లించి ఈ రెండు చేపలను కొనుగోలు చేశాడు.

ఏంటి వీటి ప్రత్యేకత..

కచ్చిడి చేప శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. ఈ చేప పొట్ట భాగంలో ఉండే అవయవాలకు ఔషద గుణాలుంటాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి చేపలు చాలా అరుదుగా వలకు చిక్కుతాయి. ఇవి కనుక వలలో పడ్డాయా.. ఇక ఆ మత్స్యకారుల పంట పండినట్లే. కచ్చడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్‌ అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఆ చేపలు బంగారం కన్నా అధిక విలువ కలిగి ఉంటాయి. కచ్చిడి చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండవని.. చాలా అరుదుగా ఈ చేపలు మత్స్యకారుల వలలో చిక్కుతాయన్నారు.

సర్జరీ సమయంలో డాక్టర్లు కుట్లు వేయడానికి ఉపయోగించే దారాలను ఈ చేపల నుంచే తయారు చేస్తారన్నారు. కచ్చడి చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం కాలక్రమేణా శరీరంలో కలిసిపోతుందని చెప్పారు. అలానే పిత్తాశయం, ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేసే మందుల తయారీలోనూ ఈ చేపను ఎక్కువగా ఉపయోగిస్తారు.

అంతేకాదు కాస్ట్లీ వైన్‌ తయారు చేసే పరిశ్రమల్లో కచ్చిడి చేపను ఉపయోగిస్తారట. ఈ చేప రెక్కలు వైన్‌ను క్లీన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అంతర్జాతీయంగానూ కచ్చడి చేపకు మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు లక్షల రూపాయలు చెల్లించి మరీ వీటిని కొనుగోలు చేస్తారని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి