iDreamPost

పురుటిగడ్డలో బయల్పడిన ఇక్ష్వాకులనాటి అరుదైన శాసనం..

Ikshvaku Time Idol found In Puritigadda: కృష్ణా జిల్లా పురిటిగడ్డలో అరుదైన శిలా శాసనం లభ్యమైంది. అది ఏకంగా ఇక్ష్వాకుల కాలంనాటిది అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

Ikshvaku Time Idol found In Puritigadda: కృష్ణా జిల్లా పురిటిగడ్డలో అరుదైన శిలా శాసనం లభ్యమైంది. అది ఏకంగా ఇక్ష్వాకుల కాలంనాటిది అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

పురుటిగడ్డలో బయల్పడిన ఇక్ష్వాకులనాటి అరుదైన శాసనం..

భారతదేశం గొప్పతనం, కీర్తి ప్రతిష్టలను మాటల్లో చెప్పలేం. మన దేశ గొప్పతనాన్ని, చరిత్రను తెలియజేస్తూ.. రాజుల కాలంనాటి పరాక్రమాలను, అప్పటి పరిస్థితులను, చెప్పుకోదగ్గ విషయాలను శాసనాలుగా, శిలాఫలకాలుగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాలక్రమంలో అవన్నీ మరుగున పడిపోయాయి. కానీ, పురావస్తు శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పటికీ అరుదైన, గొప్ప గొప్ప శాసనాలు, అరుదైన శిల్పాలు బయల్పడుతూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో కూడా ఒక అరుదైన ప్రాకృత శాసనం ఒకటి లభించింది. అది ఇక్ష్వాకుల కాలం నాటిది అంటూ పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ అరుదైన, ఎంతో విలువైన ప్రాకృత శాసనం కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలంలోని పురుటిగడ్డలో లభించిన విషయాన్ని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. పురుటిగడ్డలోని వీరభద్ర స్వామి ఆలయం పునఃనిర్మాణ పనుల్లో ఈ శాసనం లభ్యమైంది. వీరభద్రస్వామి విగ్రదాన్ని ఊడదీసి భద్రపరిచే క్రమంలో.. విగ్రహాం వెనుక ఈ శాసనాన్ని గుర్తించినట్లు తమకు సమాచారం అందిందన్నారు. విశ్రాంత ఆర్డీవో శివరామకృష్ణ, పీజీటీ ఉమా సరస్వతి సమాచారం అందినట్లు శివనాగిరెడ్డి చెప్పారు. ఆ విగ్రహాన్ని పరిశీలించిన తర్వాత ఏ కాలం నాటిది.. ఆ శాసనం శాస్త్రీయ ఆధారాల కోసం కేంద్ర పురావస్తు శాఖకు పంపినట్లు తెలిపారు.

Old idols caught in puritigadda

ఆ విగ్రహాన్ని.. దాని వెనుక ఉన్న శాసనాన్ని పరిశీలించిన కేంద్ర పురావస్తు శాఖ విభాగం సంచాలకులు కె. మునిరత్నంరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ శాసనం చాలా పురాతనమైనదిగా ప్రకటించారు. ఆ పోతురాజు విగ్రహం ఇక్ష్వాకుల కాలం నాటిది అని స్పష్టం చేశారు. అలాగే ఆ విగ్రహం వెనుక ఉన్న పదాలు బ్రహ్మి లిపిలో ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఆనందుడు అనే బౌద్ధాచార్యుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్టించిన వివరాలు ఆ విగ్రహం వెనుక రాసి ఉన్నట్లు తెలిపారు. అయితే విగ్రహం పగిలి ఉండటం వల్ల కొన్ని అక్షరాలు లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియరాలేదని వ్యాఖ్యానించారు.

ఈ పల్నాటి ప్రాంతానికి చెందిన సున్నపురాతి విగ్రహంపై ఒకవైపు పోతురాజు విగ్రహం ఉంది. మరోవైపు బ్రహ్మి లిపిలో ప్రతిష్టించిన వివరాలు ఉన్నాయి. అలాగే మరోవైపు బిడ్డను పట్టుకున్న ఒక తల్లి ఫొటో ఉందని శివనాగిరెడ్డి వెల్లడించారు. మన చరిత్రను, మన నేల గొప్పతనాన్ని తెలియజేసే శాసనాలు, విగ్రహాలను భద్రపరుచుకోవాలి అని శివనాగిరెడ్డి వ్యాఖ్యానించారు. మన భవిష్యత్ తరాలకు మన చరిత్రను తెలియజేసుందుకు ఈ విగ్రహం ప్రతిబింబాన్ని ఆలయం వద్ద ప్రదర్శించి.. వారికి తెలియజేయాలని గ్రామస్థులకు సూచించారు. పురిటిగడ్డ గ్రామంలోని పోతురాజు విగ్రహం ఇక్ష్వాకుల కాలంనాటిదని తెలుసుకుని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి