iDreamPost

మిథాలీ రాజ్ సాధించిన రికార్డులు, రివార్డులు..

మిథాలీ రాజ్ సాధించిన రికార్డులు, రివార్డులు..

టీమిండియా మహిళా స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు అన్ని ఫార్మెట్స్ లో గుడ్ బై చెప్పేశారు. 39ఏళ్ల వయస్సులో 23ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు చెప్పారు. భారత మహిళా క్రికెట్ లో చూస్తే మిథాలీ ముందు మిథాలీ తర్వాత అని కచ్చితంగా ఆచెప్పొచ్చు. మిథాలీ ఎన్నో రికార్డులని సాధించింది. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌‌గా, మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన కెప్టెన్ గా ఇలా చాలా రికార్డులు ఆమె సొంతం.

1999లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మిథాలీ ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌ ఆడి ఈ సంవత్సరం దక్షిణాఫ్రికాతో చివరి మ్యాచ్ ఆడారు.

2003లో అర్జున అవార్డు,
2017లో విజ్డెన్ లీడింగ్ ఉమెన్ క్రికెటర్ ఇన్ వరల్డ్ అవార్డు,
2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు,
2021లో ఖేల్ రత్న అవార్డు.. ఇలా మిథాలీ సాధించిన అవార్డులు ఎన్నో..

మిథాలీ రాజ్ సాధించిన కొన్ని ముఖ్యమైన రికార్డులు…
#భారతదేశం తరఫున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి మిథాలీని ‘టెండూల్కర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’ అని పిలుపించుకుంది.
#2017 మహిళల క్రికెట్ ప్రపంచకప్ లో మిథాలీ వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు సాధించి ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌ గా రికార్డు సృష్టించింది.
#వరల్డ్ కప్‌లో వెయ్యి కంటే ఎక్కువ పరుగులు చేసిన మహిళా క్రికెటర్ మిథాలీ.
#వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా మిథాలీ నిలిచింది. 232 వన్డే మ్యాచ్‌ల్లో 7వేల 805 పరుగులు చేసింది.
#అంతర్జాతీయ టీ20ల్లో 2వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మిథాలీ నిలిచారు.
#20 ఏళ్లకు పైగా ఆడిన తొలి మహిళా క్రికెటర్ కూడా మిథాలీనే.
#200 వన్డే మ్యాచ్‌లు ఆడిన ఏకైక మహిళా క్రికెటర్‌ మిథాలీ.
#2005, 2017 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన భారత్‌ జట్టులో ఆడారు.
#వన్డే ప్రపంచకప్‌లో అత్యధికంగా 24 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన మహిళా క్రికెటర్ మిథాలీ.
#ఆరు వన్డే ప్రపంచకప్‌లు ఆడిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్. పురుషుల విభాగంలో భారత్ తరఫున ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట మాత్రమే ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి