iDreamPost

ఆంధ్ర క్రికెటర్‌కి అండగా సీఎం జగన్! KS భరత్‌కు అవకాశం

ఆంధ్ర క్రికెటర్‌కి అండగా సీఎం జగన్! KS భరత్‌కు అవకాశం

క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉంటుంది ఏపీలోని జగన్ సర్కార్. పలువురు క్రీడాకారులకు పదవులను కూడా ఇచ్చిన సంగతి విదితమే. తాజాగా టీమిండియా క్రికెట్ కోన శ్రీకర భరత్‌కు ఉద్యోగంతో పాటు ఇంటి స్థలాన్ని కేటాయించింది. కేర్ ఫర్ క్రికెట్ ఆధ్వర్యంలో కేఎస్ భరత్‌కు శుక్రవారం సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి పాల్లొన్నారు. ఈ సందర్భంగా కేఎస్ భరత్ పై వరాల జల్లు కురిపించింది ఏపీ ప్రభుత్వం. భరత్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 కేడర్ ఉద్యోగంతో పాటు విశాఖలో 1000 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు క్రికెటర్ కేఎస్ భరత్ కు మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రకటన చేశారు.

అలాగే క్రికెట్ అకాడమీకి స్థలం ఇచ్చే విషయాన్నిపరిశీలిస్తామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఆడుదాం ఆంధ్రా ద్వారా రాష్ట్రంలో క్రీడల పండుగను నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో యువతకు ఐదు లక్షల క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తామని, మూడు వందల కోట్లతో నూతన క్రికెట్ స్టేడియం నిర్మిస్తామన్నారు. కాగా, ప్రస్తుతం భరత్‌.. టీమిండియాలో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. రిషభ్‌ పంత్‌ రీప్లేస్‌మెంట్‌గా టీమిండియా టెస్ట్‌ జట్టులో స్థానం సంపాదించిన భరత్‌.. కొన్ని మంచి ప్రదర్శనల తర్వాత.. ఫామ్‌ కోల్పోయి జట్టులో స్థానం చేజార్చుకున్నాడు. వన్డే, టీ20ల్లో టీమిండియాకు వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ పొజిషన్‌కు భారీ ఎత్తున పోటీ ఉండటంతో.. భరత్‌కు లిమిటెడ్‌ ఓవర్స్‌ క్రికెట్‌లో స్థానం దక్కలేదు.

కాగా, భరత్‌.. ఆంధ్ర జట్టు వికెట్ కీపర్, రంజీ ట్రోపీల్లో సత్తా చాటిన కేఎస్ భరత్.. ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తరుఫున ఆడాడు. ఐపీఎల్‌ 2021 సీజనల్‌లో ఆర్సీబీ తరుఫున ఆడి ఓ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌తో భరత్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత టీమిండియాలో స్థానం కూడా దక్కింది. ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌ లాంటి స్టార్లు టీమిండియా వన్డే, టీ20 క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండటంలో భరత్‌కు పరిమిత ఓవర్ల జట్టులో స్థానం లభించలేదు. మరి భరత్‌ కెరీర్‌తో పాటు అతనికి ఏపీ ప్రభుత్వం గ్రూప్‌ 1 ఉద్యోగం ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజే​యండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి