స్టైలిష్ లెఫ్టాండర్, కీపర్ రిషబ్ పంత్ టీమిండియాలోకి రావాలని అతడి ఫ్యాన్స్‌తో పాటు టీమిండియా అభిమానులందరూ కోరుకుంటున్నారు. సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న పంత్ రీఎంట్రీ ఇవ్వాలంటే ఒక పని చేయాల్సి ఉంటుందట.
స్టైలిష్ లెఫ్టాండర్, కీపర్ రిషబ్ పంత్ టీమిండియాలోకి రావాలని అతడి ఫ్యాన్స్‌తో పాటు టీమిండియా అభిమానులందరూ కోరుకుంటున్నారు. సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న పంత్ రీఎంట్రీ ఇవ్వాలంటే ఒక పని చేయాల్సి ఉంటుందట.
టీమిండియా వన్డే వరల్డ్ కప్-2023లో అదరగొడుతోంది. వరుస విజయాలతో సెమీస్ బెర్త్‌ను కూడా ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్‌పై విక్టరీతో ప్రపంచ కప్ పాయింట్ల పట్టికలో ఏకంగా ఫస్ట్ ప్లేస్‌కు చేరుకుంది. గ్రూప్ స్టేజ్‌లో మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా భారత టీమ్ ఫోకస్ అంతా సెమీస్ మీదే పెడుతోంది. సెమీఫైనల్, ఫైనల్స్ గెలిస్తే మరో వరల్డ్ కప్ మనదే అవుతుంది. కాబట్టి ఆ బిగ్ గేమ్స్ పైనే స్పెషల్ ఫోకస్ పెడుతోంది. ఇక, మెగా టోర్నీ పూర్తయ్యాక భారత జట్టులో పలు సంచలన మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీ, ద్రవిడ్ కోచింగ్, విరాట్ కోహ్లీ ఫ్యూచర్ విషయంలో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ప్రస్తుత వరల్డ్ కప్‌తో ద్రవిడ్ పదవీ కాలం ముగియనుండటం, ఈసారి కప్పు గెలవడం మీదే రోహిత్ శర్మ కెప్టెన్సీ ఆధారపడటం, టీ20ల నుంచి రోహిత్-విరాట్ పూర్తిగా తప్పుకుంటారా? లాంటి చాలా విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఇంజ్యురీ నుంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రాలు టీమ్‌లో సెటిలైపోయారు. అయ్యర్ ఫామ్ కాస్త ఆందోళనకరంగా ఉన్నప్పటికీ రాహుల్, బుమ్రాలు మాత్రం అదరగొడుతున్నారు. ఇటీవల గాయపడిన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు.
గాయానికి ట్రీట్మెంట్ పూర్తవ్వడంతో ఎన్సీఏలో పాండ్యా ట్రైనింగ్ మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం భారత స్టార్ ప్లేయర్లలో కొందరు టీమ్‌లో ఉంటే.. మరికొందరు జట్టులో ప్లేస్ దొరక్క డొమెస్టిక్ లెవల్లో ఆడుతున్నారు. ఒక్క రిషబ్ పంత్ తప్ప.. ఇంజ్యురీల బారిన పడిన ప్లేయర్స్ అందరూ తిరిగొచ్చేశారు. గతేడాది కారు యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన పంత్ పూర్తిగా కోలుకున్నాడు. ఎన్ఏసీలో అతడు ట్రైనింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసేశాడు. వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో పలు సంచలనాలు ఉంటాయనే నేపథ్యంలో కీలక ప్లేయర్ అయిన పంత్ రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
నేషనల్ మీడియా సమాచారం ప్రకారం.. టీమిండియాలో పంత్ ఎంట్రీ ఇవ్వాలంటే ఒక పని చేయాల్సి ఉంటుందట. త్వరలో జరిగే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ లాంటి డొమెస్టిక్ టోర్నీల్లో రాణించాల్సి ఉంటుందట. బ్యాటుతో పాటు కీపింగ్‌లోనూ సత్తా చాటాలట. ఫామ్, ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకుంటే ఆఫ్ఘానిస్థాన్‌తో సిరీస్‌కు పంత్ టీమ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చే సూచనలు ఉన్నాయని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి.. పంత్ రీఎంట్రీ కోసం మీరెంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: కోహ్లీ ఔట్‌కు సూపర్‌గా ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా! వాళ్ల స్ట్రాటజీతోనే..!