SNP
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 445 రన్స్ చేసిన ఇండియా.. ఇంగ్లండ్ 319 పరుగులకే ఆలౌట్ చేసింది. 290 పరుగులకే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్ట స్థితిలో నిలిచిన ఇంగ్లండ్ అంత తక్కువ స్కోర్‌కే ఎలా ఆలౌట్ అయిందో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 445 రన్స్ చేసిన ఇండియా.. ఇంగ్లండ్ 319 పరుగులకే ఆలౌట్ చేసింది. 290 పరుగులకే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్ట స్థితిలో నిలిచిన ఇంగ్లండ్ అంత తక్కువ స్కోర్‌కే ఎలా ఆలౌట్ అయిందో ఇప్పుడు చూద్దాం..
SNP
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తూ.. 445 పరుగులు చేసిన భారత్.. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకే కుప్పకూల్చింది. నిజానికి రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్.. ఇండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగి, బజ్‌బాల్ స్ట్రాటజీని ప్రయోగించింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ టీమిండియా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఇండియాను ఆలౌట్ చేసిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 207 పరుగులు చేసింది. అందులో డకెట్ ఒక్కడే సెంచరీతో కదం తొక్కాడు. ఒక మూడో రోజ మరింత దూకుడు ఆడేందుకు ఇంగ్లండ్ సిద్ధమైంది. అందుకు తగ్గట్లే సెంచరీ పూర్తి చేసుకుని మంచి ఊపు మీదున్న డకెట్ అదే టెంపోను మూడో రోజు కూడా కొనసాగించాడు.
2 వికెట్ల నష్టానికి 207 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ను బుమ్రా దెబ్బకొట్టాడు. 224 పరుగుల వద్ద జో రూట్‌ను అవుట్ చేశాడు. ఆ వెంటనే మరుసటి ఓవర్‌లో బెయిర్ స్టోను కుల్దీప్ యాదవ్ డకౌట్ చేశాడు. దీంతో 225 పరుగుల వద్ద ఇంగ్లండ్ 4వ వికెట్ కోల్పోయింది. తర్వాత కొద్ది సేపు డకెట్-బెన్ స్టోక్స్ జోడీ వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. 260 పరుగుల వద్ద బెన్ డకెట్ అవుటైన తర్వాత.. ఫోక్స్‌తో కలిసి స్టోక్స్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 5 వికెట్ల నష్టానికి 290 పరుగుల వద్ద ఇంగ్లండ్ టీమ్ లంచ్‌కి వెళ్లింది. దీంతో.. మరో 100 పరుగుల లోపు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేస్తే చాలాని భారత క్రికెట్ అభిమానులు భావించారు.
కానీ, లంచ్ తర్వాత తిరిగొచ్చిన టీమిండియా బౌలర్లు నిప్పులు చెరిగారు. 290 పరుగుల ఐదు వికట్లె వద్ద ఉండి.. లంచ్ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌ను వణికిస్తూ.. కేవలం 29 పరుగుల తేడాతో చివరి 5 వికెట్ల కూల్చేశారు. దీంతో.. ఏ 400 పరుగులు చేస్తుందనుకున్న ఇంగ్లండ్ జట్టు కేవలం 319 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా సిరాజ్ చివరి వికెట్లను పటపటా కూల్చేశాడు. మొత్తంగా సిరాజ్ 4 వికట్లెతో సత్తా చాటాడు. కుల్దీప్ యాదవ్, జడేజా రెండేసి వికెట్ల తీసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. రెండో రోజు ఆడిన అశ్విన్ ఒక వికెట్ తీసుకున్న విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో అశ్విన్ లేకపోయినా.. మిగతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో వారిపై ప్రశంసలు కురుస్తున్నాయి. లంచ్ బ్రేక్‌లో మనోళ్లు ఏం తిన్నారో? ఏం తాగారో ఇలా చెలరేగుతున్నారంటూ క్రికెట్ అభిమానులు సరదాగా పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
224-2 at one stage then:
224-3
225-4
260-5
299-6
299-7
314-8
314-9
319-10What a comeback by India with Siraj taking 4 wickets. 👌 pic.twitter.com/dQxREDV2x1
— Johns. (@CricCrazyJohns) February 17, 2024
Simply brilliant from Siraj and Kuldeep.
Down to 10 players and what a remarkable fightback.
Lovely to watch— Virender Sehwag (@virendersehwag) February 17, 2024