SNP
SNP
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023 ఫైనల్లో ఓటమి తర్వాత టీమిండియా కొత్త టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లోకి ఎంటరైంది. వెస్టిండీస్‌తో టెస్ట్, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు కరేబియన్ గడ్డకు చేరుకున్న భారత జట్టు బుధవారం నుంచి తొలి టెస్ట్ ఆడనుంది. డొమినికాలోని విండ్సర్ పార్క్ మైదానంలో భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ ఏ టైమ్‌కి ప్రారంభం అవుతుంది, ఇండియన్ టైమింగ్ ఏంటి? ఏ ఛానెల్‌లో లైవ్ చూడొచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారత కాలమానం ప్రకారం ఈ టెస్ట్ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. 7.30 నుంచి 9.30 వరకు తొలి సెషన్, 10.10 నుంచి 12.10 వరకు రెండో సెషన్, 12.30 నుంచి 2.30 వరకు చివరిదైన మూడో సెషన్ జరగనుంది. అలాగే ఈ మ్యాచ్ లైవ్‌ను దూరదర్శన్‌లో చూడొచ్చు. డీటీహెచ్‌లో మాత్రం లైవ్ రాదు. కానీ, జియో సినిమా యాప్, ఫ్యాన్ కోడ్ యాప్‌లలో సైతం మ్యాచ్ లైవ్ వీక్షించవచ్చు.
తొలి టెస్ట్ 12 నుంచి 16 వరకు, రెండో టెస్ట్ 20 నుంచి 24 వరకు జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ గెలిచి రాబోయే టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ముందంజలో ఉండాలని టీమిండియా భావిస్తోంది.
అందుకు తగ్గట్లుగానే టీమ్‌ను గట్టిగానే ప్లాన్ చేశారు. సీనియర్ బ్యాటర్ పుజారాను పక్కనపెట్టిన సెలెక్టర్లు యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌కు ఈ సిరీస్‌లో అవకాశం ఇచ్చారు. జైస్వాల్ తొలి టెస్ట్‌తోనే అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. అలాగే రోహిత్, కోహ్లీ, రహానె, గిల్, జడేజాతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. సిరాజ్, ఉమేష్ యాదవ్, ఉనద్కట్, అశ్విన్, జడేజాలతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ఒక వైపు టీమిండియా ఉత్సాహంతో బరిలోకి దిగుతుంటే.. మరోవైపు వెస్టిండీస్ మాత్రం వన్డే వరల్డ్ కప్ 2023కు క్వాలిఫై కాలేదనే నిరాశలో ఉంది. మరి ఆ బాధను అదిగమించి ఎలా పోరాడుతుందో చూడాలి. మరి తొలి టెస్ట్‌పై ఎవరి విజయావకాశలు ఎలా ఉన్నాయో కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.
ఇదీ చదవండి: పాక్‌తో మ్యాచ్ ఆడాలంటే టీమిండియా భయపడుతోంది: పాక్ క్రికెటర్