iDreamPost

పాక్‌తో మ్యాచ్‌ ఆడాలంటే టీమిండియా భయపడుతోంది: పాక్‌ క్రికెటర్‌

  • Published Jul 10, 2023 | 12:01 PMUpdated Jul 10, 2023 | 12:01 PM
  • Published Jul 10, 2023 | 12:01 PMUpdated Jul 10, 2023 | 12:01 PM
పాక్‌తో మ్యాచ్‌ ఆడాలంటే టీమిండియా భయపడుతోంది: పాక్‌ క్రికెటర్‌

భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే రెండు దేశాల అభిమానులకు పండగే. అది క్రికెట్‌ మ్యాచ్‌ కంటే కూడా మినీ యుద్ధంలా ఉంటుంది. పైగా చాలా కాలంగా ఇరు దేశాలు ఐసీసీ టోర్నీల్లో తప్పితే ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడటం లేదు. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఆ ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. అయితే.. మరికొన్ని నెలల్లో జరగనున్న ఆసియా కప్‌ 2023, వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటి కోసం క్రికెట్‌ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

అయితే.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌లు ఎందుకు జరగడం లేదనే విషయంపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ అబ్దుల్‌ రజాక్‌ స్పందిస్తూ.. టీమిండియా ఇప్పుడే కాదు గతంలో కూడా పాకిస్థాన్‌తో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. 1997-98 మధ్య కూడా ఈ రెండు దేశాల మధ్య పెద్దగా మ్యాచ్‌లు జరగలేదు. అందుకు కారణం.. టీమిండియా కంటే పాకిస్థాన్‌ టీమ్‌ చాలా బలంగా ఉండేది, పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడితే ఓడిపోతామనే భయం వారిలో ఎక్కువగా ఉండేదని రజాక్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

కాగా.. 2004లో అప్పటి టీమిండియా కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలోని భారత జట్టు ఐదు వన్డేలు, మూడు టెస్టలు ఆడేందుకు పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లింది. ఆ టూర్‌లో వన్డే సిరీస్‌ను 3-2తో అలాగే టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా గెలిచింది. అయినా కూడా రజాక్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై క్రికెట్‌ అభిమానులు నవ్వుకుంటున్నారు. ఐసీసీ టోర్నీలో 99 శాతం టీమిండియానే పైచేయి సాధించింది. అలాగే ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా టీమిండియా సత్తా చాటింది. కానీ, రజాక్‌ లాంటి సీనియర్‌ ఆటగాళ్లు ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి