iDreamPost

సౌతాఫ్రికాతో సిరీస్.. సంజూ శాంసన్​కు BCCI గోల్డెన్ ఛాన్స్

  • Author singhj Updated - 08:36 PM, Thu - 30 November 23

అవకాశాలు లేక నిరాశలో కూరుకుపోయిన యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్​కు సెలక్టర్లు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని అతడు ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.

అవకాశాలు లేక నిరాశలో కూరుకుపోయిన యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్​కు సెలక్టర్లు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు. ఈ అవకాశాన్ని అతడు ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.

  • Author singhj Updated - 08:36 PM, Thu - 30 November 23
సౌతాఫ్రికాతో సిరీస్.. సంజూ శాంసన్​కు BCCI గోల్డెన్ ఛాన్స్

సంజూ శాంసన్.. మన దేశ ప్రస్తుత క్రికెట్ ప్లేయర్లలో ఎంతో ప్రతిభ కలిగిన వారిలో ఒకడు. సరిగ్గా ఆడితే ఈపాటికే టీమిండియా రెగ్యులర్ ఆటగాడు కావాల్సింది. గత టీ20 వరల్డ్ కప్​తో పాటు ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్​లోనూ అతడు ఉండాల్సింది. కానీ సంజూ దురదృష్టమో లేదా ఏమో గానీ మంచి ప్లేయర్​గా పేరు తెచ్చుకున్నా అతడికి మాత్రం జట్టులో చోటు దక్కడం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్​తో పాపులారిటీ సంపాదించిన వారిలో సంజూ ఒకడు. బ్యాటింగ్ సమయంలో అతడి టైమింగ్, క్లాస్, షాట్ సెలక్షన్ చాలా బాగుంటుంది. క్లాస్ ప్లేయర్​గా అతడు పేరు తెచ్చుకున్నాడు. తన ఆటతీరుతోనే ఐపీఎల్​లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్​గా ప్రమోషన్ సంపాదించాడతను.

ఐపీఎల్​లో బాగా ఆడుతున్నా, డొమెస్టిక్​ లెవల్లోనూ సత్తా చాటుతున్నప్పటికీ భారత జట్టులో మాత్రం సంజూ శాంసన్​కు ఎక్కువగా అవకాశాలు దొరకడం లేదు. టీమ్ వెంట కొన్ని సిరీస్​ల పాటు తిరిగినా అతడికి అరకొరగానే ఛాన్సులు దొరికాయి. ప్లేయింగ్ ఎలెవన్​లో ఛాన్స్ దొరికినప్పుడు శాంసన్ అంతగా రాణించలేదు. ఫర్వాలేదనిపించేలానే అతడు ఆడాడు. దీంతో సెలక్టర్లు, టీమ్ మేనేజ్​మెంట్ అతడి మీద నమ్మకం ఉంచలేదు. గత టీ20 ప్రపంచ కప్​తో పాటు ఈసారి ఆసియా కప్, ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్​నకూ సంజూను సెలక్ట్ చేయలేదు. దీంతో అతడి ఫ్యూచర్ ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.

వచ్చే ఏడాది జూన్​లో టీ20 వరల్డ్‌ కప్ జరగనున్న నేపథ్యంలో సంజూ శాంసన్​ను ఆ టోర్నీలో ఆడిస్తారా? లేదా? అనే క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్​కు అతడ్ని ఎంపిక చేయకపోవడంతో టీమిండియా ప్రపంచ కప్ సన్నాహకాల్లో సంజూ ఉండకపోవచ్చునని క్లారిటీ వచ్చింది. దీంతో శాంసన్ కెరీర్​ను బీసీసీఐ నాశనం చేస్తోందంటూ అతడి ఫ్యాన్స్ విమర్శలకు దిగారు. అయితే మొత్తానికి ఏమైందో ఏమో గానీ సంజూకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది బోర్డు. త్వరలో జరగనున్న సౌతాఫ్రికా సిరీస్​కు సంజూను సెలక్ట్ చేసింది. అక్కడ జరగబోయే వన్డే సిరీస్​కు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు కల్పించింది. ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఈ అవకాశాన్ని సంజూ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. కాగా, సంజూతో పాటు మరో యంగ్​స్టర్ రజత్ పాటీదార్​కూ ఈ సిరీస్​లో ఆడే అవకాశం దొరికింది. మరి.. సౌతాఫ్రికా సిరీస్​కు సంజూను సెలక్ట్ చేయడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సౌతాఫ్రికా టీ20, వన్డే సిరీస్​కు టీమ్​ ప్రకటన.. రోహితే కెప్టెన్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి