iDreamPost

Mohammed Siraj: సౌతాఫ్రికాను పోయించిన సిరాజ్.. మియా దెబ్బకు ఫోన్ నంబర్​లా మారిన స్కోర్లు!

  • Published Jan 03, 2024 | 4:08 PMUpdated Jan 03, 2024 | 4:08 PM

రెండో టెస్ట్​లో సౌతాఫ్రికా బ్యాటర్లకు ఊపిరి తీసుకునేంత టైమ్ కూడా ఇవ్వలేదు భారత్. మన బౌలర్లు అందులోనూ సిరాజ్ దెబ్బకు ప్రొటీస్ బ్యాటర్ల స్కోర్ మొబైల్ నంబర్​ను తలపించింది.

రెండో టెస్ట్​లో సౌతాఫ్రికా బ్యాటర్లకు ఊపిరి తీసుకునేంత టైమ్ కూడా ఇవ్వలేదు భారత్. మన బౌలర్లు అందులోనూ సిరాజ్ దెబ్బకు ప్రొటీస్ బ్యాటర్ల స్కోర్ మొబైల్ నంబర్​ను తలపించింది.

  • Published Jan 03, 2024 | 4:08 PMUpdated Jan 03, 2024 | 4:08 PM
Mohammed Siraj: సౌతాఫ్రికాను పోయించిన సిరాజ్.. మియా దెబ్బకు ఫోన్ నంబర్​లా మారిన స్కోర్లు!

సఫారీ టూర్​లో టీ20లు, వన్డేల్లో అదరగొట్టిన టీమిండియా.. టెస్ట్ సిరీస్​లో తుస్సుమంది. రెండు టెస్టుల సిరీస్​లో భాగంగా సెంచూరియన్​లో జరిగిన తొలి మ్యాచ్​లో ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేన చిత్తయింది. దీంతో భారత్ పనైపోయిందని.. స్వదేశంలో పులులు, విదేశాల్లో పిల్లులు అనే విమర్శలు వినిపించాయి. హిట్​మ్యాన్​ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. బౌలింగ్​ యూనిట్​ను కూడా మార్చాలనే కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో అందరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ సెకండ్ టెస్ట్​లో చెలరేగి ఆడుతోంది భారత్. కేప్​టౌన్​ ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన ప్రొటీస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే అతడి డెసిజన్ రాంగ్ అయింది. బౌలింగ్​కు సహకరిస్తున్న పిచ్ మీద ఆతిథ్య టీమ్​ను 55 రన్స్​కే కుప్పకూల్చింది భారత్.

సఫారీ బ్యాటర్లను హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఒక రేంజ్​లో పోయించాడు. మొదటి టెస్టులో చేసిన తప్పుల్ని సరిదిద్దుకున్న ఈ స్పీడ్​స్టర్ స్వింగింగ్ డెలివరీస్​తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. పర్ఫెక్ట్ లైన్ లెంగ్త్​లో బాల్స్ వేస్తూ షాట్ కొట్టాలంటే భయపడేలా చేశాడు. రన్స్ రాకపోవడం, బాల్ ఇరువైపులా స్వింగ్ అవుతుండటంతో సఫారీ బ్యాటర్లకు ఏం చేయాలో తోచలేదు. దీంతో బ్యాట్లను అడ్డంగా ఊపుతూ దొరికేశారు. అవుట్ స్వింగర్​తో ఓపెనర్ ఎయిడెన్​ మార్క్​రమ్ (2)​ను ఔట్ చేశాడు సిరాజ్. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం బాల్స్ వేసి కెప్టెన్ ఎల్గర్​ (4)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత డేవిడ్ బెడింగ్​హామ్​ (12)ను ఔట్ స్వింగర్​తోనే మార్క్​రమ్​లాగే ఔట్ చేశాడు. కైల్ వెరైన్ (15), మార్కో జాన్సన్ (0), కేశవ్ మహారాజ్ (3)ను కూడా సిరాజే పెవిలియన్​కు చేర్చాడు.

కేప్​టౌన్ టెస్ట్ మొదటి రోజు లంచ్​లోపే 5 వికెట్లు తీసిన సిరాజ్.. మొత్తంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతడికి జస్​ప్రీత్ బుమ్రా, ముకేష్ కుమార్​ మంచి సహకారం అందించారు. వీళ్లిద్దరూ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్టబ్స్​ (3), బర్గర్ (4)ను బుమ్రా వెనక్కి పంపాడు. కేశవ్ మహారాజ్ (3), రబాడ (5)ను ముకేష్ పెవిలియన్​కు చేర్చాడు. దీంతో ఆ టీమ్ 55 రన్స్​కే ఆలౌట్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్​లో సౌతాఫ్రికా టాపార్డర్ బ్యాటర్ల స్కోర్లు ఇలా ఉన్నాయి.. 2, 4, 2, 3, 0, 3. ఇది మొబైల్ నంబర్​ను తలపించింది. దీన్ని బట్టే ఆ టీమ్ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పిచ్ నుంచి బౌలర్లకు సపోర్ట్ దొరుకుతుందని తెలిసినా ఆ జట్టు సారథి ఎల్గర్​ తీసుకున్న డెసిజన్ రాంగ్ అని నెటిజన్స్ అంటున్నారు. అదే టైమ్​లో సిరాజ్​తో పాటు మిగిలిన భారత బౌలర్లు బౌలింగ్ చేసిన విధానాన్ని మెచ్చుకుంటున్నారు. సిరాజ్​ మ్యాజికల్ స్పెల్ అద్భుతమని ప్రశంసిస్తున్నారు. మరి.. కేప్​టౌన్ టెస్ట్​లో భారత బౌలర్ల బౌలింగ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IND vs SA: వీడియో: రోహిత్ మాస్టర్ ప్లాన్.. చిచ్చర పిడుగును బుట్టలో భలే పడేశాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి