టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి విషయంలో బీసీసీఐ తప్పు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడి కెరీర్ డేంజర్లో ఉందని అంటున్నారు.
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి విషయంలో బీసీసీఐ తప్పు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడి కెరీర్ డేంజర్లో ఉందని అంటున్నారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. 5 టీ20ల ఈ సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో సొంతం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కంగారూలతో సిరీస్‌ను కైవసం చేసుకుంది మన టీమ్. ఈ టీ20 సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా సౌతాఫ్రికాకు వెళ్లనుంది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఇప్పటికే ఈ టూర్‌కు వెళ్లే ప్లేయర్ల లిస్ట్‌ను ప్రకటించింది బీసీసీఐ. మూడు ఫార్మాట్లకు ఈసారి ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను బోర్డు ప్రకటించింది. లాంగ్ ఫార్మాట్లో రోహిత్ శర్మ, వన్డేల్లో కేఎల్ రాహుల్, పొట్టి ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్‌లు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
సౌతాఫ్రికా టూర్‌కు ముగ్గురు కెప్టెన్ల ఫార్ములాను ప్రయోగించడం వెనుక ఓ కారణం ఉంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో కేవలం టెస్టుల్లోనే ఆడతానని చెప్పాడు. రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌కు తనను దూరంగా ఉంచాలని బోర్డును హిట్‌మ్యాన్ కోరాడట. దీంతో వన్డే టీమ్ పగ్గాలను రాహుల్‌కు అప్పజెప్పారు. టీ20ల్లో టీమ్‌ను నడిపించాల్సిన హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో సిరీస్‌లో కెప్టెన్‌గా ఆకట్టుకున్న సూర్యకుమార్‌కు సఫారీ సిరీస్‌లోనూ కెప్టెన్సీ బాధ్యతలను అప్పజెప్పింది. కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ చేసిన మార్పులు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
సఫారీ టూర్లో రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సీనియర్ పేసర్ మహ్మద్ షమి కూడా కేవలం టెస్టులకే పరిమితం కానున్నారు. వీళ్లిద్దరూ కూడా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతోనే మిగిలిన రెండు ఫార్మాట్లకు దూరంగా ఉంటామని బోర్డుకు చెప్పారట. దీనికి అనుమతించిన బీసీసీఐ.. వన్డేలు, టీ20లకు వాళ్లిద్దర్నీ సెలక్ట్ చేయలేదు. అయితే షమి విషయంలో భారత క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు మీద మాత్రం విమర్శలు వస్తున్నాయి. చీలమండ గాయంతో బాధపడుతున్న షమీని అసలు ఈ సిరీస్‌కు ఎందుకు సెలక్ట్ చేశారనే ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రస్తుతం ముంబైలోని ఒక ఆర్థోపెడిక్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట షమి. అతడి గాయం గురించి సమాచారాన్ని బోర్డే వెల్లడించింది. అలాంటప్పుడు ఇంజ్యురీతో బాధపడుతున్నాడని ముందే తెలిసినా సౌతాఫ్రికా సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేశారనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకవేళ ఆ టూర్‌కు వెళ్లే లోపు కోలుకుంటే ఆడిద్దామనే ఆలోచనతోనే అలా చేసుంటారని వినిపిస్తోంది. అలా చేస్తారనే అనుకుందాం.. అప్పుడు ఇంజ్యురీ నుంచి పూర్తిగా రికవర్ కాకుండా ఆడించడం రాంగ్ అవుతుంది. సౌతాఫ్రికా సిరీస్‌లో యంగ్‌స్టర్స్ విషయంలో ప్రయోగాలు చేస్తే ఓకే.
రాబోయే టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ సిరీస్‌లో ఎంతో కీలకంగా భావిస్తున్న షమీని గాయంతో ఇబ్బంది పడుతున్నా ఆడించడం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అందులోనూ ఫిట్నెస్ ఎంతో కీలకమైన టెస్టుల్లో ఆడిస్తే.. ఒకవేళ గాయం తిరగబెడితే అతడి కెరీర్ డేంజర్లో పడే ప్రమాదం ఉంది. అందుకే షమి విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. సీనియర్ పేసర్‌కు కావాల్సినంత రెస్ట్ ఇచ్చి.. రికవర్ అయ్యాక ఆడించాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఇలాంటి విలువైన ప్లేయర్‌ను కాపాడుకోవాలని చెబుతున్నారు. మరి.. షమి విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs AUS: టీమిండియా బ్యాటర్‌కు సారీ చెప్పిన అంపైర్! ఎందుకంటే..?
Team India’s star pacer Mohammed Shami is currently undergoing treatment for an ankle injury, ahead of travelling to South Africa for the test series which starts from December 26.
Watch the video for more details.@MdShami11 @debasissen @ThumsUpOfficial #INDvsSA pic.twitter.com/ia0cwdhjDN
— RevSportz (@RevSportz) December 2, 2023