SNP
SNP
భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ విషయం.. మన దేశంలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్‌తో టీమిండియా ఆడాల్సిన మ్యాచ్ వాయిదా పడనున్నట్లు సమాచారం. అసలు మ్యాచ్ ఉంటుందా? ఉండదా? అని కంగారు పడకండి. మ్యాచ్ అయితే కచ్చితంగా ఉంటుంది. కానీ, ముందుగా ప్రకటించిన తేదీ(అక్టోబర్ 15)న కాకుండా మరో రోజు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరపనున్నారు. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ వాయిదా విషయాన్ని బీసీసీఐ, ఐసీసీ అధికారికంగా ప్రకటించకపోయినా.. క్రికెట్ అభిమానుల్లో మాత్రం ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది.
వాయిదా ఎందుకు?
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆసక్తికలిగించే పోరు ఏదైనా ఉందంటే అది ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. అదో మినీ యుద్ధం. ఇతర జట్లు ఆడే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై సైతం అంతమంది క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపిస్తారో లేదో తెలియదు కానీ, ఇండియా-పాకిస్థాన్ జట్లు లీగ్ మ్యాచ్‌లో తలపడినా భారీ హైప్ ఉంటుంది. పైగా ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగడం లేదు కనుక.. ఐసీసీ టోర్నీల్లోనే ఈ దాయాదుల పోరు చూడాల్సి వస్తుంది.
ఇంతటి భారీ క్రేజ్ ఉన్న మ్యాచ్‌ను ఎందుక వాయిదా వేస్తున్నారనే అనుమానం అందరిలో కలుగుతుంది. అయితే.. అక్టోబర్ 15న నవరాత్రి తొలి రోజు కావడంతో కేంద్ర సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతపై బీసీసీఐని హెచ్చరించినట్లు సమాచారం. ఆ రోజు జరగాల్సి ఉన్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఒక రోజు ముందు లేదా తర్వాతి రోజు నిర్వహించుకోవాల్సిందిగా బీసీసీఐకి సూచించినట్లు తెలుస్తుంది. దీంతో బీసీసీఐ, ఐసీసీతో చర్చలు జరిపి మ్యాచ్ తేదీని మార్చే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలన కామెంట్ల రూపంలో తెలియజేయండి.
India vs Pakistan match in World Cup 2023 is likely to be rescheduled because of the Navaratri’s first day. (To Indian Express) pic.twitter.com/5FloM8bD4h
— CricketMAN2 (@ImTanujSingh) July 26, 2023
ఇదీ చదవండి: జహీర్ ఖాన్-కోహ్లీ గురించి సంచలన విషయం బయటపెట్టిన ఇషాంత్ శర్మ