iDreamPost

జహీర్‌ ఖాన్‌-కోహ్లీ గురించి సంచలన విషయం బయటపెట్టిన ఇషాంత్‌ శర్మ

  • Published Jul 26, 2023 | 10:49 AMUpdated Jul 26, 2023 | 11:49 AM
  • Published Jul 26, 2023 | 10:49 AMUpdated Jul 26, 2023 | 11:49 AM
జహీర్‌ ఖాన్‌-కోహ్లీ గురించి సంచలన విషయం బయటపెట్టిన ఇషాంత్‌ శర్మ

టీమిండియా మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌.. భారత క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ పేస్‌ బౌలర్లలో ఒకడు. టీమిండియా సాధించిన ఎన్నో విజయాల్లో జహీర్‌ పాత్ర కీలక పాత్ర పోషించాడు. తన లెఫ్ట్‌ఆర్మ్‌ పేస్‌, స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణించాడు. టీమిండియా 2011లో వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిందంటే అందులో జహీర్‌ ఖాన్‌ పాత్ర కూడా ఎంతో ఉంది. భారత్‌ తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 282, టీ20ల్లో 17 వికెట్లు పడగట్టాడు. ఇంత గొప్ప గణాంకాలు ఉన్నా.. టీమిండియా తరఫున 100 టెస్టులు ఆడకుండానే కెరీర్‌ను ముగించాడు. అయితే.. అందుకు టీమిండియా మాజీ విరాట్‌ కోహ్లీనే కారణమంటూ భారత మరో మాజీ క్రికెటర్‌ ఇషాంత్‌ శర్మ బాంబు పేల్చాడు.

వెస్టిండీస్‌-భారత్‌ మధ్య సిరీస్‌లో ఇషాంత్‌ శర్మ, జహీర్‌ ఖాన్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇషాంత్‌ శర్మ ఓ సంచలన విషయం బయటపెట్టాడు. ‘2014లో ఇండియా న్యూజిలాండ్‌ టూర్‌కు వెళ్లింది. రెండో టెస్టులో న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ బ్రాండెన్‌ మెక్‌కల్లమ్‌ ఏకంగా ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగాడు. అయితే.. ఆ సంచలన ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే మెక్‌కల్లమ్‌కు భారీ లైఫ్‌ దొరికింది. అది కూడా ప్రపంచంలోనే గొప్ప ఫీల్డర్లలో ఒకడైన విరాట్‌ కోహ్లీ క్యాచ్‌ జారవిడువడంతో బతికిపోయిన మెక్‌కల్లమ్‌.. 300 పరుగులతో రెచ్చిపోయాడు. జహీర్‌ ఖాన్‌ బౌలింగ్‌లో మెక్‌కల్లమ్‌ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ వదిలేశాడు. దానికి టీమిండియా తగిన మూల్యం చెల్లించుకుంది.

క్యాచ్‌ వదిలేసినందుకు కోహ్లీ.. లంచ్‌ సమయంలో జహీర్‌కు సారీ చెప్పాడు. దానికి జహీర్‌.. పర్వాలేదు, నువ్వేం బాధపడకు మనం అతన్ని అవుట్‌ చేస్తాం అని అన్నాడు. సాయంత్రం టీబ్రేక్‌ సమయంలో మళ్లీ సారీ చెప్పాడు కోహ్లీ.. ఈసారి కూడా జహీర్‌.. పర్వాలేదులే అని అన్నాడు. కానీ టీ సమయంలో కోహ్లీ మళ్లీ సారీ చెప్పడంతో.. నువ్వు నా కెరీర్‌ను ముగించావ్‌ అని జహీర్‌ ఖాన్‌ చెప్పాడు’ అని ఇషాంత్‌ శర్మ పేర్కొన్నాడు. మెక్‌కల్లమ్‌ బాదుడికి జహీర్‌ భారీగా పరుగులు ఇచ్చాడు. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లు బౌలింగ్‌ వేసిన జహీర్‌ 170 పరుగుల సమర్పించుకున్నాడు. కానీ ఐదు వికెట్లతో కూడా రాణించాడు. చివరికి మెక్‌కల్లమ్‌ను జహీరే అవుట్‌ చేసినా ఫలితం లేకుండా పోయింది. మొత్తానికి ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. అదే జహీర్‌ ఖాన్‌ టెస్ట్‌ కెరీర్‌లో చివరి మ్యాచ్‌ అయింది. ఆ తర్వాత జహీర్‌ టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

కాగా, ఇషాంత్‌ శర్మ చెప్పిన విషయంపై వెంటనే స్పందించిన జహీర్‌ ఖాన్‌.. ‘తాను కోహ్లీతో అలా చెప్పలేదని.. నేను కోహ్లీతో ఏం చెప్పానంటే.. ప్రపంచంలో ఇద్దరే ఆటగాళ్లు ఉన్నారు. అందులో మొదటి వాడు కిరణ్‌ మోరే. అతను గ్రాహం గూచ్‌ క్యాచ్‌ వదిలేయడంతో ట్రిపుల్‌ సెంచరీ చేశాడు. ఇప్పుడు నువ్వు, క్యాచ్‌ వదిలేయడంతో ఒక వ్యక్తి ట్రిపుల్‌ సెంచరీ చేశాడని చెప్పిటన్లు జహీర్‌ వెల్లడించాడు. దానికి కోహ్లీ.. అలా అనొద్దని తనతో చెప్పినట్లు’ పేర్కొన్నాడు. ఆ క్యాచ్‌ వదిలేసినందుకు కోహ్లీ ఎంతో బాధపడినట్లు జహీర్‌ తెలిపాడు. అదే మ్యాచ్‌ టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీనే సెంచరీ చేసి మ్యాచ్‌ను డ్రా చేసిన విషయం గుర్తు చేశాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఎప్పుడైనా గమనించారా? జహీర్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ రికార్డులన్నీ సేమ్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి