ఆసియా కప్-2023లో టీమిండియా దూసుకెళ్తోంది. సూపర్-4 దశలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 228 రన్స్ తేడాతో గెలిచి.. ఫైనల్ అవకాశాలను గణనీయంగా మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆదివారం టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా వర్షం వల్ల మ్యాచ్ నిలిచేపోయే టైమ్‌కు 147/2తో నిలవగా.. రిజర్వ్ డే అయిన సోమవారం ఇన్నింగ్స్‌ను కొనసాగించి మరో వికెట్ కోల్పోకుండా ఏకంగా 356 పరుగుల భారీ స్కోరు చేసింది. సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (122 నాటౌట్)తో పాటు చాన్నాళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్న కేఎల్ రాహుల్ (111 నాటౌట్) అజేయ శతకాలతో అదరగొట్టారు.
బౌలింగ్‌లో ఫ్లాప్ అయిన పాకిస్థాన్ బ్యాటింగ్‌లోనైతే అట్టర్ ఫ్లాప్ అయింది. ఛేజింగ్‌లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/25) ధాటికి దాయాది జట్టు 128 రన్స్‌కే కుప్పకూలింది. ఇంజ్యురీ కారణంగా పేసర్లు హ్యారిస్ రౌఫ్, నసీమ్ షా బ్యాటింగ్‌కు రాకపోవడంతో 8 వికెట్లకే ఆ టీమ్ ఇన్నింగ్స్ ముగించింది. పాక్‌పై భారీ విక్టరీతో ఊపు మీదున్న భారత్.. తన తర్వాతి సూపర్-4 మ్యాచ్‌లో మంగళవారం శ్రీలంకను ఢీకొంటుంది. ఇదిలా ఉంటే.. టీమిండియాపై ఓటమి బాధ నుంచి కోలుకోక ముందే పాకిస్థాన్‌కు మరో బిగ్‌షాక్ తగిలినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ పేసర్లు హ్యారీస్ రౌఫ్, నసీం షా గాయం కారణంగా ఆసియా కప్-2023 మొత్తానికి దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా వీళ్లిద్దరూ గాయపడ్డారు.
రౌఫ్ పూర్తిగా రిజర్వ్ డే నాడు గ్రౌండ్లోకి అడుగుపెట్టలేదు. నసీం షా బ్యాటింగ్ చేయలేదు. ప్రధాన పేసర్లు గాయాలపాలవ్వడంతో వీళ్లకు బ్యాకప్‌గా యువ పేసర్లు షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్లకు పాక్ క్రికెట్ పిలుపునిచ్చింది. ఈ ఇద్దరు యంగ్‌స్టర్స్ మంగళవారం పాక్ టీమ్‌తో కలవనున్నారు. రౌఫ్, నసీం గాయంపై పాక్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన చేసింది. వీళ్లిద్దరూ మెడికల్ ప్యానెల్ పరిశీలనలో ఉంటారని తెలిపింది. వాళ్ల గాయాలు అంత తీవ్రమైనవి కాదని చెప్పింది. అయితే త్వరలో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో రిస్క్ చేయకూడదని అనుకుంటున్నట్లు పేర్కొంది. ఒకవేళ షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్‌లను భర్తీ చేయాలనుకుంటే ఏసీసీ టెక్నికల్ కమిటీ అనుమతి తీసుకుంటామని పీసీబీ వివరించింది.
ఇదీ చదవండి: VIDEO: హారీస్ రౌఫ్ ఓవరాక్షన్‌కు బుద్ధి చెప్పిన రోహిత్-కోహ్లీ!
Shahnawaz Dahani and Zaman Khan have been added to Pakistan’s Asia Cup squad as a cover up for Naseem and Rauf. pic.twitter.com/c9GfU0U73y
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2023