iDreamPost

పాక్ స్టార్ బౌలర్​ను కలసిన కోహ్లీ.. ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలంటున్న ఫ్యాన్స్!

  • Author singhj Published - 10:19 AM, Sat - 2 September 23
  • Author singhj Published - 10:19 AM, Sat - 2 September 23
పాక్ స్టార్ బౌలర్​ను కలసిన కోహ్లీ.. ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలంటున్న ఫ్యాన్స్!

ఆసియా కప్-2023లో ప్రతిష్టాత్మక పోరుకు సర్వం సిద్ధమైంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్​ మరికొద్ది గంటల్లో మొదలవ్వనుంది. ఈ మ్యాచ్​లో ఎవరు గెలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. గత ఆసియా కప్​లో గ్రూప్ దశలో పాక్​పై ఇండియా నెగ్గగా.. సూపర్-4 దశలో మాత్రం పాకిస్థాన్​దే పైచేయి అయింది. దీంతో దాయాదుల మధ్య ఇవాళ్టి పోరులో ఎవరు గెలుస్తారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఇక, పాక్​తో మ్యాచ్​ అంటే చాలు.. విరాట్ కోహ్లీ చెలరేగుతాడు. గతేడాది టీ20 ప్రపంచ కప్​లో పాక్​పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్​ను ఎవరూ మర్చిపోలేరు.

గత టీ20 వరల్డ్ కప్​లో పాకిస్థాన్ మీద మ్యాచ్​లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్​లో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఆ మ్యాచ్​లో దాయాది జట్టు స్టార్ పేసర్ హారిస్ రవూఫ్ బౌలింగ్​లో కోహ్లీ బాదిన భారీ సిక్సర్​ ఇప్పటికీ ఫ్యాన్స్ కళ్ల ముందు కదలాడుతోంది. ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ ఇండియా-పాకిస్థాన్​లు తలపడలేదు. చాన్నాళ్ల తర్వాత ఆసియా కప్​లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. శనివారం శ్రీలంకలోని పల్లెకెలే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

కీలకమైన ఈ మ్యాచ్ కోసం స్టేడియంలో ప్రాక్టీస్ చేయడానికి టీమిండియా, పాకిస్థాన్ జట్లు వచ్చాయి. రెండు జట్లూ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని చూసిన పాక్ పేసర్ హ్యారిస్ రవూఫ్ అతడి దగ్గరకు వచ్చి కలిశాడు. విరాట్​ను రవూఫ్​ కౌగిలించుకున్నాడు. కోహ్లీ కూడా పాక్ పేసర్​ను నవ్వుతూ పలకరించాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ గతేడాది వరల్డ్ కప్​లో పాక్ పై ఆడిన ఇన్నింగ్స్​ను రిపీట్ చేయాలని అంటున్నారు. రవూఫ్ బౌలింగ్​లో మళ్లీ రెచ్చిపోయి ఆడాలని కోరుకుంటున్నారు.

ఇదీ చదవండి: ఇండో-పాక్ మ్యాచ్​కు సర్వం సిద్ధం.. వాన పడితే ఏంటి పరిస్థితి?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి