iDreamPost
android-app
ios-app

భారత్​కు అనుకూలంగా రికార్డులు.. ఆ ఇద్దరు చెలరేగితే విజయం మనదే!

  • Author singhj Published - 12:46 PM, Sat - 2 September 23
  • Author singhj Published - 12:46 PM, Sat - 2 September 23
భారత్​కు అనుకూలంగా రికార్డులు.. ఆ ఇద్దరు చెలరేగితే విజయం మనదే!

వరల్డ్ కప్​కు ట్రయల్స్​గా భావించే మినీ టోర్నీనే ఆసియా కప్. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో సత్తా చాటేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమైంది. ఇవాళ జరిగే తొలి మ్యాచ్​లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే ఆడిన మొదటి మ్యాచ్​లో పసికూన నేపాల్​ను చిత్తుచేసింది పాక్. దీంతో మరింత ఆత్మవిశ్వాసంతో భారత్​తో పోరుకు ముందుకు సాగుతోంది. ఇరు జట్లు విజయం కోసం ఆఖరి వరకు పోరాడటతాయి కాబట్టి అసలైన వినోదాన్ని ఆస్వాదించేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు.

జట్ల పరంగా చూసుకుంటే భారత్​, పాక్.. రెండూ బలంగా ఉన్నాయి. ఆ మధ్య కాస్త వీక్​గా కనిపించిన పాకిస్థాన్ ఇప్పుడు బలంగా తయారైంది. ముఖ్యంగా పేస్ త్రయం షాహిన్ అఫ్రిది, హ్యారిస్ రౌఫ్​, నసీం షా రూపంలో పవర్​ఫుల్ పేసర్లు ఆ జట్టులో ఉన్నారు. వీళ్లు గనుక చెలరేగితే ఎదుర్కోవడం ఎంతటి బ్యాట్స్​మెన్​కైనా కష్టమే. నియంత్రణతో కూడిన పేస్, వైవిధ్యం, స్వింగ్​తో కూడిన బంతులను ఫేస్ చేయాలంటే బ్యాట్స్​మన్​ ఎంతో ఓపిగ్గా ఉండాలి. పాక్ జట్టులో మంచి బ్యాటర్లు ఉన్నప్పటికీ ఆ టీమ్ మెయిన్ బలం పేసర్లేనని విశ్లేషకులు అంటున్నారు. ఒకరకంగా ఇది భారత బ్యాటింగ్​కు పాక్ బౌలింగ్​కు మధ్య జరిగే యుద్ధమని చెబుతున్నారు.

భారత్, పాక్​ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న పల్లెకెలెలో రికార్డులు మాత్రం టీమిండియాకు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ భారత్ చివరగా శ్రీలంకతో వన్డే మ్యాచ్​ ఆడింది. ఇందులో తొలుత బ్యాటింగ్​కు దిగిన లంకను భారత బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ముఖ్యంగా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా (5/27) రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. ఇక, 218 పరుగుల లక్ష్య ఛేదనలో హిట్​మ్యాన్ రోహిత్ శర్మ (145 బంతుల్లో 124 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో టీమిండియా అలవోకగా విజయతీరాలకు చేరుకుంది. ఒకవేళ పాక్​తో మ్యాచ్​లోనూ బుమ్రా, రోహిత్ చెలరేగితే భారత్​కు తిరుగుండదని ఫ్యాన్స్ అంటున్నారు. పల్లెకెలెలో ఆ ఇద్దరు ప్లేయర్లు మరోమారు చెలరేగితే చాలు.. విజయం మనదేనని చెబుతున్నారు. మరి.. బుమ్రా, రోహిత్ బాగా ఆడి ఫ్యాన్స్ ఆశల్ని నిలబెడతారో లేదో చూడాలి.

ఇదీ చదవండి: టాస్ ఓడితే భారత్​కు ఓటమి తప్పదా?