వన్డే వరల్డ్ కప్-2023 మ్యాచులకు క్రేజ్ రోజురోజుకీ మరింత పెరుగుతోంది. టోర్నీ ఆరంభంలో స్టేడియాలు ఖాళీగా కనిపించడంతో అసలు జరుగుతోంది ప్రపంచ కప్పేనా? అనే సందేహం చాలా మందిలో కలిగింది. కానీ మ్యాచ్‌లు ఆసక్తిగా జరుగుతుండటంతో అందరి ఫోకస్ మెగా టోర్నీపై పడింది. స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తుండటం, ఆస్ట్రేలియా లాంటి ఛాంపియన్ టీమ్ వరుసగా ఓడిపోవడం కూడా టోర్నీపై ఫ్యాన్స్‌లో ఇంట్రెస్ట్‌ను మరింత పెంచేసింది. అయితే వరల్డ్ కప్‌పై క్రేజ్, పాపులారిటీని మరింత పెంచేందుకు ఒక బిగ్ గేమ్ వచ్చేస్తోంది. అదే భారత్-పాకిస్థాన్ మ్యాచ్.
క్రికెట్లో ఇండియా-పాక్ మ్యాచ్ చాలా స్పెషల్ అనేది తెలిసిందే. ఈ చిరకాల ప్రత్యర్థులు గ్రౌండ్లో కొదమసింహాల్లా తలపడుతుంటే చూసి ఎంజాయ్ చేయాలని అభిమానులు కోరుకుంటారు. ఎట్టకేలకు ఆ తరుణం వచ్చేసింది. ఈ వరల్డ్ కప్‌లో భాగంగా దాయాదుల పోరుకు అంతా రెడీ అయింది. ఈ మ్యాచ్‌తో వరల్డ్ కప్ ఫీవర్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్-పాక్ మ్యాచ్‌కు టికెట్లన్నీ ఎప్పుడో బుక్ అయిపోయాయి. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానున్న సంగతి తెలిసిందే. అహ్మాదాబాద్‌కు క్రికెట్ ఫ్యాన్స్ పోటెత్తుతున్నారు. అక్కడ హోటల్ రూమ్స్‌కు మస్త్ డిమాండ్ ఏర్పడింది.
అహ్మదాబాద్‌లో రూ.వేలు పలికే ఒక్కో రూమ్ రేట్ కాస్తా ఇప్పుడు రూ.లక్షల్లో పలుకుతోందట. దీంతో హోటల్ రూమ్స్ దొరకనివాళ్లు, అంత ధర పెట్టి రూమ్స్‌లో ఉండలేని వాళ్లు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. హాస్పిటల్స్‌లో బెడ్స్‌ను బుక్ చేసుకుంటున్నారు. దీంతో అహ్మదాబాద్‌లో హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఒక క్రికెట్ మ్యాచ్ కోసం ఇలా ఆస్పత్రుల్లోని బెడ్స్ బుక్ చేయడం బహుశా హిస్టరీలో ఇదే తొలిసారి కావొచ్చు. దీనిపై అహ్మదాబాద్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సీరియస్ అయ్యింది. పేషెంట్ల కోసమే ఆస్పత్రులు ఉన్నాయని.. రోగులు కాని వారి కోసం కాదని స్పష్టం చేసింది. మరి.. మ్యాచ్ కోసం ఆస్పత్రుల్లో బెడ్స్ బుక్ చేసుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సామాన్యుడికి సత్కారం.. ఎవరితను?
Numerous hospitals in Ahmedabad have experienced sudden influx of patients seeking check-ups
Read more: https://t.co/ylo8WzsIzH#PAKvIND #CWC23 pic.twitter.com/OlgeUzagVG
— Geo Super (@geosupertv) October 12, 2023