iDreamPost
android-app
ios-app

కోహ్లీ విషయంలో తప్పు చేస్తే భారీ మూల్యం తప్పదు: గవాస్కర్

  • Author singhj Published - 03:08 PM, Sat - 2 September 23
  • Author singhj Published - 03:08 PM, Sat - 2 September 23
కోహ్లీ విషయంలో తప్పు చేస్తే భారీ మూల్యం తప్పదు: గవాస్కర్

క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు ఎట్టకేలకు రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్​లు తలపడుతుంటే చూడాలనుకునే వారికి ఇవాళ పండుగ అనే చెప్పాలి. ఆసియా కప్-2023లో భాగంగా ఇండో-పాక్​లు శనివారం శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో తలపడనున్నాయి. ఈ హై టెన్షన్ మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది. వరుణుడు మ్యాచ్​కు ఆటంకం కలిగిస్తాడనే సందేహాలు నెలకొన్నప్పటికీ.. అలాంటి సంకేతాలు కనిపించకపోవడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. మరికొన్ని నిమిషాల్లో రెండు కొదమ సింహాల మధ్య ఉత్కంఠ పోరు జరగనుంది.

ప్రపంచ క్రికెట్​లో బిగ్గెస్ట్​ ఫైట్​కు అంతా సిద్ధమైన వేళ భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ విషయంలో టీమిండియా జాగ్రత్తగా ఉండాలని అన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో తప్పులు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. కోహ్లీని ఎప్పటిలాగే తనకు ఇష్టమైన, బాగా ఆడే మూడో ప్లేసులోనే బ్యాటింగ్​కు పంపాలని గవాస్కర్ సూచించాడు. పాక్​తో మ్యాచ్​లో విరాట్​ను నాలుగో పొజిషన్​లో ఆడించాలని కొంత మంది మాజీ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో గవాస్కర్ పైవిధంగా స్పందించాడు.

పాకిస్థాన్​తో మ్యాచ్​కు కేఎల్ రాహుల్ దూరమవ్వడంతో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్​కు జట్టులో చోటు ఖాయమైంది. అయితే మిడిలార్డర్​లో అంతగా అనుభవం లేని ఇషాన్ కిషన్​.. కెప్టెన్ రోహిత్ శర్మ​తో కలసి భారత ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో రెగ్యులర్ ఓపెనర్ శుబ్​మన్ గిల్​ను మూడో స్థానంలో, విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు పంపాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో లెజెండ్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్​ను అస్సలు మార్చొద్దన్నాడు.

విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన ఆటగాడు. అలాంటి ప్లేయర్​కు ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇవ్వాలి. కోహ్లీ మూడో ప్లేస్​లో వస్తేనే గరిష్ట సంఖ్యలో ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం లభిస్తుంది. ఆ పొజిషన్​లో బ్యాటింగ్​కు వచ్చి అతడు 43 సెంచరీలు బాదాడు. ఛేజింగ్​లోనూ ఒంటిచేత్తో విజయాలు అందించాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ విరాట్ బ్యాటింగ్ స్థానం మార్చకూడదు’ అని గవాస్కర్ సూచించాడు. మరి.. కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్ గురించి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: రోహిత్​వి మతిలేని మాటలు.. మండిపడ్డ భారత లెజెండ్!