Nidhan
భారత యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్‌కు మరోమారు అన్యాయం జరిగింది. ఒకే సిరీస్‌లో అతడికి ఇలా జరగడం ఇది రెండోసారి.
భారత యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్‌కు మరోమారు అన్యాయం జరిగింది. ఒకే సిరీస్‌లో అతడికి ఇలా జరగడం ఇది రెండోసారి.
Nidhan
అసలైన బజ్‌బాల్ అంటే ఏంటో ఇంగ్లండ్ జట్టుకు మరోమారు రుచి చూపించింది రోహిత్ సేన. విధ్వంసక బ్యాటింగ్, నిఖార్సయిన బౌలింగ్‌తో ఇంగ్లీష్ టీమ్‌ను చిత్తు చేసింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఏకంగా 434 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది టీమిండియా. మన జట్టు నిర్దేశించిన టార్గెట్‌ను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది ఇంగ్లండ్. పరుగుల పరంగా చూసుకుంటే భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇదే అతిపెద్ద విజయం. అయితే ఈ విక్టరీలో యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కాంట్రిబ్యూషన్ గురించి స్పెషల్‌గా చెప్పాలి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగులు మాత్రమే చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. భారత్‌కు సూపర్ లీడ్ అందించాడు. అయినా అతడికి అన్యాయం జరిగింది. ఈ సిరీస్‌లో ఇలా జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
రెండో ఇన్నింగ్స్‌లో 236 బంతుల్లో 214 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు జైస్వాల్. అతడి ఇన్నింగ్స్‌లో 14 బౌండరీలతో పాటు 12 భారీ సిక్సులు ఉన్నాయి. అండర్సన్, వుడ్ సహా ఇంగ్లండ్ బౌలర్లందరికీ ఓ రేంజ్లో పోయించాడు జైస్వాల్. ఫోర్ల మీద ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్టోక్స్ సేనను షేక్ చేశాడు. అతడి కారణంగా మంచి లీడ్ దక్కడం, ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టు ఛేజింగ్ స్టార్ట్ చేసి 122కే ఆలౌట్ అవడం తెలిసిందే. అయితే విజయంలో కీలకపాత్ర పోషించిన జైస్వాల్‌కు అన్యాయం జరిగింది. అతడికి కాదని స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 7 వికెట్లు తీసిన జడ్డూ.. బ్యాట్‌తోనూ చెలరేగి తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేశాడు. సెంచరీ చేయడం, ఏడు వికెట్లు కూడా తీయడంతో ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్ కింద అవార్డు కొట్టేశాడు జడేజా.
డబుల్ సెంచరీ బాదినా జైస్వాల్‌కు అవార్డు రాలేదు. బ్యాట్, బంతితో చెలరేగిన జడ్డూనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం వరించింది. దీంతో జైస్వాల్ నిరాశలో కూరుకుపోయాడు. వైజాగ్ టెస్టులోనూ డబుల్ సెంచరీతో అలరించాడతను. మొదటి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు చేశాడు జైస్వాల్. అయినా ఆ మ్యాచ్‌లో అతడికి అవార్డు రాలేదు. సెకండ్ టెస్టులో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మొత్తంగా ఆ మ్యాచ్‌లో అతడు 9 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ పతనాన్ని శాసించడం, మ్యాచ్‌ను అతడే మలుపు తిప్పడం, లో స్కోరింగ్ మ్యాచ్‌లో విజయంలో కీలకపాత్ర పోషించడంతో బుమ్రాకు అవార్డు దక్కింది. వరుసగా రెండు డబుల్స్ కొట్టినా రెండుసార్లూ పురస్కారం రాకపోవడంతో జైస్వాల్‌కు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. వరుసగా రెండోసారి అతడికి ఇలా జరిగిందని సీరియస్ అవుతున్నారు. అయితే నిరాశ పడొద్దని.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అతడికే దక్కుతుందని మరికొందరు నెటిజన్స్ అంటున్నారు. మరి.. జైస్వాల్‌కు జరిగిన అన్యాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rohit Sharma: ఆ డేర్ చేసిన తొలి కెప్టెన్ రోహిత్ శర్మ! ఇంగ్లండ్ అహంపై కొట్టాడు!
Ravindra Jadeja won the player of the match award for his outstanding performances.
– Sir Jadeja. pic.twitter.com/I7MryZytuK
— CricketMAN2 (@ImTanujSingh) February 18, 2024
2 DOUBLE HUNDREDS AT THE AGE OF 22. 🤯
Take a bow, Jaiswal….!!!!pic.twitter.com/oJyP1AZsIw
— Johns. (@CricCrazyJohns) February 18, 2024